Viral Video : అంటీ డ్యాన్స్.. ఊర‌మాస్.. డీజే సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులు

Authored By mallesh | The Telugu News | Published on: April 15, 2022, 1:00 pm

Viral Video : కొంత‌మందికి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం.. కానీ స్టెప్పులు వేయ‌డానికి సంద‌ర్భం దొర‌క్కా… లేదా ఎవ‌రు ఏం అనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అవ‌న్నీ ప‌ట్టించుకుంట‌లేరు.. డీజే ఉందా ఎగిరిన‌మా.. ఎంజాయ్ చేసినమా.. అన్న‌ట్లు ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇంట్లో ఏ చిన్న‌ ఫంక్ష‌న్ అయినా డీజే పాట‌లు పెట్టి ఇంటిల్లిపాది.. చుట్టాలు డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్నారు. ఆడ‌వాళ్లు.. చిన్న‌పిల్ల‌లు తెగ స్టెప్పులేసి అల‌రిస్తారు.

ఒక‌ప్పుడు డ్యాన్స్ అంటే సినిమాల్లో కాకుండా డ్యాన్స్ షోల‌లో మాత్ర‌మే చూసేవాళ్లం. ఇప్పుడు అలా కాదు.. ఎప్పుడైతే సోష‌ల్ మీడియా ఎంట‌ర్ అయిందో అప్ప‌టి నుంచి అడిందే ఆట.. పాడిందే పాట‌… ఎవ్వ‌రూ త‌గ్గ‌టం లేదు. ఎవ్వ‌రి పెర్ఫామెన్స్ వాళ్లు చూపిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ల‌కి ఏ టాలెంట్ వున్నా, ఒక‌ప్పుడు ఆ టాలెంట్ ను ఏలా ప్రూవ్ చేసుకోవాలో తెలిసేది కాదు. ఇంటికే ప‌రిమితం అయిపోయేవారు. ఇప్పుడు అలా కాదు.

aunty Dance to DJ Songs in Video Viral 

aunty Dance to DJ Songs in Video Viral

చాలా మంది అమ్మాయిలు వాళ్ల కి వున్న టాలెంట్ ని వీడియో గా తీసి ఇన్ స్టా, యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి తెగ వైర‌ల్ అవుతున్నాయి…ప్రస్తుతం ఓ ఆంటీ చేసిన డ్యాన్స్ వీడియో కూడా తెగ వైర‌ల్ అవుతోంది. కుర్రాళ్ల‌ని మించేలా తీన్మార్ డాన్స్ చేస్తూ పూనకంతో ఊగిపోయింది. మాస్ స్టెప్పులతో రెచ్చిపోయి డాన్స్ చేసింది. దీనితో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp