Viral Video : బిచ్చగాడి వద్ద కోట్ల రూపాయలు.. రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆ డబ్బులను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 December 2021,10:10 am

Viral Video : బిచ్చగాడి దగ్గర కోట్ల రూపాయలు ఉండటం ఏంటి.. మీ పిచ్చి కాకపోతే అంటారా? అవును.. అతడి వద్ద కోట్ల రూపాయల డబ్బు ఉంది. అయినప్పటికీ అతడు ధనవంతుడు మాత్రం కాదు. కేవలం ఒక బిచ్చగాడు. అంతే.. అతడి దగ్గర అంత డబ్బు ఎక్కడిది అనేది పక్కన పెడితే.. తన దగ్గర ఉన్న డబ్బునంతా ఓ సంచిలో వేసుకొని వెళ్లి ఏం చేశాడో తెలిస్తే మాత్రం మీరు నోరెళ్లబెడతారు.ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉజ్జయినిలో ఉన్న ఓ రైల్వే స్టేషన్ కు వెళ్లిన ఆ బిచ్చగాడు..

తన సంచిలో ఉన్న డబ్బునంతా తీసి రైల్వే స్టేషన్ లో వెదజల్లాడు. గాల్లోకి డబ్బునంతా విసిరేశాడు. బిచ్చగాడు చేస్తున్న ఆ పనిని చూసి రైల్వే స్టేషన్ లో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.తన దగ్గర ఉన్న డబ్బునంతా వెదజల్లిన తర్వాత ఆ బిచ్చగాడు.. అదే సంచిలో ఉన్న కొన్ని డాక్యుమెంట్లను కూడా పైకి విసిరేశాడు. ఆ బిచ్చగాడు చేస్తున్న పనిని చూసి ప్రయాణికులు గుమికూడగా.. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు..

beggar throws money at railway station goes viral video madhya pradesh

beggar throws money at railway station goes viral video madhya pradesh

Viral Video : డబ్బును ఎందుకు అలా వెదజల్లాడో తెలుసా?

ఆ బిచ్చగాడు వెదజల్లిన డబ్బు, డాక్యుమెంట్లను సంచిలో పెట్టి అక్కడి నుంచి పంపించారు.అయితే.. అసలు ఆ వ్యక్తి ఎవరు? నిజంగా బిచ్చగాడేనా? ఎందుకు డబ్బు వెదజల్లాడు అని పోలీసు కూపీ లాగగా.. అతడు ఒక రైతు అని తెలిసింది. తనది బుర్హాన్ పూర్ అని పోలీసులు తెలుసుకొని.. తన సొంతూరుకు వెళ్లే రైలు ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి