Sudheer : సుధీర్ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న ఆర్ఆర్ఆర్ సింగర్ తండ్రి.. ఏం జరిగిందంటే..!
Sudheer : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కామెడీ షో తో మంచి పేరు తెచ్చుకున్న సుధీర్ హీరోగా కూడా రాణిస్తున్నాడు.అయితే ఆయన ఇటీవల తిరిగి బుల్లితెరకి రీఎంట్రీ ఇచ్చా సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం బుల్లితెర పై సుధీర్ యాంకర్ గా హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షో మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అ్యయింది. అయితే ఆ ప్రోమోలో ఆర్ఆర్ఆర్ సినిమా సింగర్ తండ్రి ఎమోషనల్ అవతూ కంటతడి పెట్టారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, షోలో కమెడియన్ రియాజ్, భానుశ్రీ, యాంకర్ స్రవంతి తెగ సందడి చేశారు.
ముఖ్యంగా స్రవంతి, భానుశ్రీ ఇద్దరూ సుధీర్ ఫోటో పట్టుకుని రియాజ్ వద్దకు వెళుతారు. ఇక అక్కడ బావకి ఏమంటే ఇష్టం అని అడుగుతారు. దీనికి రియాజ్ పులిహోర అంటే ఇష్టం అని చెప్పి నవ్వులు పూయిస్తాడు. ఇలా రియాజ్ సుడిగాలి సుధీర్, స్రవంతి, భానుశ్రీ మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా వారి చేసిన పెర్ఫామ్ స్కిట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే షోలో కొందరు బాల గాయకులు కూడా సందడి చేశారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎంతో తీయగా కొమ్మా ఉయ్యాలా అనే సాంగ్ పాడిన చిన్నారి ప్రకృతి కూడా హాజరైంది. ఇక ఆ షోకు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.
Sudheer : సుధీర్ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న ఆర్ఆర్ఆర్ సింగర్ తండ్రి.. ఏం జరిగిందంటే..!
షోలో సింగర్ ప్రకృతి తండ్రి చాలా ఎమోషనల్‌గా ఉంటారు. ప్రకృతి తండ్రి ఓ సాధారణ రైతు. అయినప్పటికి తన కుమార్తెని సింగర్ ని చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో పాట పాడేలా చేశాడంటే ఆయన కృషి ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో సుధీర్ ఆయనను అభినందించారు. ఇక సుధీర్ మాటలకు ప్రకృతి తండ్రి ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. కానీ, మా ప్రకృతి ఇంత గుర్తింపు తెచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
This website uses cookies.