Pawan kalyan : మీ చిరంజీవికి చెప్పండి ప్రాధేయపడొద్దని.. పవణ్ కళ్యాన్ షాకింగ్ కామెంట్స్
Pawan kalyan ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీ సర్కారు, మంత్రులతో పాటు సినీ పరిశ్రమ పెద్దలపైన పవన్ పలు కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తన సొంత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిపైన కూడా పవన్ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన కష్టాలు పరిష్కరించాలని ఎవరిని ప్రాధేయపడాల్సిన అవసరం లేదని చిరంజీవికి చెప్పాలని అభిమానులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
అడుక్కోవాల్సిన అవసరం లేదు.. Pawan kalyan
నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని తాను రిక్వెస్ట్ చేస్తున్నట్లు మెగాస్టార్ మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని, త్వరలోనే చిరంజీవి, ఇతర సినీ పరిశ్రమ పెద్దలు సీఎం జగన్‌ను కలుస్తారని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తమ సమస్యలు పరిష్కరించాలని చిరు విజ్ఞప్తి చేశారు. అయితే, తాజాగా చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ హక్కులను సాధించుకోవాలి కానీ ప్రాధయేపడి అడుక్కోవాల్సిన అవసరం లేదన్న రీతిలో మాట్లాడారు. మొత్తంగా పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల సినీ పరిశ్రమ నుంచి ఏపీ రాజకీయ వర్గాల నుంచి స్పందన వస్తున్నది.
వైసీపీ నేతలు ఇప్పటికే స్పందిస్తుండగా, సినీ పరిశ్రమ నుంచి హీరోలు స్పందిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో కార్తీకేయ పవన్ కల్యాణ్ Pawan kalyan ను సపోర్ట్ చేస్తూనే సినీ పరిశ్రమను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇకపోతే మోహన్‌బాబు సైతం పవన్ చేసిన కామెంట్స్‌పై స్పందించారు. పవన్ అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం అక్టోబర్ 10 తర్వాత చెప్తానని, తన తనయుడు విష్ణుకు ఓటేసి, అతడిని, అతడి ప్యానెల్‌ను గెలిపించాలని కోరుతూ ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు మోహన్ బాబు. ఈ సంగతులు ఇలా ఉంచితే.. పవన్ వ్యాఖ్యలతో జగన్‌తో చిరంజీవి, ఇతర సినీ పెద్దల మీటింగ్ ఉంటుందా? ఉండదా? అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.