samsung galaxy a04s features and price details leaked in online
Samsung Galaxy A04s : సౌత్ కొరియా టెక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఎన్నో అద్బుతమైన ఫోన్లను లాంచ్ చేసి మార్కెట్ లో దూసుకుపోతోంది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే సామ్ సంగ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే సామ్ సంగ్ గెలాక్సీ ఏ03ఎస్ ని తీసుకుంచ్చిన కంపెనీ ఇదే వర్షన్ లో మరో లేటెస్ట్ ఫోన్ తేనుంది. ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ ఆన్ లైన్ లోకి లీక్ అయినట్లు తెలుస్తోంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ 720p HD+ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 ఇంచెస్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.11500 వేలు ఉండనున్నట్లు సమాచారం. ఇది మీడియా టెక్ చిప్‌సెట్ మరియు 5,000 ఎమ్ ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే గతంలోని నివేదికల ఆధారంగా సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ జాయింట్ డెవలప్‌మెంట్ ప్రొడక్షన్ పద్ధతిని ఉపయోగించి అభివృద్ధి చేయబడినట్లు తెలుస్తోంది.
samsung galaxy a04s features and price details leaked in online
సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ మూడు రియర్ కెమెరాలను అందించనుంది. ఇందులో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డిప్త్ సెన్సార్ లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో రానున్నట్లు సమాచారం. కాగా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలకోసం అమర్చినట్లు తెలుస్తోంది. HD+ LCD (60 Hz), హేలియో P35, 13+2+2 ఎంపీ బ్యాక్, అలాగే 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు, 15వాట్స్ తో 5,000 ఎంఏచ్ బ్యాటరీ ఛార్జింగ్ తో త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.