karthika deepam 2 Today Episode : దీపే కాల్చిందని ఎస్ఐకు దశరథ్ వాగ్మూలం.. మరింతగా ఇరికించేందుకు జ్యోత్స్న మరో ప్లాన్
ప్రధానాంశాలు:
Karthika Deepam-2 Serial Today : దీపే కాల్చిందని ఎస్ఐకు దశరథ్ వాగ్మూలం.. మరింతగా ఇరికించేందుకు జ్యోత్స్న మరో ప్లాన్
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నీకోసం ఎవరూ వచ్చేలా లేరు, తినేందుకు ఏమైనా తీసుకురావాలా అని జైలులో ఉన్న దీపను కానిస్టేబుల్ అడుగుతుంది. వద్దు అంటుంది దీప. దశరథ్‍కు ఎలా ఉందో చెప్పండని అడుగుతుంది. ఆయన లేచే వరకు వరకు తినావా అని కానిస్టేబుల్ అడిగితే.. ఆయన నాకు తండ్రి లాంటి మనిషి అని దీప అంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా గుండెల్లో కాల్చావ్ అని కానిస్టేబుల్ అంటుంది. ఇంతలో క్యారేజీ పట్టుకుని పోలీస్ స్టేషన్‍కు వస్తాడు కార్తీక్. దశరథ్ స్పృహలోకి వచ్చారా అని కార్తీక్‌ను అడుగుతుంది దీప. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదంట అని చెప్పడంతో దీప కాస్త సంతోషిస్తుంది. భోజనం చేయ్ దీప అని కార్తీక్ అంటాడు.

Karthika Deepam-2 Serial Today : దీపే కాల్చిందని ఎస్ఐకు దశరథ్ వాగ్మూలం.. మరింతగా ఇరికించేందుకు జ్యోత్స్న మరో ప్లాన్
ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందని దీప అడుగుతుంది. శౌర్య మాట వినడం లేదని, అమ్మ కావాలి అని ఏడుస్తుందని చెబుతాడు. కేసు నుంచి బయటపడతానని మీరు అనుకుంటున్నారా అని దీప అడుగుతుంది. తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని, బయటికి వస్తావని కార్తీక్ చెబుతాడు. కార్తీక్ కూడా తింటూ దీపకు గోరుముద్దలు తినిపిస్తాడు. శౌర్య కోసం వాయిస్ రికార్డ్ చేసి ఇవ్వు అని ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీంతో శౌర్య పాప అంటూ ఫోన్‍లో తన మాటలను దీప రికార్డ్ చేస్తుంది.
karthika deepam 2 Today Episode షాకింగ్ విషయం చెప్పిన ఎస్ఐ
ఇంతలో ఎస్ఐ అక్కడికి వస్తాడు. కార్తీక్‍ను లోపలికి ఎందుకు రానిచ్చావని కానిస్టేబుల్‍పై సీరియస్ అవుతాడు. “దశరథ్ స్పృహలోకి వచ్చారు. కేసు నుంచి బయటపడ్డారని అనుకుంటున్నారేమో. వాళ్లు దీపపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఒకటి కాదు నాలుగు సెక్షన్లలో కేసు బుక్ చేశారు. వాళ్లేమో దీపకు యావజ్జీవ శిక్ష పడే వరకు వదిలిపెట్టమని అంటున్నారు” అని ఎస్ఐ షాకింగ్ విషయాలు చెబుతాడు. దీంతో కార్తీక్, దీప కంగారు పడతాడు. రేపు దశరథ్ వాగ్మూలం తీసుకునేందుకు వెళతానని, నన్ను షూట్ చేసింది దీప అని ఆయన చెబితే నిన్ను ఏ దేవుడు కాపాడలేడని ఎస్ఐ అంటాడు. అప్పుడు జైలులోనే మంచి భోజనం పెడతాడనని వెటకారంగా అంటాడు.
రేపు దశరథ్ ఏమని చెబుతారో.. దీపే కాల్చిందని చెబుతారా అని దీప ఆలోచిస్తుంది. “అలా చెబితే నాకు యావజ్జీవ శిక్ష తప్పదా.. నేను నా కూతురికి దూరం అయిపోతానా. దశరథ్ చెప్పే మాటలపై నా జీవితం ఆధారపడి ఉంది. ఆయన ఏం చెబుతారో ఏంటో” అని మనసులో బాధపడుతుంది దీప.
దీపే కాల్చింది..
దశరథ్ వాగ్మూలం తీసుకునేందుకు ఆస్ప్రతికి వస్తాడు ఎస్ఐ. “దీప మిమ్మల్ని షూట్ చేసింది. ఇది నిజమా.. అబద్ధమా” అని బెడ్‍పై ఉన్న దశరథ్‍ను ఎస్ఐ అడుగుతాడు. కాసేపు మౌనంగా ఉంటాడు దశరథ్. కొంప తీసి గుర్తు లేదంటాడా అని జ్యోత్స్నతో చెప్పి కంగారు పడుతుంది పారిజాతం. ఏంటి దశరథ్ అని శివన్నారాయణ అంటే.. ఆయన ఒక్కడే మాట్లాడాలని ఎస్ఐ అంటాడు. దీప కాదంటాడా ఏంటి అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు అని ఎస్ఐ మళ్లీ అడుగుతాడు. దీంతో.. ‘దీప’ అని దశరథ్ బదులిస్తాడు. వాగ్మూలంపై దశరథ్ సంతకం తీసుకుంటాడు ఎస్ఐ. అవసరమైతే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుందని అంటాడు. దీపకు శిక్ష పడుతుందని మనసులో ఆనందిస్తుంది జ్యోత్స్న. “థ్యాంక్స్ డాడీ.. ఇంక దీపకు శిక్ష పడుతుందనే నమ్మకం నాకు వచ్చింది. ఇప్పుడు నేను చేయాల్సి పని మరొకటి ఉంది. అక్కడికే వెళతాను” అని అనుకుంటుంది జ్యోత్స్న.
అమ్మ నీతో మాట్లాడింది అని శౌర్య చేతికి ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీప చేసిన వాయిస్ రికార్డింగ్‍ను శౌర్యకు వినిపిస్తాడు కార్తీక్. దీపతో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా అమాయకంగా మాట్లాడుతుంది శౌర్య. నాన్న చెప్పినట్టు వినాలి, తినాలి అంటూ దీప రికార్డ్ చేసి ఉంటుంది. అది వింటూ అలాగే అంటుంది శౌర్య. అమ్మ నీకోసం తొందరలోనే వస్తుంది అని దీప చెప్పి ఉంటుంది. అమ్మ మాట్లాడడం లేదు.. ఆగిపోయింది అని శౌర్య అంటుంది. ఇది వాయిస్ రికార్డింగ్ అని కార్తీక్ అంటాడు. అమ్మ వచ్చే వరకు బాధపడకూడదని చెబుతాడు. అమ్మ మాటలు వినిపించినందుకు థ్యాంక్స్ అని కార్తీక్‍ను హత్తుకుంటుంది శౌర్య.
అమ్మ ఎప్పుడు వస్తుందని శౌర్య అడుగుతుంది. ఇంటి ముందు కారు వచ్చి ఆగితే అమ్మ వచ్చిందా అని చూస్తుంది. కారు నుంచి జ్యోత్స్న దిగుతుంది. నువ్వు లోపలికి వెళ్లు అని శౌర్యతో కార్తీక్ అంటాడు. దీపే కాల్చిందని దశరథ్ వాగ్మూలం ఇచ్చిన విషయాన్ని చెప్పేందుకు కార్తీక్ ఇంటికి జ్యోత్స్న వస్తుంది. ఎందుకు వచ్చావ్ అని జ్యోత్స్నను కార్తీక్ ప్రశ్నిస్తాడు. తలుపు చాటున ఉంటూ శౌర్య చూస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.