Brahmamudi 9 Nov Today Episode : రుద్రాణికి షాకిచ్చిన దుగ్గిరాల కుటుంబ సభ్యులు.. కళ్యాణ్ పై అనామిక సీరియస్.. ఆస్తి మొత్తం రాయించుకునేందుకు రుద్రాణి ప్లాన్.. ఇంతలో మరో ట్విస్ట్
Brahmamudi 9 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 9 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 249 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాతయ్య పరిస్థితి ఇలా ఉందని నాకు తెలియదండి. అందుకే ఇలా అంటుంది. దీంతో తెలిసి ఉంటే ఇంకా ఎంత నాటకం ఆడేదానివో అంటాడు రాజ్. నేను చెప్పేది వింటావా అంటే అస్సలు వినడు రాజ్. నా మాట మీరు వినరు కదా అంటే.. నీ […]
ప్రధానాంశాలు:
ఆస్తి అంతా ఖర్చు పెట్టి అయినా నా భర్తను కాపాడండి అని వేడుకున్న ఇంద్రాదేవి
ఎంత ఆస్తి ఖర్చు పెట్టినా బతకుతాడా అన్న రుద్రాణి
రుద్రాణి చెంప వాయించిన ఇంద్రాదేవి
Brahmamudi 9 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 9 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 249 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాతయ్య పరిస్థితి ఇలా ఉందని నాకు తెలియదండి. అందుకే ఇలా అంటుంది. దీంతో తెలిసి ఉంటే ఇంకా ఎంత నాటకం ఆడేదానివో అంటాడు రాజ్. నేను చెప్పేది వింటావా అంటే అస్సలు వినడు రాజ్. నా మాట మీరు వినరు కదా అంటే.. నీ మాటలు నమ్మి మా అమ్మను కూడా ఎదిరించి నీకు సపోర్ట్ చేశాను. కానీ.. నువ్వు నా నమ్మకాన్ని చెడిపేశావు. నేను ఎంత పిచ్చోడిని కాకపోతే మా అత్త నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటే.. కాదు నా భార్య ఏమైనా చేస్తుంది కానీ అబద్ధం మాత్రం చెప్పదు అని శ్రీమంతం రోజున గొడవ పెట్టుకున్నాను చూడు. అప్పుడు నన్ను ఒక పిచ్చోడిలా చూస్తూ మనసులో నవ్వుకొని ఉంటావు కదా. ఏ భార్య అయినా నలుగురిలో తన భర్త పరువు కాపాడాలని అనుకుంటుంది. కానీ.. ఇలా జోకర్ ను చేయాలని అనుకోదు. ఆ విషయంలో నువ్వు వంద శాతం సక్సెస్ సాధించావు. పొరపాటు అయితే క్షమించవచ్చు. అలవాటు అయినదాన్ని ఏం చేసినా క్షమించలేం అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కావ్యను అస్సలు అర్థం చేసుకోడు. ఈయనకు ఎలా చెప్పాలి.. ఎలా అర్థం అయ్యేలా చెప్పాలి అని అనుకొని బాధపడుతుంది కావ్య.
మరోవైపు ఇంట్లో అందరూ సైలెంట్ గా కూర్చొంటారు. మామయ్య గారు కాఫీ తీసుకోండి అని కావ్య వస్తుంది. వద్దు అంటాడు. అపర్ణను అడిగినా వద్దు అంటుంది. ఎవ్వరిని అడిగినా వద్దు అంటారు. ఎవ్వరూ కాఫీ తీసుకోరు. రాజ్ దగ్గరికి వెళ్తుంది. కళ్యాణ్ ను అడిగినా వద్దు అంటాడు. దీంతో కావ్యకు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుంచి వెళ్తున్న కావ్యను చూసి కావ్య కొంచెం కాఫీ ఇవ్వవే అంటుంది. వద్దు అని లోపలికి వెళ్తుంది. ఇంతలో ఇంద్రాదేవి అక్కడికి వచ్చి తమ ఆస్తి పత్రాలు అన్నీ అక్కడ పెడుతుంది. నేను సుమంగళిగానే పోవాలని అనుకుంటున్నాను. పుణ్య స్త్రీగా ప్రాణాలు విడవాలంటే నా ఐదో తనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కావాల్సింది నా దురదృష్టాన్ని తలుచుకొని కుమిలిపోవడం కాదు. సర్వశక్తులు కూడగట్టుకొని పరిష్కారం దిశగా అడుగులు వేయాలి అంటుంది ఇంద్రాదేవి. అందుకు నా వయసు సహకరించడం లేదు. పెళ్లయి ఇన్నేళ్లు అయినా నేను భర్త చాటు భార్యగానే ఉన్నందు వల్ల బయటి ప్రపంచం తెలియదు. మీరు అన్నీ ఎరిగిన వాళ్లు. నా భర్త ప్రాణాలు నాకు దానం చేయండి అంటుంది ఇంద్రాదేవి. దీంతో అందరూ షాక్ అవుతారు.
Brahmamudi 9 Nov Today Episode : ఆస్తులు అమ్మి అయినా నా బావను కాపాడండి అని వేడుకున్న ఇంద్రాదేవి
మరోవైపు కళ్యాణ్ కు ఫోన్ వస్తుంది. అనామిక ఫోన్ చేస్తుంది. దీంతో కట్ చేస్తాడు కళ్యాణ్. నా ఐదోతనాన్ని కాపాడండి. ఆయన లేకపోతే నాకు ఈ ప్రపంచం మాయమైపోతుంది అంటుంది ఇంద్రాదేవి. అమ్మమ్మ గారు మీరు బాధపడకండి అంటుంది కావ్య. అత్తయ్య.. ఏం కాదు కంగారు పడకండి అంటుంది అపర్ణ. దీంతో నాకు ఇప్పుడు కావాల్సింది ఓదార్పు కాదు. పరిష్కారం అంటుంది. ఇందులో చాలా డబ్బు ఉంది. నగలు ఉన్నాయి. అవన్నీ తీసుకొని వీటిని ఖర్చు పెట్టి అయినా నా భర్త ప్రాణాలు నిలబెట్టండి. ఏ దేశంలో నా భర్త ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఉంటారో అక్కడికి తీసుకెళ్లండి. ఆరిపోయే దీపానికి అరచేతులు అడ్డుపెట్టి రక్షించుకుందాం అంటే ఎంత ఖర్చు పెట్టినా ఆస్తులు కరిగిపోవడం తప్పితే ప్రయోజనం ఏం ఉంటుంది అంటుంది రుద్రాణి.
దీంతో రుద్రాణి.. అంటూ వెళ్లి తన చెంప చెళ్లుమనిపిస్తుంది ఇంద్రాదేవి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏమన్నావు.. అంటూ ప్రశ్నిస్తుంది. ఆస్తి కరిగిపోతుందా? అంటుంది. లేకుండా పోతుందా? రోడ్డు మీద పడతావా? ఇవన్నీ ఆలోచించడానికి నేను చేయమన్నది వ్యాపారం కాదు. ఆయుష్షు పోసే యాగం చేయమంటున్నాను. ఇది ఒక ప్రాణం. ఇన్నాళ్లు మనందరినీ కాపాడుకుంటూ వచ్చిన ఒక పెద్ద దిక్కుకు ఒక ఆపద వస్తే చేతులు ముడుచుకుంటూ కూర్చొంటామా అంటుంది ఇంద్రాదేవి.
అయినా ఆస్తుల గురించి ఎవ్వరికీ రాని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది రుద్రాణి. కడుపు అన్నం తింటున్నావా లేదా అంటూ అందరూ రుద్రాణి మీద విరుచుకుపడతారు. నాకు కావాల్సింది పరిష్కారం, నా భర్త ప్రాణం అంటుంది ఇంద్రాదేవి. ఈ ప్రాణాంతకమైన వ్యాధి పూర్తిగా నయమైపోవాలి అంటుంది ఇంద్రాదేవి. ఇంతలో అక్కడికి సీతారామయ్య వస్తాడు. వాళ్ల మాటలు విని మళ్లీ లోపలికి వెళ్తాడు.
నానమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కష్టం ఈ ఇంటికి వస్తే ఇక్కడ ఉన్న అందరూ కూర్చున్నారు కానీ నువ్వు మాత్రం కర్తవ్యం కోసం అన్నీ దిగమింగుకున్నావు. జరగాల్సిన దాని మీద దృష్టి పెట్టమంటున్నావు. ఈ కాలంలో ఎంతమందికి ఇంత ఆత్మనిబ్బరం ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనవడిని అయినందుకు గర్వంగా ఉంది అంటాడు రాజ్.
రుద్రాణి లాంటి కలుపు మొక్కల సంగతి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తాతయ్య లేనిదే ఇక్కడ ఇంత మంది ఉండేవారు కాదు. తాతయ్య లేకుంటే ఈ వంశాభివృద్ధి జరిగి ఉండేది కాదు. తాతయ్యను మనం క్షేమంగా ఆరోగ్యంగా దక్కించుకోవడానికి ఏం చేయాలో ఇన్ని రోజులు మీకు తెలియకుండా చేశాం. ఇప్పుడు అందరికీ తెలిసేలా చేద్దాం అంటాడు రాజ్.
అమెరికాలో ప్రత్యేకంగా ఇలాంటి క్యాన్సర్ గురించి చికిత్స ఉందట. ఆ డాక్టర్ వచ్చాక ఒకసారి చెక్ చేసి చెప్తామన్నారు. దానికి మన ఆస్తులు అవసరం లేదు అంటాడు సుభాష్. మహావృక్షం ఉంటేనే కొమ్మలు పచ్చగా ఉంటాయి. తాతయ్య ఉంటేనే ఈ వంశానికి నిండుదనం ఉంటుంది. తాతయ్యను పూర్తి ఆరోగ్యంతో నీకు అప్పగిస్తానని మాటిస్తున్నాను అంటాడు రాజ్.
మరోవైపు అనామిక.. కనకం ఇంటికి వస్తుంది. అప్పు పడుకోవడం చూసి ఏంటి అలా పడుకున్నావు అని అడుగుతుంది. ఏం పని లేదు అంటుంది. ఒక్కదానివే వచ్చావా అంటే కవి చాలా బిజీ కదా అంటుంది అనామిక. ఇంటికి వెళ్దామంటే తాతయ్య పరిస్థితి బాగాలేదు. ఒకసారి అప్పు నువ్వు కాల్ చేయవా అంటుంది అనామిక. నువ్వు కాల్ చేస్తేనే లిఫ్ట్ చేయలేదు.. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా అంటుంది అప్పు. దీంతో ఏం కాదు చేయి అంటుంది. అప్పు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు కళ్యాణ్. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. అప్పు కాల్ చేస్తే లిఫ్ట్ చేశావు అంటూ సీరియస్ అవుతుంది అనామిక. ఫీల్ అవుతుంది.
మరోవైపు మెల్లగా సీతారామయ్య దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. తన దగ్గరికి ఖాళీ పేపర్స్ తీసుకెళ్తుంది. మీరు క్షేమంగా, ఆరోగ్యంగా క్యాన్సర్ లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటుంది రుద్రాణి. నాకోసం, నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నందుకు చాలా సంతోషం రుద్రాణి అంటాడు సీతారామయ్య. నేను నీకూతురును.. అంటుంది.
మరోవైపు నువ్వు వండింది తినను అంటాడు రాజ్. కావ్య వండింది తినకపోతే ఎలా.. అంటే నేను ఎవ్వరు చెప్పినా వినను అంటాడు. దీంతో చివరకు అపర్ణ వెళ్లి రాజ్ కు తినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.