Chiranjeevi : చిరంజీవి మాటలకు కన్నీరు పెట్టుకున్న రఘుకుంచె.. అన్నం కూడా తినలేదట..
Chiranjeevi : రఘు కుంచె టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరు పరిచయమే.. ఆయన పలు మావీస్‌లో యాక్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రఘు కుంచెకు మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకే డిగ్రీని మధ్యలో మానేసి హైదరాబాద్ కు వచ్చాడు. బీఏ మ్యూజిక్‌లో చేరాడు. అదే టైంలో మూవీస్ చాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్న పూరి జగన్నథ్ తో రఘుకు పరిచయడం ఏర్పడింది. ఇలా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒకే రూంలో ఉంటూ చాన్సుల కోసం ఎదురుచూసేవారు. రూంలో రఘు పాడిన ఓ పాటను విన్న పూరి.. తన మొదటి మూవీలో చాన్స్ ఇస్తానని మాటిచ్చాడు.
తర్వాత వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాన్స్ దక్కింది పూరికి. కొన్ని రోజులకే బద్రి మూవీని చేసే అవకాశం వచ్చింది. అది పూరిజగన్నాథ్ ఫస్ట్ మూవీ. ఇది పెద్ద ప్రాజెక్టు కావడంతో రఘుకు చాన్స్ ఇవ్వలేకపోయాడు. తర్వాత బాచి మూవీలో లక్ష్మీ అనే పాటను పాడే చాన్స్ ఇచ్చాడు.మృగరాజు మూవీ డబ్బింగ్ జరుగుతున్న టైంలో చిరంజీవిని చూశాడు రఘు. బాచి మూవీలో తాను పాడిన పాటకు సంబంధించిన సీడీని చిరంజీవికి ఇచ్చాడు. దాన్ని విన్న చిరంజీవి రఘుకు ఫోన్ చేసి ప్రశంసలు కురిపించారు. పాట చాలా బాగుందని మెచ్చుకున్నాడు.
Chiranjeevi : ఆ రోజంతా అన్నం తినలేదట..
దీంతో రఘు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆయన కళ్ల వెంట నీరు వచ్చాయి. ఆ రోజంతా తిండి సైతం తినలేదట. చిరంజీవి మెచ్చుకున్న విషయాన్ని తన బంధువులతో, స్నేహితులతో చెప్పుకుని చాలా ఖుషీ అయ్యారట. దీనితో పాటు మృగరాజు మూవీలో పాట పాడే చాన్స్ దక్కడంతో రఘు ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. తర్వాత బంపర్ ఆఫర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా సైతం చేశాడు రఘు కుంచె. అనంతరం దేవుడు చేసిన మనుషులు మూవీలో సైతం రఘుకుంచెకు అవకాశం ఇచ్చాడు పూరి.