Wah Wah Mere Bava song : వావా మేరే బావ.. అనసూయ, శ్రీముఖి, రష్మితో ప్రదీప్ రచ్చ…!
Wah Wah Mere Bava song : బుల్లితెరపై ఇన్నాళ్లు వెలిగిన ప్రదీప్ ఇకపై వెండితెరపై తన సత్తాను చాటాలని ప్రయత్నిస్తున్నాడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ప్రదీప్.. ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతోన్నాడు. అంతా బాగుండి ఉంటే.. గతేడాదే ప్రదీప్ హీరోగా వచ్చి.. మరి కొన్ని ప్రాజెక్ట్‌లను కూడా పట్టాలెక్కించేవాడు. కరోనా వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్రదీప్ హీరోగా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

Wah Wah Mere Bava song In Anasuya Rashmi Sri Mukhi Are with pradeep
ఈ క్రమంలో ప్రదీప్ ప్రమోషన్స్ పెంచాడు. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అందులో భాగంగా టాప్ యాంకర్లతో కలిసి చేసిన ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. వావా వావా మేరే బావ అనే పాటలో అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటివారంతా కలిసి సందడి చేశారు. ఈముగ్గురితో ప్రదీప్‌కు మంచి రిలేషన్ ఉంది. అందుకే ప్రదీప్ సినిమా కోసం అందరూ కలిసి వచ్చారు.
Wah Wah Mere Bava song : సింగిల్ టేక్‌లోనే ప్రదీప్, శ్రీముఖి, అనసూయ, రష్మీ
అలా ఈ పాటను సింగిల్ టేక్‌లోనే తీసేశారట. దీనికి ప్రముఖ్య డ్యాన్స్ మాస్టర్ చిట్టి కొరియోగ్రఫీని అందించాడు. అంతే కాకుండా ఈ పాటను అగస్త్య ఆర్స్ట్స్ నిర్మించిందట. అలా వావా వావా మేరీ బావ అంటూ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అనసూయ, శ్రీముఖి, రష్మి, ప్రదీప్, సద్దాంలు వేసిన స్టెప్పులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మరి ప్రదీప్ హీరోగా నిలదొక్కుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.
