Pooja Hegde : అక్కినేని వారసుడితో కమిట్ అయిన పూజా హెగ్దే.. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..

Authored By mallesh | The Telugu News | Published on: February 19, 2022, 7:30 pm

Pooja Hegde : పూజా హెగ్దే.. అందాలకు ఈ పేరు కేరాఫ్ అని చెప్పొచ్చు. నాగచైతన్యతో హీరోగా యాక్ట్ చేసిన ఒక లైలా కోసం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బుట్టబొమ్మ. ఆ తర్వాత ముకుంద మూవీలోనే చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. కానీ ఆమె అందాలపై ఎవరూ అంత ఫోకస్ పెట్టలేదు. తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే (దువ్వాడ జగన్నాథం) మూవీలో బికినీ వేసి తన అందాలను ఆరబోసింది. దీంతో యూత్ ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ వైపు మళ్లారు. తర్వాత రంగస్థలం మూవీలో జిగేల్ రాణి అనే ఐటం పాటతో కుర్రకారు గుండెల్లో గంటలు మొగించింది.

ఇక అప్పటి నుంచి ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అనంతరం వరుస మూవీస్ తో బిజీ అయిపోయింది. మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంటపురంలో.. వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో యాక్ట్ చేసింది.తాజా సమాచారం ప్రకారం ఈ బుట్టబొమ్మ అక్కినేని నాగచైతన్యతో మరో సారి యాక్ట్ చేయనుంది. సమంతతో విడిపోయిన తర్వాత మూవీస్ విషయంలో నాగచైతన్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.త్వరలోనే ఓ రొమాంటింగ్ సస్పెన్స్ మూవీలో వీరిద్దరూ కనిపించనున్నట్టు టాక్.

Pooja Hegde doing another movie with nagachaitanya

Pooja Hegde doing another movie with nagachaitanya

Pooja Hegde : నాగచైతన్య కోసమేనట..?

ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కధకు నాగచైతన్య ఫిదా అయ్యాడట. మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకమని తెలిసింది. స్టోరీ మొత్తం ఆ క్యారెక్టర్ పైనే ఆధారపడి ఉంటుందని సమాచారం. ఇందులో పూజాను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట మూవీ మేకర్స్. నిజానికి ఈ స్టోరీ ఈ అమ్మడు రేంజ్‌కి సరిపోయేది కాదని, కానీ కేవలం నాగచైతన్య కోసం ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp