Ysrcp
Ysrcp : వైసీపీ Ysrcpలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్న నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. కాగా, వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న ఈయన ఇటీవల అడ్డంగా బుక్కయిపోయాడు. దాంతో చేసేదేమిలేక ఆ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఏ విషయంలో కేతిరెడ్డి తడబడ్డాడంటే..తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉండి టీడీపీలో ఉన్న జేసీ కుటుంబాన్ని ఓడించి కేతిరెడ్డి పెద్దారెడ్డి రికార్డు సృష్టించాడు. తాడిపత్రి శాసన సభ్యుడై తన కలను కూడా సాకారం చేసుకున్నాడు కేతిరెడ్డి. అయితే, ఆ తర్వాత కాలంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం పెద్దారెడ్డి సత్తా చాటలేకపోయాడు.
ysrcp
జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీలో గెలిచి పెద్దారెడ్డిపై పై చేయి సాధించారు. దాంతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొంత రాజకీయంగా బలం తగ్గినట్లయింది. ఈ క్రమంలోనే ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్న క్రమంలో పెద్దారెడ్డి తడబడ్డాడు. జేసీని విమర్శించబోయి సొంత పార్టీ అధినేత అయిన జగన్‌నే విమర్శించాడు. జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ జనాలను మోసపుచ్చుతూ బతకడం మంచిది కాదని పొరపాటున వ్యాఖ్యానించారు. నిజానికి పెద్దారెడ్డి ఉద్దేశంలో ఆ మాటలు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించినవి.
kethireddy pedda reddy comments on Ys jagan
కానీ, తడబాటులో జగనన్న అనే పదం వాడటం చర్చనీయాంశమైంది. వైసీపీలో ఉంటూ సొంత పార్టీ అధినేతపై ఇలా మాట్లాడారేంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి అనే చర్చ షురూ అయింది. దాంతో ఈ విషయమై పెద్దారెడ్డి సీఎంవోకు వివరణ కూడా ఇచ్చుకున్నట్లు సమాచారం. అయితే, వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉంటున్నాడని, పొరపాటున అలా జగనన్నపై వ్యాఖ్యలు చేసి ఉంటాడని స్థానికంగా వైసీపీ శ్రేణులు కూడా చర్చించుకుంటున్నాయి. అయితే, కేతిరెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.