Jabardast Naresh : ఎట్టకేలకు లవ్ స్టోరీ ని బయటపెట్టిన జబర్దస్త్ నరేష్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardast Naresh : ఎట్టకేలకు లవ్ స్టోరీ ని బయటపెట్టిన జబర్దస్త్ నరేష్..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2025,5:30 pm

ప్రధానాంశాలు:

  •  జబర్దస్త్ నరేష్ లవ్ కు సపోర్ట్ చేసింది రోజానే

  •  Jabardast Naresh : ఎట్టకేలకు లవ్ స్టోరీ ని బయటపెట్టిన జబర్దస్త్ నరేష్..!

Jabardast Naresh : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో “జబర్దస్త్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా అనేకమంది నటీనటులు బుల్లితెరకు పరిచయమయ్యారు. అలాంటి వారిలో నరేష్ ఒకడు. వైకల్యం ఉన్నప్పటికీ, తనలో ఉన్న ప్రతిభను సమర్ధంగా వినియోగించుకుని ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. జబర్దస్త్ షోలో తన కామెడీ పంచ్‌లతో నవ్వులు పంచుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. మల్లెమాల ప్రొడక్షన్స్ లోని ఇతర షోలతో పాటు టీవీ ఈవెంట్స్, ప్రోగ్రామ్‌లలో కూడా నరేష్ సందడి చేస్తున్నాడు.

Jabardast Naresh ఎట్టకేలకు లవ్ స్టోరీ ని బయటపెట్టిన జబర్దస్త్ నరేష్

Jabardast Naresh : ఎట్టకేలకు లవ్ స్టోరీ ని బయటపెట్టిన జబర్దస్త్ నరేష్..!

Jabardast Naresh : జబర్దస్త్ నరేష్ లవ్ స్టోరీ..అసలు జరిగింది ఇదే

నరేష్ గురించి మరో ఆసక్తికర అంశం అతడి లవ్ ట్రాక్. జబర్దస్త్ స్టేజీ మీద నటిస్తూ సీరియల్ నటి షబీనా షేక్ తో కలిసి స్కిట్లలో లవ్ ట్రాక్ ప్రదర్శించాడు. స్కిట్ భాగంగా చేసిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారని చాలా మంది భావించారు. కానీ ఇటీవల షబీనా షేక్ మరొకరిని వివాహం చేసుకోవడంతో నిజంగా ఆ ప్రేమ ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనపై వస్తున్న గాసిప్స్ కు ముగింపు పలికేలా నరేష్ మాట్లాడుతూ ..“నాకు పెళ్లి కాలేదు.

ఇంకో రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిలకు సంబంధించి నాకు అందం, మోడ్రన్‌నెస్ అవసరం లేదు. మా అమ్మ నాన్నను గౌరవంగా చూసుకునే మనసున్న అమ్మాయి చాలనిపిస్తుంది” అంటూ చెప్పాడు. షబీనా షేక్ తో తన లవ్ ట్రాక్ నిజంగా కాకుండా కేవలం స్కిట్ కోసమే అని స్పష్టం చేశాడు. “ఆ లవ్ ట్రాక్ స్కిట్ కోసం రోజా గారే ప్లాన్ చేసింది” అని కూడా వెల్లడించాడు. షబీనా పెళ్లికి పిలిచిందని కానీ గుంటూరులో ఉండటంతో వెళ్లలేకపోయానన్న నరేష్.. “వెళ్లి ఉంటే నన్ను చూసి స్టేజీ మీద నుండి పెళ్లి కట్ చేసేదేమో” అంటూ సరదాగా స్పందించడంతో, ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది