Rashmi Gautam : బుల్లితెర అందాల బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు మాట్లాడడం అంత రాకపోయిన కూడా క్యూట్ క్యూట్ మాటలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. జబర్ధస్త్ షోతోనే రష్మీకి మంచి గుర్తింపు దక్కింది. కొన్నాళ్లుగా రష్మీ ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకి హోస్ట్‌గా ఉండేది. అయితే ఇప్పుడు ఎక్స్‌ట్రా జబర్ధస్త్ తీసేసిన జబర్ధస్త్ షోని రన్ చేస్తున్నారు. ఈ షోకి రష్మీనే హోస్ట్‌గా ఉంటుంది. గురు, శుక్రకి బదులు, శుక్రవారం, శనివారం టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక ఈ షోకి కృష్ణ భగవాన్, ఖుష్బూ జడ్జిలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు రెండు షోలకు రష్మినే యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అంతేకాదు తన ఫన్ యాంగిల్‌ని కూడా పెంచారు.
తాజాగా ప్రోమో విడుదల కాగా, అందులో నూకరాజు చీపురు పట్టుకుని వచ్చి రష్మిని పలకరించారు. ఏంటీ రష్మి ఎలా ఉన్నావ్ అని అడిగాడు. దీంతో నేను బాగానే ఉన్నాలే గానీ, ఏంటి కామెడీ ఉంటుందా? అని అడిగింది. దానికి ఏంటో అంటూ వినపడనట్టుగా రియాక్ట్ అయ్యాడు నూకరాజు. రెండు సార్లు అడిగినా అలానే రియాక్ట్ అయ్యాడు. దీంతో నూకరాజుకి బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్మి. ఆయనకు సరిగ్గా వినపడనట్టుగా యాక్ట్ చేస్తున్న నేపథ్యంలో సరే రా ముద్దుపెడతా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దెబ్బకి మనోడు ఆనందంతో రెచ్చిపోయాడు. ఆ వస్తున్నా అంటే ఆలస్యం లేకుండా పరిగెత్తుకుంటూ ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది రష్మి. చెప్పుతీసుకొని కొడతా అంటూ బెదిరించింది. దెబ్బకి ఎంత ఫాస్ట్ గా వెళ్లాడో, అంతే వేగంగా బ్యాక్ అయ్యాడు నూకరాజు.
ఇది అందరికి నవ్వులు పూయించింది. ఇక ‘జబర్దస్త్’లో టీములను రెండుగా విడగొట్టారు. ఆ రెండు వర్గాల మధ్య బెట్ పెడుతున్నారు. ‘మా పది వేలు పోయినందుకు మేం ఫీల్ కావడం లేదు. ఈ రోజుతో బెట్ ఆపేద్దాం’ అని బుల్లెట్ భాస్కర్ అన్నాడు. ‘ఏం భయపడ్డవా?’ అని ఆటో రామ్ ప్రసాద్ అడిగాడు. ‘9, 9 మార్కులు తెచ్చుకున్న నేను ఐదు వేలు పోగొట్టుకోవడం ఏమిటి? 5, 5మార్కులు తెచ్చుకున్న ఆయన (రాకెట్ రాఘవను ఉద్దేశిస్తూ) ఐదు వేలు గెలుచుకోవడం ఏమిటి?’ అన్నాడు. బుల్లెట్ భాస్కర్ చెప్పిన తర్వాత ”ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పట్నించీ ఒక లెక్క. ఇంతకు ముందు గెలవడం కాదు, ఇప్పుడు గెలిచి చూపించండి’ అని కెవ్వు కార్తీక్. ఆ వెంటనే ‘నువ్వు ఎంతైనా పోటీ పడు. విజయం మాదే” అని నారా చంద్రబాబు నాయుడు తరహాలో ‘వి’ సింబల్ చూపించాడు ఆటో రామ్ ప్రసాద్. ఆ తర్వాత ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని పవన్ చెప్పిన డైలాగ్ వినిపించడంతో ఒక్కసారిగా కేకలు వినిపించాయి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.