Karthika Deepam 2 April 2nd 2026 Episode : దీప చావుకు జ్యోత్స్న ముహూర్తం.. డీఎన్ఏ రిపోర్ట్స్ చూసి కార్తీక్ షాక్!

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 April 2026,8:30 am

Karthika Deepam 2 April 2nd 2026 Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజురోజుకూ ఊహించని మలుపులతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఏప్రిల్ 2న ప్రసారం కానున్న 634వ ఎపిసోడ్ లో కథ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఎప్పుడూ దీప అంటే మండిపడే పారిజాతం.. అనూహ్యంగా దీప, శౌర్యల మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరోవైపు తన స్థానాన్ని లాగేసుకుంటుందన్న భయంతో దీపను శాశ్వతంగా అంతమొందించాలని జ్యోత్స్న చావుకు ముహూర్తం పెడుతుంది. ఈ క్రమంలోనే జ్యోత్స్న దాచిన డీఎన్ఏ DNA రిపోర్ట్స్ కార్తీక్ కంటపడటంతో కథ కీలక మలుపు తిరిగింది. మరి ఈ ఎపిసోడ్ లో జరిగిన పూర్తి విశేషాలు, హైలైట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Karthika Deepam 2 April 2nd 2026 Episode : దీప చావుకు జ్యోత్స్న ముహూర్తం.. డీఎన్ఏ రిపోర్ట్స్ చూసి కార్తీక్ షాక్!

Karthika Deepam 2 April 2nd 2026 Episode : దీప చావుకు జ్యోత్స్న ముహూర్తం.. డీఎన్ఏ రిపోర్ట్స్ చూసి కార్తీక్ షాక్!

Karthika Deepam 2 April 2nd 2026 Episode శౌర్యకు సారీ చెప్పిన జ్యోత్స్న.. పారిజాతం ఓవరాక్షన్

ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇంట్లో పెద్ద హైడ్రామా నడుస్తుంది. జ్యోత్స్న ఢీకొట్టడం వల్ల శౌర్య కింద పడిపోతుంది. దీంతో పారిజాతానికి ఎక్కడలేని కోపం వస్తుంది. జ్యోత్స్నను చెంపపై కొట్టి మరీ శౌర్యకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. జ్యోత్స్న ఎంత మొండికేసినా పారిజాతం అస్సలు వదిలిపెట్టదు. కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. దీప కూడా ఈ సీన్ చూసి ఆశ్చర్యపోతుంది. పారిజాతం ఈ విధంగా న్యాయం చేస్తుండటంతో పారు ఓవరాక్షన్ పీక్స్ కి చేరుకుంటుంది. “నాకేం దెబ్బలు తగల్లేదని” శౌర్య అమాయకంగా చెప్పినా, “నాకు దెబ్బలు తగిలాయి” అంటూ పారు ఎమోషనల్ అవుతుంది. ఈ డ్రామాను చూస్తున్న కార్తీక్ కూడా కావాలనే పారిజాతానికి సపోర్ట్ చేస్తాడు. “దాస్.. మీ అమ్మకి, మీ అమ్మాయికి గొడవ పెడతాను చూడు” అని కార్తీక్ సరదాగా అంటాడు. చివరకు పారు పట్టుబట్టడంతో జ్యోత్స్న అయిష్టంగానే శౌర్యకు సారీ చెబుతుంది. అసలు పారిజాతానికి ఏమైంది? రాత్రి కూడా మన ఇంటికి వచ్చి హడావిడి చేసింది అంటూ కాంచన, శ్రీధర్ మాట్లాడుకుంటారు.

Karthika Deepam 2 April 2nd 2026 Episode దీపకు పారిజాతం జ్యూస్.. ‘నానమ్మ పోలికలు’ అంటూ అడ్డంగా బుక్కైన పారు

ఆ తర్వాత ఇంట్లో మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంటుంది. పారిజాతం స్వయంగా తన చేతులతో జ్యూస్ కలుపుకుని తీసుకొస్తుంది. “ఎంతైనా మనవరాలికి జ్యోత్స్న అంటే చాలా ఇష్టం కదా.. అందుకే ఇప్పుడే తిట్టి, మళ్ళీ వెంటనే జ్యూస్ తీసుకొచ్చింది” అని కార్తీక్ అంటాడు. శివన్నారాయణ కూడా “మనవరాలికి జ్యూస్ తీసుకురాలేదా?” అని అడుగుతాడు. దానికి పారు “నా మనవరాలికే తీసుకొచ్చాను” అంటూ నేరుగా వెళ్లి ఆ జ్యూస్ గ్లాసును దీప చేతిలో పెడుతుంది. దీపకు జ్యూస్ ఇవ్వడం చూసి జ్యోత్స్న, కార్తీక్, శివన్నారాయణ సహా ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

దీప జ్యూస్ వద్దని మొహమాటపడుతున్నా.. పారు వినదు. “దీనికి అసలే మొహమాటం ఎక్కువ, అన్నీ ఈ నానమ్మ పోలికలే వచ్చాయి” అని పారిజాతం అనేస్తుంది. ఆ మాటతో అందరూ మరోసారి ఖంగుతింటారు. “హలో తను దీప.. జ్యోత్స్న కాదు. దీపకి నీ పోలికలు ఎందుకు వస్తాయి పిన్ని?” అని దశరథ, శ్రీధర్ లు పారును నిలదీస్తారు. పారు అడ్డంగా ఇరుక్కుపోవడంతో.. “మా అమ్మ ఇరుక్కుపోయింది.. ఎలా కవర్ చేస్తుందో చూద్దాం” అని దాస్ అనుకుంటాడు. వెంటనే పారిజాతం తేరుకుని.. “ఒకప్పుడు చాలా ఏళ్ల క్రితం ఈ ఇంట్లో నేను పనిమనిషిగా ఏం చేసేదాన్నో, ఇప్పుడు దీప కూడా అదే చేస్తోంది కదా. ఆ విధంగా మా పోలికలు కలిశాయి. ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి అలా అన్నాను” అని గతం గుర్తుచేసుకుని కవరింగ్ ఇస్తుంది. ఆ తర్వాత, ఇక్కడ తాగితే దిష్టి తగులుతుంది, పైకి వెళ్లి తాగు అని దీపను పారు అక్కడినుండి పంపిస్తుంది. అసలు గ్రానీకి ఈ దీప మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసుకోవాలని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది.

దీప చావుకు ముహూర్తం పెట్టిన జ్యోత్స్న

దీప పైకి వెళ్లి జ్యూస్ తాగుతుండగా, జ్యోత్స్న అక్కడికి వస్తుంది. “మా గ్రానీ కోరలు బావ పీకేశాడు. అందుకే ఎప్పుడూ లేనిది వింతగా ప్రవర్తిస్తూ నీ మీద ప్రేమ చూపిస్తోంది. మా గ్రానీని ఏం చేశారో” అని జ్యోత్స్న అంటుంది. దానికి దీప బదులిస్తూ.. “మనుషులు మారుతారు జ్యోత్స్న.. ఆ మార్పు అందరిలో వస్తే మంచిది. మంచినీళ్లు కూడా ఇవ్వని పారిజాతం ఇప్పుడు జ్యూస్ తీసుకొచ్చింది” అని కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది.

“నువ్వు మీ అమ్మనాన్నలను కాపాడావు కదా.. వాళ్ళు బతికే ఉన్నారని మాట వరసకు అనుకో” అని జ్యోత్స్న అనగా.. “అవును వాళ్ళు నిజంగానే బతికే ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు” అని దీప బదులిస్తుంది. “వాళ్లెవరో తెలుసుకున్నాక ఫస్ట్ నీకే చెబుతాను” అని దీప ధీమాగా అనడంతో జ్యోత్స్నలో క్రూరత్వం నిద్రలేస్తుంది. “మీ అమ్మనాన్నలు ఎవరో తెలిసే నాటికి నువ్వు ఉండవు దీప. నువ్వు మా ఇంట్లో పనిమనిషిగా ఉండవు కదా. ఈరోజు అందరినీ తనివితీరా చూసుకో. మా అమ్మనాన్నలనే నీ అమ్మానాన్నలను అనుకో, ఈ ఇల్లే నీ పుట్టిల్లు అనుకో. ముందు నీ కడుపులో ఉన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకో” అని జ్యోత్స్న ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్న మాటలకు దీప భయపడినా.. “నా బిడ్డను నేను కాపాడుకోగలను” అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోతుంది. “నీ బిడ్డ సంగతి తర్వాత, ముందు నిన్ను నువ్వు కాపాడుకో దీప. ఈరోజు నీ చావుకు ముహూర్తం పెట్టాను. నీ ఫోటోకు దండవేసి కుబేరా ఫోటో పక్కన పెడతాను” అని జ్యోత్స్న తన మనసులో దీప హత్యకు పక్కా ప్లాన్ చేసుకుంటుంది.

శౌర్య దొంగ పోలీస్ ఆట.. పారు చేతికి డీఎన్ఏ DNA రిపోర్ట్స్

మరోవైపు పారిజాతం శౌర్యను తీసుకుని జ్యోత్స్న గదిలోకి వెళుతుంది. శౌర్యకు బోలెడన్ని చాక్లెట్స్ ఇచ్చి మురిసిపోతుంది. “ఇప్పుడు పారు మారిపోయింది కదా. నువ్వు నా ముని మనవరాలి కూతురివి” అంటూ శౌర్యతో ప్రేమగా మాట్లాడుతుంది. మీ అమ్మను ఇంకెప్పుడూ తిట్టనని ప్రామిస్ కూడా చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దొంగ-పోలీస్ ఆట ఆడుకుంటారు. శౌర్య ఆడుకుంటూ జ్యోత్స్న బెడ్ పైకి ఎక్కి గెంతుతుంది. ఆ సమయంలో దిండు కింద జ్యోత్స్న దాచిపెట్టిన హాస్పిటల్ డీఎన్ఏ రిపోర్ట్స్ కవర్ బయటపడుతుంది.

పారిజాతం ఆ కవర్ తీసుకుని చూస్తుంది. అందులో ఉన్నదంతా ఇంగ్లీష్ లో ఉండటంతో పారుకి చదవడం రాదు. శౌర్యను అడిగితే నాకు తెలియదు అని పారిపోతుంది. ఈ పేపర్స్ ఏంటో తెలుసుకోవాలని పారు గదిలోంచి బయటకు వస్తుండగా.. ఎదురుగా శివ నారాయణ వస్తాడు. ఆ పేపర్లు ఏంటో ఇవ్వమని ఆయన అడగ్గా.. భయపడిన పారు “ఇవి చిత్తు కాగితాలు, డస్ట్ బిన్ లో పారేస్తాను” అని అబద్ధం చెప్పి అక్కడినుండి తప్పించుకుంటుంది.

కార్తీక్ కు తెలిసిన నిజం.. జ్యోత్స్నకు పెరిగిన అనుమానం

ఈ పేపర్లలో ఏముందో చదివించుకోవడానికి పారు ఎవరికోసం వెతుకుతుండగా.. కార్తీక్ ఎదురుపడతాడు. ఆ రిపోర్ట్స్ ను కార్తీక్ చేతికి ఇచ్చి, ఇందులో ఏముందో చదివి చెప్పమని పారు అడుగుతుంది. కార్తీక్ ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చదవగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందులో సుమిత్ర, దీప, జ్యోత్స్నల డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. సుమిత్ర కన్న కూతురు దీప అని ఆ రిపోర్ట్స్ లో స్పష్టంగా రాసి ఉండటాన్ని కార్తీక్ చూస్తాడు. అంటే.. “జ్యోత్స్నకు నిజం మొత్తం తెలిసిపోయిందన్నమాట. దీప ఎవరో, తన స్థానం ఏంటో జ్యోత్స్నకు అర్థమైపోయి ఆ నిజాన్ని దాస్తోంది” అని కార్తీక్ గ్రహిస్తాడు.

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కార్తీక్ పారుతో అంటుండగానే.. సరిగ్గా అప్పుడే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. జ్యోత్స్నను చూసి కార్తీక్, పారిజాతం ఇద్దరూ కంగుతింటారు. పారు వెంటనే ఆ రిపోర్ట్స్ ను తన చీర కొంగు చాటున దాచేస్తుంది. “నేను నీతో మాట్లాడాలి బావ” అని జ్యోత్స్న అంటుండగానే.. పారు మెల్లిగా అక్కడినుండి జారుకుని తన గదిలోకి వెళ్లి ఆ రిపోర్ట్స్ ను మళ్ళీ దిండు కింద పెట్టేస్తుంది. కానీ జ్యోత్స్నకు ఎక్కడో డౌట్ కొడుతుంది. తన గదిలోకి వెళ్లి చెక్ చేసుకోగా.. తాను పెట్టిన కవర్ ను ఎవరో కదిలించినట్లు, తీసినట్లు ఆమెకు అనిపిస్తుంది. “బావకు నిజం తెలిసిపోయిందా? నేను ఏ పనైతే చేయాలనుకున్నానో, ఆ పనిని వెంటనే పూర్తి చేయాలి” అని జ్యోత్స్న ఫిక్స్ అవ్వడంతో ఈనాటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది.

తరువాయి భాగంలో ఏం జరగనుంది?

దీపను చంపడానికి జ్యోత్స్న వేసిన ప్లాన్ ఏంటి? డీఎన్ఏ రిపోర్ట్స్ చూసిన కార్తీక్.. దీపను జ్యోత్స్న బారినుండి ఎలా కాపాడుతాడు? అసలు నిజం సుమిత్రకు, శివన్నారాయణకు ఎప్పుడు తెలుస్తుంది? అనేది రాబోయే ఎపిసోడ్స్ లో అత్యంత ఆసక్తికరంగా మారనుంది.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి