Karthika Deepam 2 March 25th 2026 Episode : జ్యోత్స్న కిడ్నాప్ కుట్ర బయటపెట్టిన కార్తీక్.. సుమిత్రకు ప్రాణాపాయం

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: March 25, 2026, 8:30 am

Karthika Deepam 2 March 25th 2026 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజురోజుకూ ఊహించని మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఒకవైపు సుమిత్ర ఆరోగ్యం క్షీణించడం, మరోవైపు జ్యోత్స్న కుట్రలు పెరిగిపోవడంతో కథనం ఆసక్తికరంగా మారింది. తాజాగా ప్రసారమైన మార్చి 25వ తేదీ (627వ ఎపిసోడ్) లో ఎన్నో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. దీప భయాలు, సుమిత్ర ఆవేదన, జ్యోత్స్నకు కార్తీక్ ఇచ్చిన వార్నింగ్.. ఈ ఎపిసోడ్‌ను హైలైట్‌గా నిలిపాయి. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

Karthika Deepam 2 March 25th 2026 Episode : జ్యోత్స్న కిడ్నాప్ కుట్ర బయటపెట్టిన కార్తీక్.. సుమిత్రకు ప్రాణాపాయం

Karthika Deepam 2 March 25th 2026 Episode : జ్యోత్స్న కిడ్నాప్ కుట్ర బయటపెట్టిన కార్తీక్.. సుమిత్రకు ప్రాణాపాయం

Karthika Deepam 2 March 25th 2026 Episode దీపకు పీడకల.. జ్యోత్స్నపై భయం

ఎపిసోడ్ ప్రారంభంలోనే దీప నిద్రలో తీవ్రంగా భయపడి ఉలిక్కిపడి లేస్తుంది. అమ్మా అంటూ అరుస్తూ లేచిన దీపను చూసి కార్తీక్ కంగారు పడతాడు. ఏమైందని అడగగా.. “బావ, జ్యోత్స్న మా అమ్మను, నాన్నను చంపేసినట్లు నాకు చాలా భయంకరమైన కల వచ్చింది. నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడే మా ఇంటికి వెళ్దాం పదా” అంటూ దీప కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. అప్పుడు కార్తీక్ దీపను సముదాయించే ప్రయత్నం చేస్తాడు.

“దీపా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మీ నాన్న నిజం చెప్పేసినట్లు నాకు కూడా కల వచ్చింది.. అలాగని అది నిజమైపోతుందా? జ్యోత్స్న సుమిత్ర అసలైన వారసురాలు కాదన్న విషయం తెలిస్తేనే కదా ఆమె ఏమైనా చేస్తుంది? ఇప్పుడు జ్యోత్స్న నమ్మకం లేని జీవితాన్ని బతుకుతోంది. ఆమె ఎటువంటి తప్పూ చేయదు. జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదనే నిజం మనకు, డాక్టర్ హారికకు మాత్రమే తెలుసు. మనం చెప్పనంత వరకు జ్యోత్స్నకు నిజం తెలిసే అవకాశమే లేదు. భయపడకుండా పడుకో, ఉదయాన్నే అందరం కలిసి తాతగారి ఇంటికి వెళ్దాం” అని కార్తీక్ దీపకు ధైర్యం చెబుతాడు.

Karthika Deepam 2 March 25th 2026 Episode సుమిత్ర వింత ప్రవర్తన.. దశరథ ఆందోళన

మరోవైపు, చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన సుమిత్ర మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దశరథ ఎంతో ప్రేమగా సుమిత్రకు అన్నం తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు సుమిత్ర కంటతడి పెడుతూ వింతగా మాట్లాడుతుంది. “నాకు ఒక్కోసారి ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. నేను కోమాలో ఉండి కలలు కంటున్నానా? జ్యోత్స్నకు మంచి సంబంధం కుదిరినట్లు, మన గార్డెన్‌లోనే పెద్ద పందిరి వేసి ఘనంగా పెళ్లి చేసినట్లు నాకు పదే పదే కలలు వస్తున్నాయి. జ్యోత్స్నను అత్తారింటికి పంపించేటప్పుడు నేను గుండె పగిలేలా ఏడుస్తున్నట్లు అనిపిస్తోంది. మనం మన అమ్మాయిని ఎక్కడికీ పంపొద్దు. ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకుందాం” అని సుమిత్ర అంటుంది. సుమిత్ర మాటలకు, ఆమె ప్రవర్తనకు దశరథ తీవ్రంగా భయపడతాడు. ఆమె ప్రవర్తనలో తేడా గమనించి వెంటనే డాక్టర్‌ను ఇంటికి రమ్మని పిలుస్తాడు.

జ్యోత్స్న డ్రామా.. సుమిత్ర ఎమోషనల్

ఇంతలో జ్యోత్స్న అక్కడికి వస్తుంది. “లోపలికి రావొచ్చా?” అని అడగడంతో సుమిత్ర షాక్ అవుతుంది. “నీ దగ్గరకు వస్తుంటే డాడీ నా మీద చిరాకు పడుతున్నాడు. అందుకే బయటే నిలబడిపోయాను. డాడీ.. నేను స్కూల్ నుంచి రాగానే నా చేయి పట్టుకుని కబుర్లు చెప్పేవాడివి, ఇప్పుడు నాపై ఎందుకు అంత కోపం?” అని జ్యోత్స్న సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తుంది. అప్పుడు సుమిత్ర కలుగజేసుకుని.. “మీ నాన్న ప్రేమ ఎప్పుడూ మనసులోనే ఉంటుంది. మా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. ముందు నువ్వు నా మాట విని పెళ్లి చేసుకో” అని బతిమాలుతుంది. కానీ జ్యోత్స్న మాత్రం, “ముందు నువ్వు కోలుకో.. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు” అని తేల్చి చెబుతుంది. దీంతో సుమిత్ర తన కూతురి పెళ్లి తాను చూడలేనేమో అని మనసులో కుమిలిపోతుంది.

కార్తీక్, దీప రాక.. డాక్టర్ హారిక షాకింగ్ నిజాలు

శివన్నారాయణకు పారిజాతం కాఫీ ఇస్తూ తన పాత కుట్రలకు పదును పెడుతుంటుంది. ఇంతలో కాంచన, కార్తీక్, దీపలు అక్కడికి వస్తారు. సుమిత్ర ఆరోగ్యం గురించి దీప అడగగానే.. జ్యోత్స్న తన అక్కసును వెళ్లగక్కుతుంది. “నువ్వు కిందపడ్డావని విన్నాము, అంతలోనే మా ఇంటికి ఎందుకు వచ్చావు?” అంటూ దీపను టార్గెట్ చేస్తుంది.

ఇంతలో డాక్టర్ హారిక రావడంతో అందరూ సుమిత్ర గదికి వెళ్తారు. “డాక్టర్ గారు మీరే నన్ను కాపాడారు” అని సుమిత్ర అనగా, “మీరు నాకు ఈ మాట హాస్పిటల్‌లోనే చెప్పారు కదా” అని హారిక అంటుంది. దానికి సుమిత్ర.. “నాకు హాస్పిటల్ విషయాలు ఏమీ గుర్తులేవు. నాకు నా కూతురు జ్యోత్స్న విషయాలు మాత్రమే గుర్తున్నాయి. నా కూతురే నాకు ప్రాణం పోసింది” అని సుమిత్ర వింతగా ప్రవర్తిస్తుంది.

దీంతో డాక్టర్ హారిక కుటుంబ సభ్యులను పక్కకు పిలిచి అసలు విషయం చెబుతుంది. “సుమిత్ర గారి మెంటల్ కండిషన్ ఏమాత్రం బాగోలేదు. ఆమె చచ్చిపోతానేమో అనే భయం నుండి బయటకు రాలేకపోతున్నారు. తన కూతురు జ్యోత్స్న పెళ్లి చూడకుండానే చనిపోతానేమో అన్న భయం ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. ఇది ఒకరకమైన మెంటల్ షాక్. దయచేసి ఆమె మనసుకు కష్టం కలిగించే, ఆమె తట్టుకోలేని ఎలాంటి నిజాలు ఆమెకు చెప్పొద్దు. జ్యోత్స్న విషయంలో ఆమెను సంతోషపెట్టే పనులు మాత్రమే చేయండి” అని డాక్టర్ గట్టిగా హెచ్చరిస్తుంది.

జ్యోత్స్న బండారం బయటపెట్టిన కార్తీక్.. ఫైనల్ వార్నింగ్!

డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత, జ్యోత్స్న మళ్లీ నాటకాలు మొదలుపెడుతుంది. “మా మమ్మీకి నేనే అంతా చూసుకుంటాను, దీప కోసం వెళ్లిపోయావు కదా బావ” అంటూ కార్తీక్‌ను దెప్పిపొడుస్తుంది. దీనికి కార్తీక్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చి, జ్యోత్స్నను పక్కకు తీసుకువెళ్తాడు.

అక్కడ జ్యోత్స్నకు కార్తీక్ అసలు సినిమా చూపిస్తాడు. “నా మీద నీకు ఇంకా అనుమానం ఏంటి జ్యోత్స్న? పారుని మా ఇంటికి వీడియోలు తీయడానికి ఎందుకు పంపించావు? హాస్పిటల్‌లో దీప రూమ్ ముందు పారుని కాపలాగా ఎందుకు ఉంచావు? దీప ఆపరేషన్ సమయంలోనే శౌర్య మిస్ అయినట్లు ఎందుకు ఫోన్ వచ్చింది? ఇదంతా నీ కుట్రే.. శౌర్యను కిడ్నాప్ చేయించింది నువ్వేనని నాకు పక్కాగా తెలుసు” అని కార్తీక్ బాంబ్ పేలుస్తాడు. ఆ మాటలకు జ్యోత్స్నకు చెమటలు పడతాయి.

“ఆ రౌడీలలో ఎవరో ఒకరు నాకు దొరికి ఉంటే నీ కథ వేరేలా ఉండేది. నీకు ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను నేరుగా అడుగు. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. ఎవరి స్థానం ఎప్పటికీ పర్మినెంట్ కాదు. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కిందకు పడతాము. అవతలి వాడికి ఒక రోజు వస్తే మన కాళ్ల కింద భూమి కదులుతుంది జాగ్రత్త” అని కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అయినా సరే జ్యోత్స్న ఏమాత్రం మారకుండా.. “బావ నువ్వు ఎన్ని చెప్పినా నా అనుమానాలు నాకున్నాయి. దీప కథ వేరేలా ఉంటుంది” అని తనలో తాను అనుకుంటుంది. ఈ ఆసక్తికరమైన సన్నివేశంతో మార్చి 25వ తేదీ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ముందు ముందు జ్యోత్స్న ఆటలకు కార్తీక్ ఎలా చెక్ పెడతాడు? సుమిత్రకు నిజం ఎప్పుడు తెలుస్తుంది? అనేది రాబోయే ఎపిసోడ్స్‌లో చూడాలి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp