Viral video : చేతి వేళ్ల మీద 18 గుడ్ల‌ను బ్యాలెన్స్ చేస్తున్న వ్య‌క్తి.. అమేజింగ్ ట్యాలెంట్‌.. వీడియో

Authored By mallesh | The Telugu News | Updated on : 30 November 2021, 9:43 am

Viral video :  ఈ సృష్టిలో ఒక్కొక్క‌రు ఒక్కో ట్యాలెంట్ తో పుడుతుంటారు. ఎవ‌రినీ త‌క్కువ అంచ‌నా వేయొద్దు. ఏమో ఎవ‌రిలో ఏ ట్యాలెంట్ ఉంటుందో మ‌న‌కేం తెలుసు క‌దా. అందుకే అంటారు పెద్ద‌లు. పిట్ట చిన్న‌దే అయినా కూత ఘ‌నం అని. ఇప్ప‌టికే ఇలాంటి ట్యాలెంట్ ప‌ర్స‌న్ల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట విప‌రీగ‌తంగా వైర‌ల్ అవుతుంటాయి. సోష‌ల్ మీడియా అంటేనే వైల‌ర్ వీడియోల‌కు పెట్టిన అడ్డా. అలాంటిది ట్యాలెంట్‌కు సంబంధించిన‌వి వైర‌ల్ కాకుండా ఉంటాయా చెప్పండి. ఇప్ప‌టికే మ‌నం ఇలాంటి వీడియోల‌ను అనేకం చూస్తూనే ఉన్నాం.

అయితే ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాంటి ట్యాలెంట్ తోనే మ‌న ముందుకు వ‌చ్చేశాడు. అత‌ని ట్యాలెంట్ ను చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. నిజానికి మ‌నం అలాంటి ప‌ని అస్సలు చేయ‌లేం. అది చూసేందుకు చాలా సింపుల్ గానే అనిపించినా కూడా చేసేందుకు మాత్రం చాలా క‌ష్టం. సాధార‌ణంగా మ‌న చేతిలో ఓ కోడి గుడ్డును ప‌ట్టుకోవాలంటేనే చాలా క‌ష్టం. ఎక్క‌డ కిం ప‌డిపోతుందో అని భ‌యం వేస్తుంది క‌దా. అయితే ఇప్పుడు మాత్రం ఓ వ్య‌క్తి కేవ‌లం ముని వేళ్ల‌మీద ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 18 గుడ్ల‌ను పెట్టుకుంటున్నాడు.

a man balancing 18 eggs on his fingers

a man balancing 18 eggs on his fingers

Viral video : ఒక్క‌టి కూడా కింద ప‌డ‌కుండా బ్యాలెన్సింగ్‌..

ఇరాక్ దేశంలో నివ‌సించే ఇబ్రహీం అనే వ్య‌క్తి ఇలాంటి ట్యాలెంట్ తోనే పుట్టాడు. అత‌ను ఇప్పుడు కోడిగుడ్లతో త‌న ట్యాలెంట్ ను నిరూపించుకున్నాడు. చేతి మునివేళ్ల మీద 18 గుడ్లను పెట్టుకుని వాటిలో ఒక్క‌టి కూడా కింద ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డేలా బ్యాలెన్స్ చేస్తున్నాడు. అత‌ని ప్ర‌తిభ చూసిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు ఏకంగా అత‌నికి అందులో ప్లేస్ క‌ల్పించేశారు. ఇంకేముంది అత‌ను ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫేమ‌స్ అయిపోయాడు. అత‌నికి సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp