Karthika Deepam 2 Today Episode August 14th : మాలినిని ఓడించిన జ్యోత్స్న.. సూరజ్ పెళ్లికి నో!
Karthika Deepam 2 Today Episode August 14th , మాలినిని ఓడించి రెస్టారెంట్‌ను దక్కించుకున్న జ్యోత్స్నకు సూరజ్ నుంచి ‘గుడ్ వర్క్’ మెసేజ్ వస్తుంది. చివర్లో జ్యోత్స్న పెళ్లిపై షాకింగ్ ట్విస్ట్ వచ్చింది.
Karthika Deepam 2 Today Episode August 14th : కార్తీక దీపం 2 ఆగస్టు 14 ఎపిసోడ్ 749: జ్యోత్స్న జీవితంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఒకవైపు మాలినితో జరిగిన పోటీలో జ్యోత్స్న విజయం సాధించగా.. మరోవైపు తన మనసులో సూరజ్‌కు చోటు ఉందనే విషయం క్రమంగా బయటపడుతోంది. అయితే సూరజ్ మాత్రం జ్యోత్స్న తనను నిజంగా ఇష్టపడుతోందని నమ్మే పరిస్థితిలో లేడు. ఇదే సమయంలో సూరజ్ దగ్గరికి వచ్చిన ఓ కొత్త అమ్మాయి జ్యోత్స్నలో అసూయను రేపుతుంది. చివర్లో మాలిని చెప్పిన మాటలతో పెళ్లి వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారుతుంది.ఇక గత ఎపిసోడ్‌లో జరిగిన విషయాలను గమనిస్తే.. జ్యోత్స్నకు క్యాబ్ బుక్ కాకపోవడంతో సూరజ్ ఆమెను బైక్‌పై ఇంటి దగ్గర దించుతాడు. ఈ సందర్భంగా ఒకప్పుడు తన బావ కార్తీక్ అంటే తనకు చాలా ఇష్టమని, కానీ ఇప్పుడు తన మనసులో ఆయన లేరని జ్యోత్స్న స్పష్టం చేస్తుంది. కార్తీక్‌పై తనకున్నది ప్రేమ కాదని, అది కేవలం పంతమని అర్థం చేసుకున్నానని చెబుతుంది. అందుకే తన బావ ఇచ్చిన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేశానని వెల్లడిస్తుంది.ఉదయాన్నే సుమిత్ర, దశరథలు సూరజ్‌ను పిలిపించి మాట్లాడతారు. జ్యోత్స్నను ఇక బాధపెట్టొద్దని అతడికి చెబుతారు. జ్యోత్స్న బాధపడటానికి కారణం సూరజ్‌నే అని సుమిత్ర అంటుంది. కార్తీక్‌కు సంబంధించిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేసినప్పటికీ.. ఆ నిర్ణయం తర్వాత జ్యోత్స్న పడుతున్న బాధను తాము చూడలేకపోతున్నామని చెబుతుంది.అయితే సూరజ్ మాత్రం తన మనసులోని మాటను స్పష్టంగా చెబుతాడు. కార్తీక్‌కు పెళ్లయిపోయినా కూడా జ్యోత్స్న మనసులో తన బావపై ప్రేమ ఉందని తెలిసినప్పటికీ ఆమెను మార్చలేకపోయారని అంటాడు. కానీ తాను మాత్రం ఆ పని చేస్తున్నానని చెబుతాడు. జ్యోత్స్న మనసులో తనకు స్థానం ఉందని తనకు పూర్తిగా అర్థమైన రోజున తానే ఆమె మెడలో తాళి కడతానని మాట ఇస్తాడు.ప్రస్తుతం జ్యోత్స్న తన వల్ల బాధపడుతున్నా.. ఆమె మనసులో అసలు తనపై ఏముందో పూర్తిగా అర్థమైన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటానని సూరజ్ చెబుతాడు.
Karthika Deepam 2 Today Episode August 14th : మాలినిని ఓడించిన జ్యోత్స్న.. సూరజ్ పెళ్లికి నో!
Karthika Deepam 2 Today Episode August 14th జ్యోత్స్నకు దక్కిన రెస్టారెంట్.. మాలినికి భారీ షాక్
ఇదిలా ఉండగా గౌరీ ప్రసాద్ అనే రెస్టారెంట్ యజమాని తన హోటల్‌ను అమ్మాలని నిర్ణయించుకోవడంతో దానిని దక్కించుకునేందుకు దక్షిణామూర్తి, శివన్నారాయణలు పోటీ పడతారు. అయితే రెస్టారెంట్‌ను విక్రయించడానికి గౌరీ ప్రసాద్ కొన్ని షరతులు పెడతాడు. ఆ షరతులను దీప అంగీకరిస్తుంది.మరోవైపు మాలిని కూడా రెస్టారెంట్ ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇస్తుంది. దీంతో కొత్త యజమానిని ఎంచుకునే బాధ్యతను గౌరీ ప్రసాద్ ఉద్యోగులకే అప్పగిస్తాడు.అక్కడి నుంచే అసలు పోటీ మొదలవుతుంది. మరి ఆగస్టు 14న ప్రసారమైన 749వ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఎవరి చేతికి రెస్టారెంట్ వెళ్లింది? సూరజ్ విషయంలో జ్యోత్స్న మనసులో ఏముంది? తెలుసుకుందాం.రెస్టారెంట్ ఉద్యోగులను ఉద్దేశించి జ్యోత్స్న తన ప్లాన్‌ను వివరిస్తుంది. ‘‘మాలినిగారు ఏం చెప్పారో మీరు విన్నారు కదా.. ఇప్పుడు మేం చెప్పేది కూడా వినండి’’ అంటూ మాట్లాడుతుంది.తాము ఉద్యోగంలో నుంచి ఎవరినీ తొలగించబోమని, ప్రస్తుతం ఏ పోస్టుల్లో పనిచేస్తున్నారో అదే స్థానాల్లో కొనసాగవచ్చని చెబుతుంది. అంతేకాదు తాము రెస్టారెంట్‌ను టేకోవర్ చేసిన మొదటి రోజే ఉద్యోగుల జీతాలను 10 శాతం పెంచుతామని హామీ ఇస్తుంది.అంతటితో ఆగకుండా భవిష్యత్తులో ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇస్తామని, అవసరమైతే రూ.10 లక్షల వరకు లోన్ సదుపాయం కల్పిస్తామని చెబుతుంది.
ప్రస్తుతం రెస్టారెంట్ నష్టాల్లో ఉందని.. అది లాభాల్లోకి వచ్చిన వెంటనే ఈ ప్రయోజనాలన్నీ ఉద్యోగులకు వర్తిస్తాయని స్పష్టం చేస్తుంది.ఉద్యోగుల ఆరోగ్యం, వారి పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాల్లోనూ తమ వంతు సహాయం చేస్తామని జ్యోత్స్న హామీ ఇస్తుంది.ఆ సమయంలో సూరజ్ కూడా ఉద్యోగులను ఆలోచింపజేసేలా మాట్లాడతాడు. ‘‘ఒకరోజు బిర్యానీ తిని మిగతా రోజులు పస్తులు ఉండాలా? లేక ప్రతిరోజూ కడుపు నిండా భోజనం చేయాలా? మీరే నిర్ణయించుకోండి’’ అంటూ గౌరీ ప్రసాద్ రెస్టారెంట్ ఉద్యోగులకు చెబుతాడు.జ్యోత్స్న ఉద్యోగులతో బాగా మాట్లాడిందని దీప.. కార్తీక్‌తో చెబుతుంది. తమ గురించి ఆలోచించినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెబుతూ, తన తండ్రిలాగే జ్యోత్స్న కూడా బాధ్యతగా వ్యవహరిస్తోందని ప్రశంసిస్తుంది.అయితే చివరికి ఉద్యోగులు మాలిని ఊహించని విధంగా జ్యోత్స్నకు మద్దతు ఇస్తారు. రెస్టారెంట్‌ను మాలినికి కాకుండా జ్యోత్స్నకే ఇవ్వాలని గౌరీ ప్రసాద్‌కు చెబుతారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.ముఖ్యంగా డీఎం రెస్టారెంట్స్‌కు కాకుండా జ్యోత్స్న రెస్టారెంట్‌కు మద్దతు ఇస్తున్నామని ఉద్యోగులు చెప్పడంతో మాలిని ఉలిక్కిపడుతుంది. జ్యోత్స్నకు కార్తీక్, దీపలు అభినందనలు చెబుతారు. మంచి సంస్థలో భాగం కావడం తమకు ఆనందంగా ఉందని ఉద్యోగులు అంటారు.తన రెస్టారెంట్‌ను ఇక జ్యోత్స్న రెస్టారెంట్‌కే అప్పగిస్తున్నానని గౌరీ ప్రసాద్ తేల్చి చెబుతాడు. ఎవరు వచ్చినా, ఎంత ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పినా తాను ఇచ్చిన మాటను మార్చుకోనని స్పష్టం చేస్తాడు.
Karthika Deepam 2 Today Episode August 14th మాలినిని ఓడించిన జ్యోత్స్న.. సూరజ్ నుంచి ‘గుడ్ వర్క్’
తనకు ప్రత్యర్థిగా నిలిచిన మాలినిని జ్యోత్స్న మరోసారి మాటలతోనే కౌంటర్ ఇస్తుంది. ‘‘మనమేంటో కొందరికి మరోసారి అర్థమైంది’’ అంటూ మాలినిని ఉద్దేశించి మాట్లాడుతుంది.మరోవైపు శివన్నారాయణకు తన మనవరాలు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ‘‘మనమే గెలిచాం’’ అని ఆనందంగా చెబుతాడు. తాత పేరును మరోసారి నిలబెట్టావని జ్యోత్స్నను మెచ్చుకుంటాడు.కార్తీక్, దీపలు కూడా రెస్టారెంట్ వ్యవహారంలో క్రెడిట్ మొత్తం జ్యోత్స్నకే దక్కుతుందని సంతోషిస్తారు. అయితే జ్యోత్స్న మాత్రం తాను ఒక్కదాన్నే గెలిపించలేదని, తనకు అండగా నిలిచిన అందరి సహకారం వల్లే విజయం సాధించానని చెబుతుంది.ఇది దక్షిణామూర్తికి మాత్రం నచ్చదు. జ్యోత్స్న రెస్టారెంట్‌ను ఎలా దక్కించుకుందో ఎవరికీ తెలుసని నానా మాటలు అంటాడు. దానికి శివన్నారాయణ కూడా దక్షిణామూర్తిని రెచ్చగొట్టేలా.. ‘‘అది నీ కోడలినే అడుగు’’ అంటూ సెటైర్లు వేస్తాడు.ఇంతలో మాలిని అక్కడికి వస్తుంది. తన మేనకోడలు తనకంటే ఎక్కువ ఆఫర్ ఇచ్చిందని చెబుతూ.. పోటీపడటంలో జ్యోత్స్న తన పోలికలే అంటూ ప్రశంసిస్తుంది.అప్పుడు జ్యోత్స్న వారిద్దరినీ తాత, అత్త అని పిలుద్దామని సరదాగా చెబుతుంది. అయితే మాలిని మాత్రం ‘‘గెలిచామని ఇప్పుడే సంతోషపడొద్దు.. ముందు రెస్టారెంట్‌ను విజయవంతంగా నడపాలి కదా’’ అంటూ జాగ్రత్త చెబుతుంది. దానికి కార్తీక్ స్పందిస్తూ రెస్టారెంట్‌ను లాభాల్లోకి ఎలా తీసుకురావాలో తమకు తెలుసని చెబుతాడు. ఇక దీప కూడా మాలినికి గట్టి సమాధానం ఇస్తుంది. ‘‘మీరు ఇకనైనా మారండి. మనకు నష్టం వచ్చినా ఫర్వాలేదు.. ఎదుటివాళ్లకు మాత్రం లాభం రాకూడదని అనుకోవడం మంచిది కాదు. అలా చేస్తే మీరు ఎప్పటికీ గెలవలేరు. మా జ్యోత్స్న మంచి మనసుతో గెలిచింది’’ అని చెబుతుంది. అయితే శివన్నారాయణ మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోడు. వీళ్లకు మంచి మాటలు రుచించవని, కోడలు ఏదో సాధిస్తుందని దశరథ అనుకుంటున్నాడని.. ఇప్పుడు అతడు తల ఎక్కడ పెట్టుకుంటాడో చూద్దామని సెటైర్ వేస్తాడు.
Karthika Deepam 2 Today Episode August 14th తనకు కూడా ఓ రోజు టైం వస్తుందని దక్షిణామూర్తి కోపంగా చెబుతాడు.
ఆ తర్వాత మాలిని జ్యోత్స్నను ప్రశంసిస్తూ.. నువ్వు మంచి బిజినెస్ ఉమెన్ అవుతావని చెబుతుంది. మాలిని నిన్ను పొగిడిందంటే లోపల నువ్వేదో మ్యాజిక్ చేసి ఉంటావని శివన్నారాయణ మరోసారి వ్యంగ్యంగా అంటాడు. ఇదే సమయంలో కార్తీక్ జ్యోత్స్నకు కంగ్రాట్స్ చెబుతూ, ఈ విజయం అంతా సూరజ్‌ను ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నదేనా అని సరదాగా అడుగుతాడు. అంతలోనే సూరజ్ నుంచి జ్యోత్స్నకు ‘గుడ్ వర్క్’ అంటూ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూడగానే జ్యోత్స్న ముఖంలో ఆనందం కనిపిస్తుంది.
ఆఫీసులో కొత్త అమ్మాయి.. జ్యోత్స్నలో మొదలైన అసూయ
మరోవైపు ఆఫీసులో జ్యోత్స్న, సూరజ్ తమ పనుల్లో ఉండగా ఓ కొత్త అమ్మాయి అక్కడికి వస్తుంది. తాను కొత్తగా జాయిన్ అయ్యానని, సూరజ్ దగ్గర పని నేర్చుకోవాలని తనకు చెప్పారని ఆమె చెబుతుంది.అప్పుడు సూరజ్.. ‘‘నీ దగ్గరికే నేనే వస్తాను’’ అంటూ ఆమెతో చెబుతాడు. దీంతో ఆ అమ్మాయి చాలా సంతోషిస్తుంది. అంతేకాదు జ్యోత్స్నకు అసూయ కలిగేలా సూరజ్ ఆ అమ్మాయితో చాలా క్లోజ్‌గా మాట్లాడుతాడు. వారిద్దరూ షేక్ హ్యాండ్ చేసుకోవడంతో జ్యోత్స్న మరింత రగిలిపోతుంది. ఫ్రీ అయిన తర్వాత కలుద్దామని, ఫోన్ నెంబర్ ఇవ్వాలని ఆ అమ్మాయి సూరజ్‌ను అడుగుతుంది. దీంతో జ్యోత్స్న ఆ అమ్మాయితో వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతుంది. సూరజ్ తనకు ఎంత ముఖ్యమో ఆమె ప్రవర్తనలోనే మరోసారి బయటపడుతుంది.
జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడా? కుటుంబంలో చర్చ
ఇక మరోవైపు కార్తీక్.. సుమిత్ర, దశరథలకు ఓ మాట ఇస్తాడు. జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి జరిగేలా చూసే బాధ్యత తమదేనని చెబుతాడు. అయితే పారిజాతం మాత్రం అనుమానం వ్యక్తం చేస్తుంది. జ్యోత్స్న మనసులో తనకు చోటు కావాలని సూరజ్ కోరుకుంటున్నాడని.. అది నిజంగా జరిగే పనేనా అని ప్రశ్నిస్తుంది. దానికి దీప మాత్రం జ్యోత్స్న మనసులో సూరజ్ ఉన్నాడని స్పష్టంగా చెబుతుంది. అయితే సూరజ్ మాత్రం ఎవరెంత చెప్పినా వెంటనే నమ్మే వ్యక్తి కాదని పారిజాతం అంటుంది. సూరజ్‌కు తనపై నమ్మకం ఏర్పడాలంటే అతడే నిజంగా అర్థం చేసుకోవాలని చెబుతుంది. మరోవైపు జ్యోత్స్న మాత్రం పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుందని పారిజాతం ఫైర్ అవుతుంది. అయినా కార్తీక్ మాత్రం జ్యోత్స్న, సూరజ్ ఇద్దరిపై తనకు నమ్మకం ఉందని చెబుతాడు. వాళ్ల ప్రేమపైనా తనకు పూర్తి విశ్వాసం ఉందని అంటాడు. అప్పుడు దీప జ్యోత్స్న మనసులో జరిగిన మార్పును వివరంగా చెబుతుంది. ఒకప్పుడు తన బావ కార్తీక్‌పై జ్యోత్స్న ఎన్నో ఆశలు పెట్టుకుందని చెబుతుంది. అయితే జ్యోత్స్న దృష్టిలో పెళ్లి అంటే ఒక ఆడదాని మెడలో మగాడు తాళి కట్టడమే అనే భావన ఏర్పడిందని వివరిస్తుంది.
కార్తీక్ తన మెడలో తాళి కట్టినప్పటి నుంచి ఆమెలో ప్రేమ కంటే పంతం పెరిగిందని అంటుంది. కానీ ఇప్పుడు జ్యోత్స్న ఆ స్థితిలో లేదని చెబుతుంది. ఇష్టం, ప్రేమ రెండింటి మధ్య తేడాను ఆమె అర్థం చేసుకుందని వివరిస్తుంది. తెలియకుండానే జ్యోత్స్న సూరజ్‌పై ఇష్టాన్ని పెంచుకుందని.. సూరజ్ తనను వద్దని చెప్పినప్పుడు ఆమె దాన్ని తట్టుకోలేకపోయిందని చెబుతుంది. ఆ ఇష్టం తన నుంచి దూరం కాకుండా ఉండేందుకు జ్యోత్స్న పోరాడుతోందని దీప వివరిస్తుంది.అయితే శివన్నారాయణ మాత్రం దీప చెబుతున్న మాటలకు, జ్యోత్స్న ప్రవర్తనకు ఎలాంటి సంబంధం కనిపించడం లేదని అంటాడు. ఆమె ప్రస్తుతం వైరాగ్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోందని చెబుతాడు.దానికి దీప స్పందిస్తూ.. జ్యోత్స్న తన మనసులోని మాటను ఈ విధంగానే తెలియజేయాలని ప్రయత్నిస్తోందని అంటుంది. సూరజ్ ఈ నిజాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని కార్తీక్ చెబుతాడు. అందుకోసం తాము కొన్ని ఏర్పాట్లు కూడా చేశామని అంటాడు.
జ్యోత్స్న పెళ్లి గురించి మాలిని కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే పారిజాతాన్ని మాలిని పిలిపించి మాట్లాడుతుంది. తన మేనకోడలు జ్యోత్స్నకు పెళ్లి చేయాలని ఉందని చెబుతుంది. అయితే జ్యోత్స్న కోసం ఇప్పటికే అబ్బాయిని చూసేశామని పారిజాతం చెబుతుంది. దీంతో మాలిని వ్యంగ్యంగా స్పందిస్తుంది. శివన్నారాయణ ఇంటికి కాబోయే అల్లుడు అంటే అతడికి ఇప్పటికే రెండు మూడు పెళ్లిళ్లు అయి ఉంటాయని సెటైర్ వేస్తుంది. పారిజాతం కూడా ఆ అబ్బాయి మంచోడే కాకపోతే మొండోడని అంటుంది. అయితే చివర్లో అసలు ట్విస్ట్ బయటపెడుతుంది పారిజాతం. జ్యోత్స్న పెళ్లి సూరజ్‌తోనే ఖాయమైందని చెబుతుంది. కానీ వెంటనే మాలినికి షాకిచ్చే విషయాన్ని చెబుతుంది. ఈ పెళ్లి మాత్రం జరగదని అంటుంది. ఎందుకంటే జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడానికి సూరజ్ ఇప్పటికే నిరాకరించాడని వెల్లడిస్తుంది. ఈ షాకింగ్ విషయంతో ఆగస్టు 14న ప్రసారమైన కార్తీక దీపం 2 ఎపిసోడ్ 749 ముగుస్తుంది. ఇక సూరజ్ మనసులో నిజంగా ఏముంది? జ్యోత్స్న తన ప్రేమను ఎప్పుడు అంగీకరిస్తుంది? సూరజ్‌ను తన వైపు తిప్పుకునేందుకు జ్యోత్స్న ఏం చేయబోతోంది? మాలిని ఈ పెళ్లిని ఆపేందుకు మరో ఎత్తుగడ వేస్తుందా? అనే ప్రశ్నలు తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి.







