Viral Video : ఈ పెళ్లికూతురు డాన్స్ చుస్తే ఫిదా అయిపోవాల్సిందే.. వీడియో మీకోసం.!

Authored By mallesh | The Telugu News | Published on: August 29, 2022, 2:00 pm

Viral Video : మంచి బీట్ సాంగ్ వినిపిస్తే చాలు కొందరికి కాలు నిలవదు. వద్దన్న డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. వారి ప్రమేయం లేకుండానే కాళ్లు ,చేతులు ఆటాడేస్తుంటాయి.అలా ఎందుకు వీరి బాడీ స్పందిస్తుందంటే వీరి నరనరాల్లో డ్యాన్స్ నిండి ఉండాలి.లేదా సంగీతం వినగానే మైండ్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. డ్యాన్స్ చేయాలని మెదడు ఇండికేషన్ ఇస్తుందట.. అందుకే చాలా మంది మాస్ బీట్స్ వింటే చెవికోసుకుంటుంటారు.

Viral Video : అమ్మాయి స్పీడు..అబ్బాయి స్లో

ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లిళ్లలో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. అందులో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఏమాత్రం జంకకుండా తమకు తోచిన రీతిలో స్టెప్పులు ఇరగదీస్తున్నారు. కానీ కొందరు అబ్బాయిలకు డ్యాన్స్ అంటే భయం అయి ఉండవచ్చు. లేదా నలుగురి ముందు డ్యాన్స్ చేయాలని ఉన్నా సిగ్గు వలన కావచ్చు. లేదా డ్యాన్స్ సరిగా చేయకపోతే ఎవరైనా వెక్కిరిస్తారనే కారణంతో అయినా అస్సలు ముందుకు రారు. ఇలాంటి వారిని తోటి ఫ్రెండ్స్ లేదా బంధువులు డ్యాన్స్ చేయాలని ముందుకు నెడుతుంటారు. లేదా డ్యాన్స్ చేసేలా వారి చుట్టూ చేరి బలవంతం చేస్తారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా పెళ్లిళ్లలో చూడవచ్చును.

bride dance video viral on Social media

bride dance video viral on Social media

ఎందుకంటే చాలా మంది ఇటీవల కాలంలో పెళ్లికి ముందు, ఆ తర్వాత డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇందులో పెళ్లికూతురు, పెళ్లికొడుకు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లికూతురు సంతోషంగా డ్యాన్స్ వేస్తుంటే..అబ్బాయి మాత్రం డ్యాన్స్ వేయడానికి ఇబ్బంది పడుతూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ టైంలోనే పక్కన ఆడవాళ్లు అతన్ని డ్యాన్స్ చేయాలని ఫోర్స్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. దీంతో అతను అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. కానీ అమ్మాయి మాత్రం అవేమి పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తుండటం ఇక్కడ విశేషం.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp