Rashmika Mandanna : రష్మిక మందన్నా డేరింగ్ డెసిషన్.. ఇకపై అలా కూడా కనిపించేందుకు సై అందట..

Authored By mallesh | The Telugu News | Published on: September 12, 2022, 12:00 pm

Rashmika Mandanna : రష్మిక మందన్నా ప్రస్తుతం అన్నిఇండస్ట్రీల్లో బ్రేకుల్లేని బండిలాగా దూసుకుపోతోంది. ఈ అమ్మడి స్పీడును అడ్డుకోవడం ఎవరి వల్ల కావడం లేదంట.. ఎందుకంటే ఈ మద్దుగుమ్మ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే అని అంటున్నారు. రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్న సామేతకు ఆమె సరిగా తూగుతుంది.తమిళ, కన్నడ, తెలుగు.. తాజాగా బాలీవుడ్‌లో జెండా పాతేందుకు ఈ కన్నడ బ్యూటీ రంగం సిద్ధం చేసుకుంటుందట..

కన్నడ ఇండస్ట్రీ నుంచి రష్మిక.. తెలుగులో చలో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమా విజయం ఆమెకు వరుసగా అవకాశాలను తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌తో గీతగోవిందం, డియర్ కామ్రేడ్, హీరో నితిన్‌తో భీష్మ.. అల్లుఅర్జున్ తో పుష్ప పార్ట్-1 సినిమాలు చేసింది.తాజాగా సీతారామం మూవీలో నటించి మంచి హిట్ కొట్టింది. ప్రస్తుతం పుష్ప పార్ట్-2 సినిమాలో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో బోలెడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పలు మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా చేస్తున్న రష్మిక.. స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తోంది.

 Rashmika Mandanna of daring decision

Rashmika Mandanna of daring decision

Rashmika Mandanna : దేనికైనా రెడీ అంటున్న రష్మిక..

త్వరలోనే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులుపోగొడుతుంది. మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక.. ఈ మధ్యకాలంలో అందాల ప్రదర్శన చేసేందుకు కూడా సిద్ధపడుతోంది. అయితే,త్వరలో బాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు తాజాగా డేరింగ్ డెసిషన్ ఒకటి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఇప్పటివరకు క్యూట్ లుక్స్, సెమీ బోల్డ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే బికినీ లో కనిపించడానికి కూడా సై అన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలిసి తన అభిమానులు ఎంతో క్యూరియాసిటీగా ఉన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp