Revanth Reddy : ‘ముందస్తు’కు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. అధిష్టానం ఒకే చెబుతుందా..?
Revanth Reddy : రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు మలుపు తీసుకుంటాయో.. ఎప్పుడు రణరంగంగా మారుతాయో ఎవరికీ తెలీదు. కానీ వీటి గురించి అన్నీ తెలిసిన నాయకుడు ఒకరు ఉన్నారు ఆయనే సీఎం కేసీఆర్. తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాలన్నా.. ప్రతిపక్షాలకు నిద్ర పట్టకుండా చేయాలన్నా ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమని అందరూ అనుకుంటున్నారు. అంతటి రాజకీయ చాణక్యుడు మన ముఖ్యమంత్రి అని.. పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హుజురాబాద్ ఎన్నికల హడావుడి నడుస్తుండగా కేసీఆర్ ఒక్క స్టేట్‌మెంట్‌తో అందరినీ ఆలోచనలో పడేశారు. ముఖ్యంగా కేసీఆర్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు.. దీని వెనుక ఏదో నిగూఢ అర్థం ఉంది. ఆయన ‘లేదు’ అన్నాడంటే తప్పకుండా ‘ఉంటుందని’ తీవ్ర ఆలోచనలో పడ్డారట. అందుకు కారణం ఈసారి తాము ‘ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ప్రకటించడమే.
కేసీఆర్ నార్మల్‌గానే తమ పార్టీ కేడర్‌కు ముందస్తుకు వెళ్లడం లేదని, తమకు ఇంకా టైముందని చెప్పి ఉండవచ్చు. కానీ ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని పార్టీలు పనిచేస్తున్నాయి. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ రెండూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గతంలో కూడా సీఎం ముందస్తు ఎన్నికలు ఉంటాయని చెప్పలేదు. సడెన్ డెసిషన్ తీసుకుని ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. కనీసం ప్రచారం చేసేంత టైం కూడా ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. అలాంటి స్కెచ్ వేయడంలో కేసీఆర్ దిట్ట.. ప్రస్తుతం కూడా అదే వ్యూహాన్ని కేసీఆర్ ఫాలో అవ్వచ్చని భావించిన ప్రతిపక్షాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Revanth Reddy :అధిష్టానంతో సంప్రదింపులు..
సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు్కు వెళ్తారని గట్టి నమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డి.. తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆలోచిస్తున్నారట..ఇందుకోసం ఇప్పటికే అధిష్టానంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను ఈసారి రిపీట్ అవ్వకుండా రేవంత్ రెడ్డి ముందే అన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. గతంలో ఎన్నికల సమయం పడినా టికెట్ల కేటాయింపు విషయంలో క్లారిటీ రాలేదు.. అభ్యర్థులను ముందుగానే ప్రకటించకపోవడంతో వారికి ప్రచారం చేసే సమయం కూడా లేకుండా పోయింది. అది కాస్త టీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యింది. ఈసారి అలాంటివి రిపీట్ కావొద్దని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ముందుగానే అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓ స్పష్టతకు రావాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు.ఇదే విషయాన్ని ఆయన అధిష్టానం పెద్దలతో చర్చిస్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది.