Karthika Deepam 2 March 24th Episode : దీప గుట్టు పట్టేసిన పారు.. రిపోర్ట్స్ కోసం జ్యోత్స్న వెయిటింగ్.. స్వప్నకు మళ్లీ పెళ్లి!

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: March 24, 2026, 8:30 am

Karthika Deepam 2 March 24th Episode : స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. సుమిత్ర ప్రాణాలు కాపాడటం కోసం దీప చేసిన త్యాగం.. ఆ త్యాగాన్ని దాచిపెట్టడానికి కార్తీక్ పడుతున్న ఆరాటం.. ఈ నిజాలను ఎలాగైనా బయటకు తీయాలని జ్యోత్స్న వేస్తున్న ప్లాన్స్.. వెరసి సీరియల్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మరి ఈరోజు (మార్చి 24వ తేదీ) మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

Karthika Deepam 2 March 24th Episode : దీప గుట్టు పట్టేసిన పారు.. రిపోర్ట్స్ కోసం జ్యోత్స్న వెయిటింగ్.. స్వప్నకు మళ్లీ పెళ్లి!

Karthika Deepam 2 March 24th Episode : దీప గుట్టు పట్టేసిన పారు.. రిపోర్ట్స్ కోసం జ్యోత్స్న వెయిటింగ్.. స్వప్నకు మళ్లీ పెళ్లి!

Karthika Deepam 2 March 24th Episode శౌర్య ఆనందానికి అవధులు లేవు.. ఇంట్లో పండగ వాతావరణం

సుమిత్ర ఆపరేషన్ సక్సెస్ అవ్వడం, మరోవైపు దీప తన కడుపులో ఉన్న బిడ్డను వదులుకోకూడదని నిర్ణయం తీసుకోవడంతో కాంచన ఇంట్లో అంతా చాలా సంతోషంగా ఉంటారు. అమ్మానాన్న ఇంటికి రావడంతో శౌర్య పరుగున వచ్చి దీపను హత్తుకుంటుంది. “బేబీ ఎలా ఉంది అమ్మా?” అని ఎంతో ముద్దుగా అడుగుతుంది. అప్పుడు కార్తీక్.. “మీ చెల్లి నీకోసమే ఎదురుచూస్తోంది, మళ్లీ నీ దగ్గరికే వచ్చేసింది” అని చెప్పడంతో శౌర్య సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. మనందరి ఆశలు బలంగా ఉన్నాయి కాబట్టే భగవంతుడు మనల్ని కరుణించాడని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఇంట్లో అందరూ కలిసి స్వీట్స్ పంచుకుని హ్యాపీగా ఆ క్షణాలను ఆస్వాదిస్తారు. అమ్మమ్మ ఎలా ఉందని శౌర్య అడగ్గా.. అమ్మ క్షేమంగా ఉంది కాబట్టి, అమ్మమ్మ కూడా క్షేమంగా ఉంటుందని దశరథ, శ్రీధర్ చెబుతారు.

Karthika Deepam 2 March 24th Episode దీప నొప్పితో విలవిల.. పారు దొంగచాటు వీడియో కాల్

శౌర్య తన తల్లి దీపను ఆడుకుందామని లోపలికి లాక్కెళ్తుండగా, దీప నొప్పితో అరుస్తుంది. సుమిత్రకు ఆపరేషన్ చేసి బోన్ మ్యారో ఇచ్చిన కారణంగా దీప ఇంకా ఆ నొప్పుల నుంచి కోలుకోలేదు. దీప మెల్లిగా, నొప్పితో నడవడం చూసి ఇంట్లో వాళ్లకు అనుమానం మొదలవుతుంది. బిడ్డ క్షేమంగా ఉంటే దీపెందుకు ఇంత నీరసంగా ఉంది? ఎందుకలా నొప్పితో బాధపడిపోతోందని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. సరిగ్గా అదే సమయానికి పారిజాతం.. దీప పరిస్థితిని దొంగచాటుగా వీడియో కాల్ చేసి జ్యోత్స్నకు చూపిస్తుంది. దీప నడవడం చూసిన జ్యోత్స్న షాక్ అవుతుంది. “దీప ఎందుకు నాలాగా నడుస్తోంది? తనకెందుకు అంత నీరసం? మా మమ్మీకి డోనర్ ఎవరు? దీపే ఏమైనా బోన్ మ్యారో ఇచ్చిందా?” అని జ్యోత్స్న బుర్రలో వంద ప్రశ్నలు మెదులుతాయి. ఇంతకీ సుమిత్ర అసలు కూతురు నేనా లేక దీపనా అని జ్యోత్స్న తీవ్రంగా అనుమానపడుతుంది.

స్వప్నకు దాసు షాక్.. రేపే పెళ్లిచూపులు

మరోవైపు స్వప్న, కాశీ, కావేరిలు ఉన్న ఇంటికి దాసు సంతోషంగా స్వీట్స్ తీసుకుని వస్తాడు. సుమిత్ర వదిన క్షేమంగా బయటపడిందని, దీప కూడా తన బిడ్డని వదులుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని రెండు గుడ్‌న్యూస్‌లు చెబుతాడు. దాంతో వాళ్లంతా సంతోషిస్తారు. అయితే వెంటనే మూడో గుడ్ న్యూస్ ఉందంటూ ఒక బాంబ్ పేలుస్తాడు దాసు. స్వప్నకి మళ్లీ పెళ్లి చేయబోతున్నామని, సంబంధం కూడా చూసేశామని చెప్పడంతో స్వప్న, కాశీ ఇద్దరూ షాక్ అవుతారు. “ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి కష్టాల గురించి తెలియదు. ఎంతకాలం మనం ఇలా కలల్లో బతుకుతాం? కాశీతో విడాకుల కోసం కోర్టుకు అప్లై చేశారు కదా.. ఆలోపు మంచి సంబంధం చూసుకుంటే స్వప్నకి వెంటనే పెళ్లి చేయొచ్చని శ్రీధర్ బావ అన్నాడు” అని దాసు చెబుతాడు. శ్రీధర్ బావ నాతో చెప్పిందే నేను మీతో చెబుతున్నాను, దీనిలో ఏ మార్పు లేదు. రేపే పెళ్లి కొడుకు స్వప్నని చూడటానికి వస్తున్నాడని, ఇది పెళ్లిచూపులు అని దాసు ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఆ మాటలతో స్వప్న తీవ్రంగా బాధపడుతుంది. తాను ప్రేమించిన కాశీ ఎదురుగానే వేరే పెళ్లిచూపులు అంటుంటే కన్నీరుమున్నీరు అవుతుంది.

శివన్నారాయణకు దొరికిపోయిన పారిజాతం.. కార్తీక్ కవర్ డ్రైవ్

కాంచన ఇంట్లో దొంగచాటుగా వీడియో కాల్ తీసి జ్యోత్స్నకి చూపిస్తున్న పారిజాతాన్ని చూసి కార్తీక్ నిలదీస్తాడు. “ఏంటి పారు, దొంగచాటుగా వీడియోలు తీస్తున్నావా?” అని అడుగుతాడు. ఇంతలో వెనుక నుంచి శివన్నారాయణ వస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడగ్గా.. కాంచనను ఎలా ఓదార్చాలో అర్ధంకాక ఇక్కడే ఆగిపోయానని అబద్ధం చెబుతుంది పారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉందని తెలిసి సంతోషంతో ఇక్కడే ఉండిపోయానని చెప్పడంతో శివన్నారాయణ నిజమే అనుకుని సంతోషిస్తాడు. కార్తీక్ వాళ్లు నిర్ణయం వెనక్కి తీసుకుని మంచి పని చేశారని శివన్నారాయణ మెచ్చుకుంటాడు. కానీ పారు మాత్రం వదలదు. “ఇక్కడ తల్లీబిడ్డా ఎంత క్షేమంగా ఉన్నా.. ఏదో రహస్యం దాగుంది” అని అంటుంది. దీపని కావాలనే పట్టి లాగబోతుండగా ఆమె నొప్పితో విలవిలలాడిపోతుంది. చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నట్లుంది, మీకు అనుమానం రావడం లేదా? ఏ ఆపరేషన్ జరగకుండా దీప ఎందుకు నీరసంగా ఉందని కాంచనను, మిగతా వాళ్లను రెచ్చగొడుతుంది పారు. ఒకవేళ సైలెంట్‌గా బిడ్డను తీయించేసుకుని, సుమిత్ర కోసం అబద్ధాలు చెబుతున్నారేమో అని పెద్ద ఫిట్టింగ్ పెడుతుంది. దీప నీరసంగా ఎందుకు ఉందో మాకు తెలియాలని అందరూ గట్టిగా నిలదీయడంతో.. కార్తీక్ ఒక అబద్ధం చెబుతాడు. “మేం ఆసుపత్రిలో నిర్ణయం మార్చుకోకముందు.. దీప కాలుజారి కిందపడింది. అదృష్టం బాగుండి వెనక్కి పడింది. అప్పుడే మేం రియలైజ్ అయ్యాం, బిడ్డే మనల్ని కోరుకుంటోంది అని. అందుకే అబార్షన్ నిర్ణయం వెనక్కి తీసుకున్నాం. కాలు జారి కింద పడటం వల్లే దీప అంత నీరసంగా, నొప్పితో ఉంది” అని కార్తీక్ కవర్ చేస్తాడు. కానీ కార్తీక్ మాటలు వింటుంటే ఏదో నిజం దాస్తున్నట్లుగా ఉందని శివన్నారాయణకి, పారుకి గట్టిగా అనుమానం వస్తుంది.

నిజం తెలుసుకునేందుకు జ్యోత్స్న స్కెచ్.. చేతికి రానున్న రిపోర్ట్స్

ఇక పారు దొంగచాటుగా చూపించిన వీడియోతో జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అవుతుంది. దీపే సుమిత్ర కూతురై.. తనే బోన్‌మారో ఇస్తే, వాళ్లకు అనుమానం రాకుండా నన్ను పిచ్చోళ్లని చేశారా అని రగిలిపోతుంది. వెంటనే ఒక వ్యక్తికి ఫోన్ చేసి డీఎన్ఏ, హాస్పిటల్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? అని అడుగుతుంది. ఆ రిపోర్ట్స్ ఆఫ్ లైన్ లో ఎవరికీ తెలియకుండా తీసుకురావాలని ఆర్డర్ వేస్తుంది. రిపోర్ట్స్ వచ్చే వరకు నేనే సుమిత్ర కూతురిని అని నటిస్తాను, ఆ తర్వాతే అసలు నిజం తేలుస్తాను అని శపథం చేస్తుంది. పారుకి ఫోన్ చేసి, నువ్వు దీప మీద సరిగ్గా కాపలా కాయలేదని నిలదీస్తుంది.

జ్యోత్స్న ప్లాన్లతో దీప టెన్షన్.. ధైర్యం చెప్పిన కార్తీక్

మనవాళ్లంతా బిడ్డ దక్కిందని సంతోషంగానే ఉన్నారు.. కానీ జ్యోత్స్న గురించి తలచుకుంటేనే తనకు భయంగా ఉందని దీప తన బాధను కార్తీక్‌తో పంచుకుంటుంది. “జ్యోత్స్నకి ఆల్రెడీ అనుమానం వచ్చే ఉంటుంది కార్తీక్ బాబు.. నిజం తెలుసుకోవడానికి ఏదో ఒకటి చేస్తుంది” అని అంటుంది. దానికి కార్తీక్ స్పందిస్తూ.. “నువ్వు దేనికీ భయపడకు. ఇప్పుడు తను సుమిత్ర కూతురు అనుకుంటుంది. జ్యోత్స్న ఏం చేస్తుందనేది నువ్వు మరిచిపో. మన బిడ్డను ఈ భూమి మీదకు రాకుండా ఎవరూ ఆపలేరు” అని ధైర్యం చెబుతాడు. కార్తీక్ మాటలతో దీప కాస్త కుదుటపడుతుంది.

రేపటి ఎపిసోడ్ లో జ్యోత్స్న చేతికి రిపోర్ట్స్ వస్తాయా? స్వప్న పెళ్లిచూపులు ఆగిపోతాయా? సుమిత్ర కూతురు దీపనే అని తెలిస్తే శివన్నారాయణ రియాక్షన్ ఏంటి? అనే విషయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp