Viral news : ఒకే మహిళ కడుపులో రెండు గర్భాశయాలు.. రెండు రోజులలో ఇద్దరు పిల్లలు పుట్టారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral news : ఒకే మహిళ కడుపులో రెండు గర్భాశయాలు.. రెండు రోజులలో ఇద్దరు పిల్లలు పుట్టారు..!!

 Authored By jyothi | The Telugu News | Updated on :26 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral news : ఒకే మహిళ కడుపులో రెండు గర్భాశయాలు.. రెండు రోజులలో ఇద్దరు పిల్లలు పుట్టారు..!!

  •  రెండు గర్భశయాలలో కలిసి రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి కెలిసర్ తల్లి అయ్యారు

  •  సాధారణంగా రెండు ప్రసవాల మధ్య కనీసం ఏడాది వ్యవధి అయినా ఉండటాన్ని మనం చూస్తుంటాం. కవలల ప్రసవాల విషయంలో రెండో బిడ్డకు జన్మనివ్వటానికి కొన్ని నిమిషాలు లేదా కొద్ది గంటల సమయం పడుతుంది.

Viral news :  సాధారణంగా రెండు ప్రసవాల మధ్య కనీసం ఏడాది వ్యవధి అయినా ఉండటాన్ని మనం చూస్తుంటాం. కవలల ప్రసవాల విషయంలో రెండో బిడ్డకు జన్మనివ్వటానికి కొన్ని నిమిషాలు లేదా కొద్ది గంటల సమయం పడుతుంది. కానీ అమెరికాకు చెందిన ఒక మహిళ మాత్రం రెండు రోజుల్లో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. అమెరికాకు చెందిన 32 ఏళ్ల కెసిలర్ డిసెంబర్ 19 మంగళవారం మొదటి బిడ్డకు డిసెంబర్ 20 బుధవారం రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా ఒకే తల్లి కడుపు నుంచి ఆ ఇద్దరు బిడ్డలు రోజుకొకరు పుట్టారు. అసలు ఇలా ఎలా జరిగిందో మీరే చూడండి.. బర్నింగ్ హంలోని అలభామ యూనివర్సిటీ ఆసుపత్రిలో కెల్సి రోక్సి, రెబల్ అనే ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చారు. తన ఇద్దరు బిడ్డలను మరికల్ బేబీ సెంటు సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అత్యంత అరుదుగా రెండు గర్భాశయాలు ఉండటం వల్లే ఇలా జరిగిందని వైద్యులు చెబుతున్నారు.

రెండు గర్భశయాలలో కలిసి రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి కెలిసర్ తల్లి అయ్యారు. ఇలా మహిళలకు రెండు గర్భాశయాలు అంటే డబల్ ఇంట్రెస్ట్ ఉండటం అనేది అత్యంత అరుదుగా జరుగుతుందని పది లక్షల్లో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. కేసిలర్ శరీరంలో రెండు గర్భాశయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితి 0.3% మహిళలకు మాత్రమే ఎదురవుతుందని అల్లాబామ్మ యూనివర్సిటీ వైద్యులు తెలిపారు. 39 వారాలపాటు ఇద్దరు బిడ్డలను కడుపున మోసిన కేసిలార్ ను ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ ఆ మూడు ప్రసవాల్లోనూ ఆమెకు ఒక్క గర్భాశయంలోనే పిండం ఏర్పడింది. కానీ ఈసారి మాత్రం రెండు గర్భాశయాల్లో వేరువేరుగా రెండు పిండాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగలిగారు. ప్రెగ్నెన్సీ అంటే రెండు గర్భాశయాలలో గర్భం వచ్చే అవకాశాలు ప్రతి 10 లక్షల మందిలో ఒకరికే వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయని అలభామ యూనివర్సిటీ వైద్యులు తెలిపారు. డెలివరీ బాధ్యతలు చూసుకున్న సహ వైద్యులు ప్రొఫెసర్ రీఛర్డ్ బీబీసీతో మాట్లాడారు. సాధారణ గర్భం మాదిరి ఇక్కడ కూడా ప్రతి శిశువుకు ప్రత్యేక గర్భం ఉందని డెవిల్స్ తెలిపారు. డిసెంబర్ 19 రాత్రి 7 గంటల 45 నిమిషాలకు మొదటి బిడ్డను ప్రసవించినప్పుడు ఆపరేషన్ థియేటర్లో అంతా ఆనందించామని మళ్లీ పది గంటల తర్వాత రెండో బిడ్డను సిజరింగ్ చేసి బయటకు తీశామని తెలిపారు. రెండు గర్భాశయాల్లోని అండాలు విడివిడిగా ఫలదీకరణం చెంది పిండాలు ఏర్పడిన సందర్భంలో అలా ప్రజల ట్విన్స్ గా చెప్పొచ్చని అన్నారు. అంటే ఆమె కడుపులో ఇద్దరు శిశువులు ఉన్నా రని కాకపోతే వేర్వేరు గర్భాశయాల్లో ఉన్నారని తెలిపారు. 2019లో బంగ్లాదేశ్ కు చెందిన ఆరిఫా సుల్తానా కూడా ఇలా కవలలకు జన్మనిచ్చారు. మొదటి బిడ్డను ప్రసవించిన 26 రోజుల తర్వాత కవలలకు జన్మనిచ్చారు. బిడ్డను ప్రసవించక కూడా పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అల్ట్రా స్కానింగ్ పరీక్ష ద్వారా మరో గర్భశయంలో ఇద్దరు శిష్యులు ఉన్నట్లు గుర్తించి ఆమెకు సిజేరియన్ చేశారు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది