Samsung Galaxy A04s : సామ్ సంగ్ నుంచి మ‌రో కొత్త ఫోన్.. స‌రికొత్త ఫీచ‌ర్స్ తో త్వర‌లో ఇండియాకి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samsung Galaxy A04s : సామ్ సంగ్ నుంచి మ‌రో కొత్త ఫోన్.. స‌రికొత్త ఫీచ‌ర్స్ తో త్వర‌లో ఇండియాకి..

Samsung Galaxy A04s :  సౌత్ కొరియా టెక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతుంది. ఇప్ప‌టికే ఎన్నో అద్బుత‌మైన ఫోన్లను లాంచ్ చేసి మార్కెట్ లో దూసుకుపోతోంది. ఇండియాలో అత్య‌ధికంగా అమ్ముడుపోయే సామ్ సంగ్ ఫోన్ల‌కు మంచి డిమాండ్ ఉంది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ లాంచ్ చేయ‌నుంది. ఇప్ప‌టికే సామ్ సంగ్ గెలాక్సీ ఏ03ఎస్ ని తీసుకుంచ్చిన కంపెనీ ఇదే వ‌ర్ష‌న్ లో మ‌రో లేటెస్ట్ ఫోన్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :2 May 2022,7:30 pm

Samsung Galaxy A04s :  సౌత్ కొరియా టెక్ దిగ్గజం సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతుంది. ఇప్ప‌టికే ఎన్నో అద్బుత‌మైన ఫోన్లను లాంచ్ చేసి మార్కెట్ లో దూసుకుపోతోంది. ఇండియాలో అత్య‌ధికంగా అమ్ముడుపోయే సామ్ సంగ్ ఫోన్ల‌కు మంచి డిమాండ్ ఉంది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ లాంచ్ చేయ‌నుంది. ఇప్ప‌టికే సామ్ సంగ్ గెలాక్సీ ఏ03ఎస్ ని తీసుకుంచ్చిన కంపెనీ ఇదే వ‌ర్ష‌న్ లో మ‌రో లేటెస్ట్ ఫోన్ తేనుంది. ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచ‌ర్స్ ఆన్ లైన్ లోకి లీక్ అయిన‌ట్లు తెలుస్తోంది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం…సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ 720p HD+ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 ఇంచెస్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్ ధ‌ర రూ.11500 వేలు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇది మీడియా టెక్ చిప్‌సెట్ మరియు 5,000 ఎమ్ ఏహెచ్ బ్యాటరీని క‌లిగి ఉంటుంది. అయితే గ‌తంలోని నివేదిక‌ల ఆధారంగా సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ జాయింట్ డెవలప్‌మెంట్ ప్రొడక్షన్ పద్ధతిని ఉపయోగించి అభివృద్ధి చేయబడిన‌ట్లు తెలుస్తోంది.

samsung galaxy a04s features and price details leaked in online

samsung galaxy a04s features and price details leaked in online

సామ్ సంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ మూడు రియ‌ర్ కెమెరాలను అందించ‌నుంది. ఇందులో 13 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ డిప్త్ సెన్సార్ ల‌ను అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో రానున్న‌ట్లు స‌మాచారం. కాగా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీల‌కోసం అమ‌ర్చిన‌ట్లు తెలుస్తోంది. HD+ LCD (60 Hz), హేలియో P35, 13+2+2 ఎంపీ బ్యాక్, అలాగే 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు, 15వాట్స్ తో 5,000 ఎంఏచ్ బ్యాటరీ ఛార్జింగ్ తో త్వర‌లోనే లాంచ్ కానున్న‌ట్లు తెలుస్తోంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది