
Jabardast Naresh : ఎట్టకేలకు లవ్ స్టోరీ ని బయటపెట్టిన జబర్దస్త్ నరేష్..!
Jabardast Naresh : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో “జబర్దస్త్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా అనేకమంది నటీనటులు బుల్లితెరకు పరిచయమయ్యారు. అలాంటి వారిలో నరేష్ ఒకడు. వైకల్యం ఉన్నప్పటికీ, తనలో ఉన్న ప్రతిభను సమర్ధంగా వినియోగించుకుని ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. జబర్దస్త్ షోలో తన కామెడీ పంచ్‌లతో నవ్వులు పంచుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. మల్లెమాల ప్రొడక్షన్స్ లోని ఇతర షోలతో పాటు టీవీ ఈవెంట్స్, ప్రోగ్రామ్‌లలో కూడా నరేష్ సందడి చేస్తున్నాడు.
Jabardast Naresh : ఎట్టకేలకు లవ్ స్టోరీ ని బయటపెట్టిన జబర్దస్త్ నరేష్..!
నరేష్ గురించి మరో ఆసక్తికర అంశం అతడి లవ్ ట్రాక్. జబర్దస్త్ స్టేజీ మీద నటిస్తూ సీరియల్ నటి షబీనా షేక్ తో కలిసి స్కిట్లలో లవ్ ట్రాక్ ప్రదర్శించాడు. స్కిట్ భాగంగా చేసిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారని చాలా మంది భావించారు. కానీ ఇటీవల షబీనా షేక్ మరొకరిని వివాహం చేసుకోవడంతో నిజంగా ఆ ప్రేమ ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనపై వస్తున్న గాసిప్స్ కు ముగింపు పలికేలా నరేష్ మాట్లాడుతూ ..“నాకు పెళ్లి కాలేదు.
ఇంకో రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిలకు సంబంధించి నాకు అందం, మోడ్రన్‌నెస్ అవసరం లేదు. మా అమ్మ నాన్నను గౌరవంగా చూసుకునే మనసున్న అమ్మాయి చాలనిపిస్తుంది” అంటూ చెప్పాడు. షబీనా షేక్ తో తన లవ్ ట్రాక్ నిజంగా కాకుండా కేవలం స్కిట్ కోసమే అని స్పష్టం చేశాడు. “ఆ లవ్ ట్రాక్ స్కిట్ కోసం రోజా గారే ప్లాన్ చేసింది” అని కూడా వెల్లడించాడు. షబీనా పెళ్లికి పిలిచిందని కానీ గుంటూరులో ఉండటంతో వెళ్లలేకపోయానన్న నరేష్.. “వెళ్లి ఉంటే నన్ను చూసి స్టేజీ మీద నుండి పెళ్లి కట్ చేసేదేమో” అంటూ సరదాగా స్పందించడంతో, ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
This website uses cookies.