Home » News » Rashmi Gautam Gave Clarity On Differences With Sudigali Sudheer
News

Rashmi Gautam Sudheer : సుధీర్‌తో గొడ‌వ‌ల విష‌యంలో కార‌ణం చెప్పిన ర‌ష్మీ గౌత‌మ్

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: May 4, 2025 6:48 pm
Advertisement

Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంట‌ల‌లో సుధీర్-ర‌ష్మీ గౌత‌మ్ జంట ఒక‌టి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే ఆడియన్స్ లో వచ్చే జోష్ వేరే లెవెల్ లో ఉంటుంది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల మాత్రం రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ మధ్య గొడవలు జరుగుతున్నాయని , అందుకే క‌లిసి క‌నిపించ‌డం లేద‌నే ప్ర‌చారం జ‌రిగింది.

Advertisement

Rashmi Gautam Sudheer : సుధీర్‌తో గొడ‌వ‌ల విష‌యంలో కార‌ణం చెప్పిన ర‌ష్మీ గౌత‌మ్

Rashmi Gautam Sudheer ఇది క్లారిటీ..

దానిపై రష్మీ గౌతమ్ తాజాగా స్పందించింది. మా ఇద్దరి మధ్య గొడవలు ఎలాంటివి లేవని చెప్పారు. కానీ ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రమే కలుస్తామని, ప్రొఫెషనల్ గానే ఉంటామని చెప్పుకొచ్చింది. అంతే తప్ప సుధీర్ తో తనకి ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చింది. మేమంతా ఒకే దగ్గర కలిసి పని చేయాలి కాబట్టి ఎలాంటి కోపతాపాలకు అవకాశం ఇవ్వబోమని చెప్పారు.

Advertisement

ఇద్దరు కలిసి బుల్లితెరపై నటించే అవకాశం ఉందా? అని అడగ్గా.. అది తన చేతిలో లేదని, అలాంటి నిర్ణయాలు సుధీర్ కు వ్యక్తిగతమైనవని, వాటిపై తాను ఏమీ మాట్లాడలేనని చెప్పింది. జబర్దస్త్ మెనేజ్ మెంట్ అనుమతిస్తే వస్తారని, లేదంటే చెప్పలేమని తెలిసింది. అది తన పరిధిలో లేదని చెప్పింది. ఇక రష్మీ గౌతమ్ చివరిగా యాక్టర్ నందుతో కలిసి ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సుడిగాలి సుదీర్ కమెడియన్గా మంచి స్థాయికి చేరుకున్న తర్వాత యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమలో పడ్డారంటూ కొన్నాళ్లు ప్రచారం జరిగింది.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి