Gangavva : నేను చిరంజీవి సినిమాలో న‌టిస్తున్న‌.. మెగాస్టార్‌తో చాలా ముఖ్య‌మైన‌ పాత్ర నాది గంగవ్వ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gangavva : నేను చిరంజీవి సినిమాలో న‌టిస్తున్న‌.. మెగాస్టార్‌తో చాలా ముఖ్య‌మైన‌ పాత్ర నాది గంగవ్వ..!

 Authored By mallesh | The Telugu News | Updated on :5 October 2021,8:20 pm

Gangavva : తన యాస, భాషతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది గంగవ్వ. తెలంగాణ యాసలో అచ్చమైన భాషలో మాట్లాడుతూ యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్‌పై దూసుకుపోతోంది. గంగవ్వకు వరుస సినిమా అవకాశాలు వస్తుండగా వాటన్నిటిలో నటిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు గంగవ్వ తెలిపింది.శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరి’ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ తాను మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నానని పేర్కొంది. ఈ క్రమంలోనే గంగవ్వ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది.

chiranjeevi Movie In gangavv

chiranjeevi Movie In gangavv

Gangavva : మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా గంగవ్వ..

మెగాస్టార్ చిరు చిత్రం షూటింగ్ ప్రజెంట్ ఊటిలో జరుగుతుందని, ఇంటర్వ్యూ కోసం తాను అక్కడి నుంచి వచ్చినట్లు గంగవ్వ వివరించింది. ‘లవ్ స్టోరి’ చిత్రంలోనూ గంగవ్వ ఓ పాత్ర పోషించింది. సహజ నటనకు కేరాఫ్ అయిన గంగవ్వ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘మై విలేజ్ షో’ డైరెక్టర్ శ్రీకాంత్ నిర్వహించిన కార్యక్రమం ద్వారా గంగవ్వ కెరీర్ స్టార్ట్ అయింది. అందులో గంగవ్వ నటనను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Chiranjeevi

Chiranjeevi

రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ఫిల్మ్‌లో మంచి పాత్ర పోషించింది గంగవ్వ. ఇటీవల విడుదలైన కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రంలోనూ గంగవ్వ నటించింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్ర షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ మూవీస్ షూట్ బిజీలో ఉన్నాడు. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్‌లో ప్రజెంట్ ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు తల్లిగా గంగవ్వ కనిపించనుంది. ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు రీమేక్. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చిరు మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో ‘భోళా శంకర్’ చిత్రంలో నటించనున్నారు. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తిసురేశ్ మెగాస్టార్‌కు చెల్లెలిగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో ఓ మాస్ మూవీ చేయనున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది