Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : తులసికి కోర్టు నోటీసులు పంపించిన లాస్య.. రత్నప్రభ, లాస్యకు భారీ షాకిచ్చిన తులసి.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వెళ్లడంతో అందరూ షాక్

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 4 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 1093 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు అడ్రస్ కనుక్కున్నావంటే అర్థం ఉంది.. క్లూ దొరికింది.. కిడ్నాప్ చేసిన కారు దొరికింది. కానీ.. ఆంటి దగ్గర ఎలాంటి క్లూ లేదు కదా అంటుంది జాను. దీంతో ఏంటి విక్రమ్ ఇది. జాను ఇలా మాట్లాడుతుంది. మారింది అన్నావు కదా. ఏంటి ఇలా మా అమ్మను అనుమానిస్తోంది అంటుంది దివ్య. విక్రమ్ నాకు సమాధానం చెప్పడం వచ్చు కానీ.. మొహం మీద కొట్టినట్టు చెబుతాను. దానికి వాళ్లు ఫీల్ అవ్వడం, వాళ్లు ఫీల్ అయ్యారని నువ్వు ఫీల్ అవ్వడం, ఆ తర్వాత నేను ఫీల్ అవ్వడం ఇవన్నీ అవసరమా? వాళ్లకు నువ్వే సమాధానం చెప్పు. ఇలాంటి వంకర సమాధానాలు నాకు నచ్చవు అని చెప్పి దివ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జాను.. నాకు తెలిసి నీ మనసులో పుట్టిన డౌట్స్ కావు ఇవి. ఎవరో రెచ్చగొడితే అడుగుతున్నావు. వెళ్లి తులసి అత్తయ్యతో కొన్ని రోజులు కలిసి ఉండు. అప్పుడు తెలుస్తుంది అంటాడు విక్రమ్. ఏంటి అల్లుడు ఇది ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలా పారిపోతుంది ఏంటి అని అంటాడు బసవయ్య. నాన్న చెప్పినట్టు నిజంగానే దివ్య.. బావను ఆడిస్తోంది అని అనుకుంటుంది జాను.

ఈరోజు ఎవరో కొత్త పార్టీని కలవాలన్నారు కదా. ఇంకా ఇంట్లోనే ఉన్నారు అంటే.. ఈవెనింగ్ వెళ్తాను. కేఫే వర్క్ చేస్తున్నా అంటాడు నందు. ఇంతలో తులసికి ఒక కోరియర్ వస్తుంది. కోర్టు నుంచి నోటీసు వచ్చింది మేడమ్ అంటాడు. ఎందుకు అంటే.. సైన్ చేసి చదువుకోండి మేడమ్ అంటాడు కోరియర్ వ్యక్తి. కోర్టు నుంచి నోటీసులు రావడం ఏంటి.. అని చెక్ చేస్తాడు నందు. అది రత్నప్రభ నుంచి వచ్చిన నోటీసు. హనీని వాళ్ల ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లారని రత్నప్రభ కేసు వేసింది. దానికి సంబంధించి కోర్టు నుంచి నోటీసులు ఇచ్చారు అంటాడు నందు. బలవంతంగా ఎత్తుకురావడం ఏంటి.. బెదిరించి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కేసు పెట్టి భయపెడుతున్నారు అంటుంది తులసి. మనం చేసిన తప్పుకు సమాధానం చెప్పుకోవాలి. రత్న వాళ్లే హనీకి రక్త సంబంధీకులు. వాళ్లకే హక్కు ఉంటాయి. కేసు వాళ్లే గెలుస్తారు అంటాడు నందు.

Intinti Gruhalakshmi 4 Nov Today Episode : కోర్టు ద్వారా హనీని ఎలా దక్కించుకోవాలో ఆలోచించిన తులసి

ఆస్తి కోసం ఆశపడి హనీని వల వేసుకొని మనమే హనీతో చెప్పిస్తున్నాం అంటారు రత్నవాళ్లు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటాడు నందు. నిర్దోషిత్వం నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కోర్టుకు కావాల్సింది రుజువులు అంటాడు నందు. ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది తులసి. వాళ్లు ఎందుకు ఊరుకుంటారు. కోట్ల ఆస్తి ఎందుకు వదులుకుంటారు అంటాడు నందు. దీంతో మనం న్యాయ పోరాటం చేద్దాం. ఏం చేసి అయినా హనీని దక్కించుకుందాం. న్యాయం మన వైపు ఉంది. మనమే కేసు గెలుస్తాం. ఒక మంచి లాయర్ ను చూడండి అంటుంది తులసి.

కూతురును కిడ్నాప్ చేస్తేనే భయపడని వాళ్లు.. కోర్టు నోటీసులు చూసి భయపడతారా? అని లాస్యతో రత్నప్రభ అంటుంది. మీరు హనీకి అఫిషియల్ గా గార్డియన్స్ అవుతారు అంటుంది లాస్య. లీగల్ నోటీసు ఇచ్చాం కానీ.. మన పద్ధతిలో మనం ప్రయత్నం చేద్దాం. అవసరం అయితే ఎత్తుకొద్దాం అంటుంది రత్నప్రభ. చేతుల్లో చిల్లిగవ్వ లేదు. ఏం చేసి అయినా హనీని ఎత్తుకురావాల్సిందే. షేర్స్ మా పేరు మీదికి ట్రాన్స్ ఫర్ అయితే కానీ మేము సీఈవో కాలేము అంటుంది రత్నప్రభ.

ఇంతకీ హనీ వాళ్ల తాతయ్య ఎక్కడున్నాడు అంటే.. తెలియదు పారిపోయాడు అంటుంది రత్నప్రభ. ముందు లీగల్ నోటీసుకు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం అంటుంది లాస్య. మరోవైపు లాస్య ఫోన్ చేసింది అని చెబుతాడు నందు. ఏమైనా చేసుకోమని చెప్పండి. గంటకోసారి ఫోన్ చేసి బ్రేకింగ్ న్యూస్ ఇవ్వొద్దని చెప్పండి అంటుంది తులసి.

ఎందుకు తనను రెచ్చగొట్టడం అంటాడు నందు. తను కాల్ చేస్తుంటే కనీసం వాళ్ల ప్లాన్ ఏంటో తెలుస్తుంది కదా అంటాడు నందు. కోర్టు నోటీసు పంపించింది కదా. ప్రశాంతంగా పడుకోమను అంటుంది తులసి. హనీ విషయంలో కేసు గెలిచినా, ఓడినా మన ప్రయత్నం మనం చేద్దాం. కాకపోతే వాళ్ల ఆస్తి జోలికి, వాళ్ల బిజినెస్ జోలికి వెళ్లొద్దు అంటాడు నందు.

దీంతో అది వాళ్ల ఆస్తి కాదు.. వాళ్ల బిజినెస్ కాదు. అది సామ్రాట్ ఆస్తి అంటుంది తులసి. వాళ్లు మన ఇంటికి వచ్చిన మొదటి రోజే వాళ్ల మనస్తత్వం ఏంటో తెలిసిపోయింది. సామ్రాట్ వాళ్ల బాబాయి కూడా నాకు చాలాసార్లు చెప్పుకొని బాధపడ్డారు అంటాడు నందు.

మరోవైపు దివ్య మూడీగా ఉండటంతో తన దగ్గరికి వెళ్తాడు విక్రమ్. జాను మనిద్దరి మధ్య చిచ్చుపెడుతోంది అంటుంది దివ్య. ఇంతలో విక్రమ్ తాతయ్య వస్తాడు. ముందు నువ్వు దివ్య గురించి ఆలోచించు అంటాడు. దీంతో నీలా కాళ్లు గడ్డాలు పట్టుకోవడం కాదు.. తలుపులు మూసి గదిలో బతిమిలాడుకున్నాను అంటాడు తాతయ్య.

మీరు ఇలా అయితే కష్టం.. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్లిరండి అని చెబుతాడు. మరోవైపు లాస్య ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది. ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావు అంటుంది రత్నప్రభ. రేపు కంపెనీ బోర్డ్ మీటింగ్ ఉంది. గుర్తుందా? అంటుంది రత్నప్రభ.

బోర్డ్ ఆఫ్ మీటింగ్ కు ఇంతలో తులసి వస్తుంది. దీంతో లాస్య, రత్నప్రభ షాక్ అవుతారు. అసలు తులసి ఆ మీటింగ్ కు ఎందుకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Rajagopal : అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడుతా – కోమటిరెడ్డి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…

9 hours ago

AP Police Recruitment Board : ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో భారీగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…

12 hours ago

Laptop | ల్యాప్‌టాప్ వైఫై పాస్‌వర్డ్ మరిచిపోయారా.. అయితే ఇలా చేయండి..!

Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధార‌ణంగా జ‌రిగేదే. పాస్‌వర్డ్ మ‌రిచిపోయిన‌ప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…

14 hours ago

SIIMA | సైమా 2025.. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఉత్తమ నటి సాయి పల్లవి

SIIMA | 'సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…

15 hours ago

BCCI | బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

ప్ర‌పంచంలోనే ధ‌నిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్ర‌స్తుతం బీసీసీఐ ఖాతాలో…

16 hours ago

Ponguleti srinivas reddy | ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ .. లబ్ధిదారులకు నేరుగా ఫోటోలు అప్‌లోడ్ చేసే అవకాశం

Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…

17 hours ago

Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్.. ప్రోమోతో అంద‌రిలో స‌స్పెన్స్

Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…

18 hours ago

Coconut| ప‌రిగ‌డ‌పున కొబ్బ‌రి తింటే అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…

19 hours ago