Fun Bucket bhargav .. ఆ మైనర్‌ బాలిక రేప్ కేసుపై నిత్య స్పందన..వీడియో

Authored By Himanshi | The Telugu News | Updated on : 21 April 2021, 1:49 pm

Tiktok nitya : తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా చర్చనీయాంశంగా ఉన్న విషయం ఫన్‌ బకెట్ భార్గవ్ పై రేపు కేసు నమోదు అవ్వడం. 14 ఏళ్ల మైనర్ బాలికను నమ్మించి మోసం చేయడంతో పాటు ఆమెకు కడుపు చేసిన భార్గవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. 14 ఏళ్ల మైనర్ బాలిక అనగానే పలువురి అమ్మాయిల పేర్లు బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి ఎవరు అయ్యి ఉంటారు అంటూ చాలా మంది చాలా రకాలుగా అయితే ఊహించేందుకు ప్రయత్నించారు. సోషల్‌ మీడియాలో వెంటనే ఒక అమ్మాయి పేరు అయితే ప్రముఖంగా వచ్చింది. ఆ పేరే నిత్యా. భార్గవ్‌ తో ఈ అమ్మాయి ఓమైగాడ్ అంటూ చాలా వీడియోలు చేసిన విషయం తెల్సిందే. ఆ వీడియోలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Tiktok nitya : మైనర్‌ బాలిక అనడంతో…

భార్గవ్‌ రేప్‌ చేసింది మైనర్‌ బాలికను అంటూ వార్తలు రావడంతో ఆ అమ్మాయి ఓమైగాడ్‌ ఫేమ్‌ నిత్య అయ్యి ఉంటుందని అంతా భావించారు. నిత్య వయసు కూడా కాస్త అటు ఇటుగా అంతే ఉంటుంది. కనుక ఆమె పై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో నిత్యా స్వయంగా సోషల్‌ మీడియా ముందుకు వచ్చింది. వీడియోను విడుదల చేసి అసలు తనకు ఆ కేసుతో సంబంధం లేదు అన్నట్లుగా చెప్పేసింది. తాను భార్గవ్‌ తో కలిసి చాలా కాలం అయ్యిందని, తామిద్దరం వీడియోలు చేయడం మానేసి చాలా కాలం అయ్యిందంటూ క్లారిటీ ఇచ్చింది.

Tiktok nitya clarity about fun bucket bhargav Case

Tiktok nitya clarity about fun bucket bhargav Case

Tiktok nitya : ఆ వస్తున్న వార్తలను ఆపేయండి..

భార్గవ్‌ అరెస్ట్‌ అయిన వెంటనే చాలా మంది నేను గతంలో ఆయనతో చేసిన వీడియోలను షేర్‌ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని ట్రెండ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే వాటిని ఆపేయండి. నాకు భార్గవ్‌ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసుతో నాకు అస్సలు సంబంధం లేదు అంటూ నిత్య పేర్కొనడంతో ఆ మైనర్ బాలిక ఆమె కాదు అని తేలిపోయింది. ఇంతకు ఆ మైనర్‌ బాలిక ఎవరు అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. పోలీసులు ఆ అమ్మాయి వివరాలను బయటకు చెప్పేందుకు నిరాకరించారు. మీడియాలో ఆమె కు సంబంధించిన పేరు లేదా ఫొటో షేర్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కనుక మీరు కూడా ఏదైనా ఫొటో లేదా సమాచారం ఉంటే షేర్‌ చేయవద్దు.

 

View this post on Instagram

 

A post shared by Nithyasri (@omggirlnitya)


ఇది కూడా చ‌ద‌వండి ==> SIM Card : మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసున్నారా? మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా?

Also read

Himanshi

No bio available for this author.

  1. "TTN SPECIAL ANALYSIS : బంకీపూర్ లో అంత ఈజీ గా ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచాడు ?"

  2. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  3. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  4. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  5. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  6. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  7. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp