Ysrcp : అడ్డంగా బుక్కయిన వైసీపీ ఎమ్మెల్యే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : అడ్డంగా బుక్కయిన వైసీపీ ఎమ్మెల్యే..!

Ysrcp : వైసీపీ Ysrcpలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్న నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. కాగా, వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న ఈయన ఇటీవల అడ్డంగా బుక్కయిపోయాడు. దాంతో చేసేదేమిలేక ఆ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఏ విషయంలో కేతిరెడ్డి తడబడ్డాడంటే..తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉండి టీడీపీలో ఉన్న జేసీ కుటుంబాన్ని ఓడించి కేతిరెడ్డి […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :20 October 2021,6:00 am

Ysrcp : వైసీపీ Ysrcpలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్న నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. కాగా, వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న ఈయన ఇటీవల అడ్డంగా బుక్కయిపోయాడు. దాంతో చేసేదేమిలేక ఆ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఏ విషయంలో కేతిరెడ్డి తడబడ్డాడంటే..తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉండి టీడీపీలో ఉన్న జేసీ కుటుంబాన్ని ఓడించి కేతిరెడ్డి పెద్దారెడ్డి రికార్డు సృష్టించాడు. తాడిపత్రి శాసన సభ్యుడై తన కలను కూడా సాకారం చేసుకున్నాడు కేతిరెడ్డి. అయితే, ఆ తర్వాత కాలంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం పెద్దారెడ్డి సత్తా చాటలేకపోయాడు.

ysrcp

ysrcp

జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీలో గెలిచి పెద్దారెడ్డిపై పై చేయి సాధించారు. దాంతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొంత రాజకీయంగా బలం తగ్గినట్లయింది. ఈ క్రమంలోనే ఇటీవల జేసీ ప్రభాకర్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్న క్రమంలో పెద్దారెడ్డి తడబడ్డాడు. జేసీని విమర్శించబోయి సొంత పార్టీ అధినేత అయిన జగన్‌నే విమర్శించాడు. జగనన్న లాంటి నాయకుడు ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ జనాలను మోసపుచ్చుతూ బతకడం మంచిది కాదని పొరపాటున వ్యాఖ్యానించారు. నిజానికి పెద్దారెడ్డి ఉద్దేశంలో ఆ మాటలు జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించినవి.

Kethireddy Pedda Reddy : ఉద్దేశం అది కాకపోయినా.. చర్చనీయాంశంగా కేతిరెడ్డి వ్యాఖ్యలు.. Ysrcp

kethireddy pedda reddy comments on Ys jagan

kethireddy pedda reddy comments on Ys jagan

కానీ, తడబాటులో జగనన్న అనే పదం వాడటం చర్చనీయాంశమైంది. వైసీపీలో ఉంటూ సొంత పార్టీ అధినేతపై ఇలా మాట్లాడారేంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి అనే చర్చ షురూ అయింది. దాంతో ఈ విషయమై పెద్దారెడ్డి సీఎంవోకు వివరణ కూడా ఇచ్చుకున్నట్లు సమాచారం. అయితే, వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉంటున్నాడని, పొరపాటున అలా జగనన్నపై వ్యాఖ్యలు చేసి ఉంటాడని స్థానికంగా వైసీపీ శ్రేణులు కూడా చర్చించుకుంటున్నాయి. అయితే, కేతిరెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది