Brahmamudi Serial Today Episode April 15th : కావ్యను గుడికి రమ్మని, యామినిని నిలదీసిన రాజ్
Brahmamudi Serial Today Episode April 15th: స్టార్ మాలో టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో ఈరోజు ఏప్రిల్ 15వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌తో కావ్య కామెడీగా మాట్లాడుతూనే ఎలాగైనా అన్నదానం కార్యక్రమానికి రాజ్‌ని ఒప్పించాలి అనుకుంటూ ఉంటుంది. రాజ్ కూడా కళావతితో మాట్లాడటం కోసం కలవడం కోసం పరితపిస్తూ ఉంటాడు. అలా ఇద్దరు కలిసి కూరగాయలు కొనడానికి బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. తర్వాత రాజ్ కోసం కావ్య కూరగాయల బండి దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది…

Brahmamudi Serial Today Episode April 15th : కావ్యను గుడికి రమ్మని, యామినిని నిలదీసిన రాజ్
రాజ్ రావడంతో ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాజ్ మాట్లాడే ప్రతి మాటకు వెటకారంగా మాట్లాడడంతో ఏం చెప్పాలో తెలియక రాజు టెన్షన్ పడుతూ కవర్ చేసుకుంటూ ఉంటాడు. రేపు అన్నదానం ఉంది గుడిలో. మా అమ్మ పుట్టినరోజు అన్నదానం చేస్తున్నాం అని చెబుతాడు రాజ్. దాంతో కావ్య సంతోష పడుతూ ఉంటుంది.
గుడికి రావాలని ఆయనని ఒప్పించాలి అనుకుంటే ఆయనే గుడికి వస్తున్నాడు. నాకు అదృష్టం బాగానే కలిసి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది కావ్య. మీ చేతి వంట బాగుంటుంది కాబట్టి అందరికీ మీరే వంట చేసి పెట్టాలి అని రాజ్ అడగడంతో సరే అని అంటుంది కావ్య. ఇరువురు కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత రాజ్‌ను గుడికి రమ్మని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరొకవైపు యామిని వాళ్లు రాజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో రాజ్ రావడం చూసి అసలు డ్రామా మొదలు పెడుతుంది వైదేహి. కూరగాయలు తీసుకు రమ్మని చెప్పాను కదా అని అనడంతో రాజ్ తీసుకు వస్తాడు మమ్మీ అని అంటుంది యామిని. ఏంటి రాజ్ కూరగాయలు తీసుకురాలేదా అనడంతో ఇంతకీ నేను కూరగాయల షాప్ దగ్గరికి వెళ్లాను అని నీకు ఎలా తెలుసు అని యామిని నిలదీయడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రాజ్ సీరియస్ అవ్వడంతో వైదేహి కూతురుకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. అప్పుడు రాజ్ సీరియస్ గా మాట్లాడటంతో యామిని టెన్షన్ పడుతూ ఉంటుంది.తర్వాత రాజ్ కోసం కావ్య తాను తయారు చేసిన షర్ట్ ని చూసి గతంలో రాజ్ మాట్లాడిన మాటలు గుర్తుతెచ్చుకుని మురిసిపోతూ ఉంటుంది. దీంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.