Bigg boss season 7 Telugu : బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అతడే .. ఈ వారంతో పూర్తి క్లారిటీ ..!

Authored By aruna | The Telugu News | Updated on : 29 November 2023, 7:00 pm
  •  బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అతడే,ఈ వారంతో పూర్తి క్లారిటీ

  •  Bigg boss season 7 telugu title winner

  •  బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా కొనసాగుతుంది

Bigg boss season 7 Telugu : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. ఇప్పుడు అసలే ఫైనల్ రేస్ జరుగుతుండడంతో ప్రేక్షకులలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సీజన్ సగానికి పైనే అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో ఐదుగురు మాత్రమే టాప్ లోకి వెళతారు. అయితే టాప్ 5 లో మాత్రం ఈ ముగ్గురు కచ్చితంగా ఉంటారని తెలుస్తుంది. ఆడియన్స్ పల్లవి ప్రశాంత్, శివాజీ , అమరదీప్ టాప్ 3 లో కచ్చితంగా ఉంటారని ఫిక్స్ అయిపోయారు. ఇక మొదటి నుంచి శివాజీ టైటిల్ విన్నర్ అని అంతా అనుకున్నారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా కుటుంబ సభ్యులు రావడంతో, అందరూ శివాజీని టాప్ లో పెట్టేసారు.

ఇదంతా చూసి హౌస్ లో ఉన్న వాళ్లతో పాటు ఆడియన్స్ కూడా శివాజీనే విన్నర్ అని అనుకున్నారు. ఇక రన్నరప్ గా పల్లవి ప్రశాంత్ నిలుస్తాడు అనుకున్నారుష కానీ 10,11,12 వారాల్లో చాలా మార్పులు జరిగాయి. ఈ మూడు వారాలలో శివాజీకి ఒక్క ఎపిసోడ్ కూడా సరిగా పడలేదు. అంతేకాకుండా అమర్ దీప్ కెప్టెన్సీ విషయంలో శివాజీ నెగిటివ్ అయ్యాడు. దీంతో ఓటింగ్ లో తారుమారు అయింది. ఆ సమయం అమర్ దీప్ కి కలిసొచ్చింది. ఈ మూడు వారాలు అమర్ దీప్ కి కీలకంగా మారాయి. మొదటినుంచి అమర్ దీప్ టాప్ 5 లో ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి లో ఇప్పుడు ఏకంగా టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చాడు.

కెప్టెన్సీ కోసం అమర్ దీప్ ఎమోషనల్ అయిన విషయం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో అమర్ కి ఓట్లు ఎక్కువ పడ్డాయి. ఇక రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రతి టాస్క్ లో బాగా ఆడాడు. ఎటువంటి కన్నింగ్ స్ట్రాటజీలు లేకుండా జెన్యూన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటినుంచి ఓటింగ్ లో టాప్ లో ఉంటున్నాడు. ఈ విధంగా ముగ్గురు ఒకరిని మించి మరొకరు ఉంటున్నారు. వీళ్లు కచ్చితంగా టాప్ 3 లో ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇక శివాజీ అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురిలో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో తెలియాల్సి ఉంది. అసలే ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి బిగ్ బాస్ ఎవరిని గెలిపిస్తాడో చివరి వరకు తెలియడం లేదు. మొత్తానికైతే ఈ సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి