Categories: NewsTV Shows

Guppedantha Manasu 4 Nov Today Episode : దేవయానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రవీంద్ర.. ముకుల్ గురించి మహీంద్రాకు చెప్పిన రిషి

Guppedantha Manasu 4 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 4 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 912 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ధరణి మీద శైలేంద్రకు కోపం వస్తుంది. ఒకవేళ కాఫీ తాగినా మీకు తలనొప్పి తగ్గకపోతే నేను ట్యాబ్లెట్ ఇస్తాను అంటుంది ధరణి. దీంతో చూశావా మామ్ తను హద్దు దాటి ఎలా మాట్లాడుతుందో అంటాడు శైలేంద్ర. మామయ్య గారు నాకు ఒక బాధ్యత అప్పగించారు. మిమ్మల్ని ఇద్దర్నీ మాట్లాడుకోకుండా చేయమని. కానీ.. నా వల్ల కావడం లేదు.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి. దీంతో శైలేంద్రకు చాలా కోపం వస్తుంది. నువ్వు ఆవేశపడకు. అసలు ఆ ముకుల్ గాడిని ఎందుకు రిషి తీసుకొచ్చాడు. ఆ ముకుల్ గాడి కళ్లు డేగ కళ్లులా ఉన్నాయి. మన గురించి అన్ని విషయాలు తెలుసుకునేలా ఉన్నాడు. మన బండారం బయటపెట్టేలా ఉన్నాడు.. అది ఊహించుకుంటేనే నా ప్రాణం పోయినట్టు అవుతోంది అంటుంది దేవయాని. నువ్వు ఏదేదో ఊహించుకొని నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. నువ్వు ముందు కాఫీ తాగి ప్రశాంతంగా పడుకో అని నచ్చజెప్తాడు శైలేంద్ర.

మరోవైపు రిషి.. మహీంద్రాకు కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఏంటి నువ్వు తీసుకొచ్చావు. ఎనీ స్పెషల్ అంటే.. ఏం లేదు. ఇవ్వాలనిపించింది.. ఇచ్చాను అంటాడు రిషి. నిన్న పెద్దమ్మ ఇంటికి వెళ్లావు కదా ఏమైంది అంటే.. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వెళ్లాను. స్పెషల్ ఆఫీసర్ ను తీసుకొని వెళ్లాను. మనం ఎంత ట్రై చేసినా కేసు ముందుకు సాగడం లేదు. అందుకే ఈ స్టెప్ తీసుకున్నాను అంటాడు రిషి. దీంతో చాలా మంచి పని చేశావు నాన్న అంటాడు. ఆ ముకుల్ ఎవరో కాదు.. అమ్మ స్టూడెంట్. ఖచ్చితంగా ముకుల్ ఈ కేసును ఛేదిస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో ఏదో ఒక క్లూ పట్టుకుంటారు. అతి త్వరలోనే నేరస్తులు ఎవరు అనేది తెలుస్తుంది డాడ్ అంటాడు రిషి. అమ్మను మనకు కాకుండా చేసిన వాళ్లను నామరూపం లేకుండా చేస్తాను. ఎవ్వరైనా సరే.. ఎంతటి వారైనా సరే. అమ్మ ప్రాణం పోవడానికి కారణం అయిన వాళ్లు ఎవరో తెలిసిన వెంటనే వాళ్లను మీ ముందే శిక్షిస్తాను. మీరు కూడా ఒకసారి ముకుల్ ను కలవండి డాడ్ అంటాడు రిషి. దీంతో సరే అంటాడు మహీంద్రా.

Guppedantha Manasu 4 Nov Today Episode : అనుపమకు భరోసా ఇచ్చిన పెద్దమ్మ

ఈ విధంగా అయినా రిషి సార్ ముందడుగు వేశారు మామయ్య అంటుంది వసు. దీంతో అవునమ్మా.. రిషి వేసే అడుగులు వాళ్ల పతనం వైపు పడుతున్నాయి అంటాడు. ఈసారి అయినా వాళ్ల బండారం బయటపడాలి మామయ్య అంటుంది వసు. అవునమ్మా.. నేను కూడా దాని కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు మహీంద్రా.

మరోవైపు అనుపమ.. మళ్లీ మహీంద్రాకు కాల్ చేస్తుంది కానీ.. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా పయనం ఒంటరిగానే సాగిపోవాలా? లేక పెద్దమ్మ చెప్పినట్టు మహీంద్రాను కలవాలా అని అనుకుంటుంది అనుపమ. ఇంతలో పెద్దమ్మ వస్తుంది. ఏం ఆలోచించుకున్నావు అని అడుగుతుంది. దీంతో అదే అర్థం కావడం లేదు అంటుంది అనుపమ.

అప్పటి నుంచి నా మనసు నా మాట వినడం లేదు అంటుంది అనుపమ. ఎటు చూసినా, ఏం చేసినా అవే ఆలోచనలు అంటుంది అనుపమ. నా గతం నన్ను ఒక పట్టాన ఉండనీయడం లేదు అంటుంది అనుపమ. అందుకే నువ్వు వాళ్లను కలువు అంటుంది పెద్దమ్మ. ఇప్పుడైనా ఆలోచించు అంటుంది. దీంతో సరే పెద్దమ్మ అంటుంది. నువ్వు చెప్పినట్టే నా ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్లాలనిపిస్తోంది అంటుంది అను. నిజమా అంటుంది పెద్దమ్మ.

అవును పెద్దమ్మ.. నేను కోల్పోయింది తిరిగి పొందాలని అనుకుంటున్నాను. కొత్త జీవితం పొందాలనుకుంటున్నాను అంటుంది అనుపమ. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే.. మన తల్లిదండ్రులను మాత్రం బాధపెట్టకూడదు. మన ఓటమికి వాళ్లను దోషులను చేసి మాట్లాడకూడదు.. అంటుంది అనుపమ.

మరోవైపు బాత్ రూమ్ లో రిషి ఉంటాడ. సార్ సార్ అని పిలుస్తుంది. వస్తున్నా అంటాడు. 5 నిమిషాలు వెయిట్ చేసి వెయింటింగ్ ఫర్ యు ఆల్వేస్ అని చెప్పి బాత్ రూమ్ డోర్ కు పెట్టి బయటికి వెళ్తుంది. వసుధార ఎక్కడున్నావు అంటే.. ఇంటి బయట ఉన్నా రండి అని మెసేజ్ పెడుతుంది. వచ్చేస్తాను కానీ.. ఏంటి ఈ మధ్య కొంచెం ఎక్కువ చేస్తున్నావు అని అడుగుతాడు రిషి.

దీంతో నేనా.. అదేం లేదు సార్. అయినా ఎందుకు అలా అనుకుంటున్నారు అంటుంది వసు. మరి అయితే వెయిటింగ్ అని రాశావేంటి అంటే లేట్ అవుతుంది కదా అని అంటుంది. అందుకని నన్ను టీజ్ చేస్తున్నావా? చెప్పండి ఎండీ గారు అంటాడు రిషి.

ఫీల్ అవుతున్నారా అంటే లేదు నువ్వు అలా రాసినందుకు ఆనందంతో గంతులేస్తున్నాను అంటాడు. ముందు త్వరగా రెడీ అయి రండి సార్.. కాలేజీకి వెళ్లాలి అంటుంది రిషి. ఇలా.. ఇద్దరూ మెసేజ్ ల రూపంలో కాసేపు చాట్ చేసుకుంటారు.

మరోవైపు దేవయాని, శైలేంద్ర ఇద్దరూ సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో రవీంద్ర వస్తాడు అక్కడికి. దేవయాని ఎందుకు నువ్వు రాత్రి లేట్ గా పడుకున్నావు అని అడుగుతాడు. దీంతో ఇంతలో ధరణి వచ్చి అవును మామయ్య.. ఈయన కూడా చాలా లేట్ గా పడుకున్నారు అంటుంది ధరణి.

అవును.. నేను నీకు ఒక టాస్క్ చెప్పాను కదా. వీళ్లిద్దరూ మాట్లాడుకోకుండా చేయమని అంటే.. అవును మామయ్య అంటుంది. మరి నువ్వు ఈ టాస్క్ లో ఫెయిల్ అయ్యావు అంటుంది ధరణి. మీ టాస్కులు పక్కన పెట్టండి. రిషి వాళ్లు ఇంట్లో లేకపోతే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది దేవయాని.

కానీ.. రిషి ఇలా ఎంక్వయిరీకి మన ఇంటికి ఒక మనిషిని తీసుకొస్తాడని నేను అనుకోలేదు. అసలు రిషి ఇలా మారిపోయాడు ఏంటి. మహీంద్రా వల్లనే ఇదంతా.. అంటూ దేవయాని రెచ్చిపోతుంది. దీంతో దేవయాని అంటూ సీరియస్ అవుతాడు రవీంద్ర. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. నువ్వు ఇప్పటిదాకా చేసిన ఘనకార్యాలు చాలు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు రవీంద్ర.

అసలు నా తమ్ముడి గురించి నీకేం తెలుసు అంటూ సీరియస్ అవుతాడు. మనందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండాలని, విడిపోకూడదని తన భార్యను కూడా దూరం పెట్టిన మహాత్ముడు నా తమ్ముడు. తన గొప్పదనం నువ్వెప్పుడూ గుర్తించలేదు. నీకు నచ్చినట్టే ఉన్నావు. ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేదు. ఇకపై కూడా చేసుకోలేవు. నువ్వు వాళ్ల విషయాల్లో కలుగజేసుకోవద్దు అంటూ వార్నింగ్ ఇస్తాడు రవీంద్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

4 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

5 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

6 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

7 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

8 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

9 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

10 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

11 hours ago