Viral Video : పెళ్లి బరాత్ అంటే మామూలుగా ఉండదు.. పెళ్లి కూతురు డ్యాన్స్ చూస్తే ఫిదా కావాల్సిందే

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 June 2022,2:00 pm

Viral Video : పెళ్లి అంటే పందిళ్లు.. చప్పట్లు.. తాళాలు.. తలంబ్రాలు అంటూ అనుకుంటాం కదా. కానీ.. అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు మాత్రం పెళ్లంటే డీజేలు.. సంగీత్ లు.. హల్దీ సెరమనీ.. ఇంకా చెప్పాలంటే బరాత్ లో డ్యాన్స్ లు.. అది కూడా పెళ్లి కూతురు.. పెళ్లి కొడుకు చేసే డ్యాన్స్. అవును.. ట్రెండ్ మారింది బాస్. ఒకప్పుడు పెళ్లిళ్లలో పెళ్లికి వచ్చిన బంధువులు డ్యాన్స్ వేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు పెళ్లి చేసుకునే కొత్త జంటే డ్యాన్స్ వేస్తూ అందరినీ అదరగొడుతున్నారు.

ఇటీవల బుల్లెట్ బండి సాంగ్ కు ఓ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ ఎంత పాపులర్ అయిందో తెలుసు కదా. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి అయ్యేంత వరకు ఒక రచ్చ.. పెళ్లి తర్వాత మరో రచ్చ. పెళ్లి తర్వాత అప్పగింతలు అయిపోయాక చూసుకుంటే.. డీజేలు పెట్టి డ్యాన్సులు చేయడమే. తాజాగా ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది.

Bride Dance on Her Wedding video viral

Bride Dance on Her Wedding video viral

Viral Video : డీజే టిల్లు అంటూ రచ్చ చేసిన పెళ్లి కూతురు

పెళ్లి అప్పగింతలు పూర్తయ్యాక.. పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ చేసి అతిథులు షాక్ అయ్యారు. పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయలేకపోయినా.. పెళ్లి కూతురు మాత్రం డీజే టిల్లు అంటూ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ఈ వీడియోను చూసి ఫిదా అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=NR9KQWx3XUE

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి