JR NTR : 2024 ఎన్నికల కోసం జూనియర్ రంగంలోకి.. చంద్రబాబు వ్యూహంలో ఎన్టీఆర్ మరోసారి చిక్కుకోబోతున్నారా?

Authored By mallesh | The Telugu News | Published on: October 19, 2021, 4:15 pm

JR NTR : ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ  TDP నేడు విభజిత ఏపీలో ప్రతిపక్షంగా ఉంది. ఇక తెలంగాణలో టీడీపీ TDP కి కేడర్ కూడా దాదాపుగా లేకుండా పోయింది. నేతలందరూ ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకుగాను జూనియర్ ఎన్టీఆర్‌ JR NTR ను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం.వచ్చే ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో మాదిరిగా టీడీపీ ఓటమి పాలయితే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు, మనుగడ ప్రశ్నార్థకంగా మారే చాన్సెస్ ఉంటాయి. ఈ నేఫథ్యంలోనే పార్టీకి ఎన్నికల్లో గెలుపు అనేది అతి ముఖ్యం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ తరఫున ప్రచారానికి బరిలో దింపాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని వినికిడి.

Jr NTR will compaign Again for tdp

Jr NTR will compaign Again for tdp

అయితే, జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో టీడీపీకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే చాలా బిజీగా ఉన్నారు. అయితే, తన తాత స్థాపించిన టీడీపీపైన జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రేమ ఉన్నట్లు చాలా సార్లు తారక్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే పార్టీ అవసరం మేరకు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరఫున ప్రచారంలోకి వస్తారని పలువురు అనుకుంటున్నారు. అయితే, చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్‌ను మీడియా వారు రాజకీయాల్లోకి రావాలని ప్రశ్నించినప్పుడు ఇది టైం కాదని తప్పించుకుంటుండటం మనం చూడొచ్చు. అయితే, అవసరమైనపుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం వస్తారనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు జూనియర్‌ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలనుకుంటున్నారని సమచారం.

JR NTR : రాజకీయాల్లోకి రావడానికి తారక్ అంగీకరించేనా?

Chandrababu

Chandrababu

చాలా సార్లు చంద్రబాబు chandrababu Naidu  ఎక్కడికి వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ రావాలని పలువురు ప్లకార్డులు ప్రదర్శించడం కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారంలోకి దింపేందుకుగాను చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొంత మంది పారిశ్రామికవేత్తలను, సీనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉన్న ప్రముఖులను, టీడీపీ నేతలను తారక్ వద్దకు పంపిస్తున్నారట. చూడాలి మరి.. తారక్ రాజకీయ ప్రచారానికి అంగీకరిస్తారో.. లేదో..

mallesh

No bio available for this author.

  1. "Teja Sajja Engagement : ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థం.. కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే!"

  2. "Chandrababu : ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి మరో బెర్త్? రేసులో ఆ ఎంపీ!"

  3. "Giribabu VS SR NTR : ఎన్టీఆర్‌కే ఎదురు తిరిగిన గిరిబాబు? 48 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?"

  4. "Tummala Nageswara Rao : కాంగ్రెస్ మళ్లీ గెలవడం కష్టమే.. నేనూ పోటీ చేయను.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు!"

  5. "Gold Rate Today : తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం.. నిపుణుల అంచనాలివే!"

  6. "Karthika Deepam 2 Today Episode : పారిజాతం కిడ్నాప్.. జ్యోత్స్నను విడదీయడానికి మాలిని మాస్టర్ ప్లాన్.. సూరజ్‌కు బిగ్ షాక్!"

  7. "Cheyutha Pensions : రేవంత్ సర్కార్ భారీ గుడ్‌న్యూస్‌.. 4,63,857 మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న నగదు జమ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp