4 February Karthika Deepam Today Episode : కార్తీకదీపం 2 ఫిబ్రవరి 4 ఎపిసోడ్: బిడ్డ కావాలా? అమ్మ కావాలా? కార్తీక్, దీపల నరకం.. స్వప్న షాకింగ్ డెసిషన్..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :4 February 2026,8:00 am

4 February Karthika Deepam Today Episode : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈరోజు (ఫిబ్రవరి 4, 2026) బుధవారం ప్రసారమయ్యే 585వ ఎపిసోడ్ ఎమోషనల్ టర్న్‌లతో సాగింది. ఓ వైపు సుమిత్ర ప్రాణాలను కాపాడాలా? లేక తమ కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలా? అనే ధర్మసంకటంలో కార్తీక్, దీపలు నరకం చూస్తుంటే… మరోవైపు స్వప్న తన భర్త కాశీని అసహ్యించుకుంటూ ఇంటి నుంచి గెంటేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

4 February Karthika Deepam Today Episode : కార్తీకదీపం 2 ఫిబ్రవరి 4 ఎపిసోడ్: బిడ్డ కావాలా? అమ్మ కావాలా? కార్తీక్, దీపల నరకం.. స్వప్న షాకింగ్ డెసిషన్..!

4 February Karthika Deepam Today Episode : కార్తీకదీపం 2 ఫిబ్రవరి 4 ఎపిసోడ్: బిడ్డ కావాలా? అమ్మ కావాలా? కార్తీక్, దీపల నరకం.. స్వప్న షాకింగ్ డెసిషన్..!

4 February Karthika Deepam Today Episode : కన్నీరుమున్నీరైన కార్తీక్, దీప.. దశరథ ఓదార్పు

సుమిత్ర బతకాలంటే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగాలని, అది మ్యాచ్ అయ్యేది దీపకు మాత్రమేనని డాక్టర్ హారిక చెప్పిన విషయం తెలిసిందే. అయితే, గర్భవతిగా ఉన్న దీప ఈ ఆపరేషన్ చేయించుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్‌లో ఉండిపోతారు. హాస్పిటల్ బయట వీరిద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా, అటుగా వచ్చిన దశరథ వారిని చూసి ఆపుతాడు.

మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారు? అని దశరథ అడగ్గా, సంతోషం వల్ల కన్నీళ్లు వస్తున్నాయని కార్తీక్ అబద్ధం చెబుతాడు. అసలు విషయం తెలియని దశరథ.. “దీప, నువ్వు దిగులు పడకు.. నీకే కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడని మర్చిపోకు” అని ధైర్యం చెబుతాడు. తన కన్నతండ్రే తనను ఓదారుస్తున్నాడని తెలియక, నిజం చెప్పలేక దీప మరింత ఎమోషనల్ అవుతుంది. “కలలన్నీ కన్నీరులా మారాయి బావ” అంటూ కార్తీక్ గుండెలపై వాలి దీప ఏడ్చే దృశ్యం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.

4 February Karthika Deepam Today Episode : స్వప్న ఆగ్రహం.. కాశీకి అవమానం

ఇక మరోవైపు కాశీ, కాంచనలు శ్రీధర్ ఇంటికి వెళ్తారు. స్వప్నను ఎలాగైనా మార్చాలని కాంచన ప్రయత్నిస్తుంది. కానీ భర్తను చూడగానే స్వప్న రగిలిపోతుంది. “వంకాయ కూర ఇష్టం లేని వాళ్లకు బలవంతంగా వడ్డిస్తే తినలేరు.. అలాగే నాకు ఇష్టం లేని ఈ మనిషితో నేను కలిసి బతకలేను” అని స్వప్న తేల్చి చెబుతుంది.

కాంచన, శ్రీధర్, కావేరి ఎంత నచ్చజెప్పినా స్వప్న వినదు. “నన్ను క్షమించు స్వప్న, నీ కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటా” అని కాశీ బతిమాలినా స్వప్న కరగదు. “అందరి ముందు తలదించుకునేలా చేశావు.. పోరా బయటకు.. నాకు విడాకులు కావాలి” అని గట్టిగా అరుస్తుంది. దీంతో అవమానభారంతో కాశీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

జ్యోత్స్నకు పారిజాతం వార్నింగ్

హాస్పిటల్‌లో బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సి రావడంతో జ్యోత్స్న భయపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చాక పారిజాతం (గ్రాండ్ మదర్) జ్యోత్స్నను నిలదీస్తుంది. “నీకు ముందే తెలుసు కదా హాస్పిటల్‌కు వెళ్తున్నామని, నాకు ఎందుకు చెప్పలేదు?” అని జ్యోత్స్న ఫైర్ అవుతుంది. దీనికి పారిజాతం స్పందిస్తూ.. “దాసు ఎక్కడున్నాడో చెప్పు? నీ బండారం బయటపడకూడదనే కదా దాస్తున్నావ్” అని అడుగుతుంది.

దీంతో జ్యోత్స్న తన డ్రామా మొదలుపెడుతుంది. “తల్లి లేని పిల్లనని కూడా చూడకుండా నన్ను ఇలా అనుమానిస్తారా గ్రానీ?” అంటూ మొసలి కన్నీళ్లు కారుస్తుంది. కానీ పారిజాతం మాత్రం.. “ఇవి నిజం కన్నీళ్లా? గ్లిజరిన్ కన్నీళ్లా? దాసు నా కంటికి కనిపించే వరకు నిన్ను నమ్మను” అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.

రేపటి ట్విస్ట్ ఏంటి?

సుమిత్ర కోసం దీప తన బిడ్డను త్యాగం చేయడానికి సిద్ధపడుతుందా? జ్యోత్స్న తండ్రి దాసు ఆచూకీ బయటపడుతుందా? స్వప్న నిర్ణయం మారుతుందా? అనే ఆసక్తికరమైన అంశాలతో రేపటి ఎపిసోడ్ సాగనుంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి