Badvel by poll : బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ మాస్టర్ ప్లాన్.. ఇది ఫలిస్తే డాక్టర్ సుధ అరుదైన రికార్డు
Badvel by poll : తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కాక పుట్టిస్తుంటే అటు ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం అసలు పోటీ వాతావరణమే కనిపించట్లేదు. అసలు అది ఎన్నిక నేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం. ఇక బద్వేల్ ఉప ఎన్నిక రావడానికి కారణం వైసీపీ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడమే. అయితే ఆయన స్థానంలో ఇక్కడి నుంచి ఆయన సతీమణి డాక్టర్ సుధను పోటీలో దింపుతోంది వైసీపీ పార్టీ.
ఈ బద్వేల్‌కు 2001లో ఉప ఎన్నిక తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తోంది. అయితే అప్పుడు జరిగిన ఉప ఎన్నికకు ముందు ఇక్కడి నుంచి టీడీపీ ఏడు సార్లు వరుసగా విజయాన్ని దక్కించుకుంది. కానీ ఆ తర్వాత సమీకరణాలు మారాయి. కానీ ఆ తర్వాత టీడీపీ ఇప్పటి దాకా ఇక్కడ గెలవలేదు. కానీ ఇప్పడు వైసీపీ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో రాజకీయ విలువల ప్రకారం తాము పోటీ చేయట్లేదంటూ జనసేన, టీడీపీ ఇప్పటికే ప్రకటించాయి. దాంతో వైసీపీకి పెద్ద గండం తప్పినట్టు అయింది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీని ఓడించే సత్తా ఈ రెండు పార్టీలకు తప్ప మరే పార్టీకి లేదు.
Badvel by poll: వైసీపీకి తప్పిన గండం..
ఇక ప్రధాన పార్టీలు తప్పుకున్నా కూడా జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం పోటీలో ఉంటామని, తమ అభ్యర్థులను పెట్టేందుకు రెడీ కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తుందని తెలుస్తోంది. కాగా టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడంతో గెలుపు సునాయాసమే అయినా కూడా వైసీపీ మాత్రం ఎలాగైనా ఏకగ్రీవం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ కాంగ్రెస్ లను ఒప్పించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే బద్వేలుకు చెందిన గోవిందరెడ్డితో పాటు ఎమ్మెల్యే రాఘురామిరెడ్డి లాంటి వారు రంగంలోకి దిగి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఏకగ్రీవం అయితే మాత్రం ఏపీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఏకగ్రీవం కాగా ఇప్పుడు డాక్టర్ సుధ రెండో ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించబోతోంది.