Viral Video : పెళ్లి కూతురు అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. ట్రెండింగ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తున్న వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెళ్లి కూతురు అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. ట్రెండింగ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తున్న వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :13 June 2022,8:00 pm

Viral Video : డ్యాన్స్ అంటే ఒక‌ప్పుడు అబ్బాయిలు ఎక్కువ‌గా చేసేవారు.. అమ్మాయిలు సిగ్గుప‌డేవారు.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా పుణ్యామా అని ట్రెండ్ మార్చారు. అబ్బాయిలు సిగ్గుప‌డుతూ డ్యాన్స్ చేయ‌డానికి వెన‌క‌డుగు వేస్తున్నా అమ్మాయిలు మాత్రం ఎలాంటి జంకు లేకుండా ఎక్క‌డైనా ఎప్పుడైనా డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో నిత్యం కొన్ని వేల వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. దాదాపు అందులో తొంబై శాతం అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే ఉంటాయి. అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్ తో క్యూట్ లుక్స్ తో ఆక‌ట్టుకుంటున్నారు.

అందం అభిన‌యంతో డ్యాన్స్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచేసుకుంటున్నారు.ఇక పెళ్లిలో వ‌ధువు డ్యాన్స్ చేసే వీడియోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లిలో మండ‌పంలోనే డ్యాన్స్ చేసే క‌ల్చ‌ర్ పెరుగుతోంది. మండ‌పానికి వ‌స్తూనే డ్యాన్స్ చేస్తూ పెళ్లి కూతురు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రిసెప్ష‌న్స్ లో స్టేజీపైనే డ్యాన్స్ చేస్తూ అద‌ర‌గొడుతున్నారు. పెళ్లికొడుకు సిగ్గుప‌డి వెన‌క్కి త‌గ్గినా అమ్మాయిలు త‌గ్గేదేలా.. అన్న‌ట్లు డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు.

bride dancing to trending song video viral

bride dancing to trending song video viral

ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి.ప్ర‌స్తుతం ఓ పెళ్లికూతురు పెళ్లికొడుకుతో క‌లిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్రెండింగ్ లో ఉంది. పెళ్లికొడుకు ఎదురుగా నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తపా.. అంటూ ట్రెండింగ్ సాంగ్ కి హావ‌భావాలు వ‌రుడిని ఇంప్రెస్ చేస్తోంది. పెళ్లి కొడుకు సిగ్గుతో అలాగే నిల్చుండిపోగా పెళ్లి కూతురు మాత్రం అస్స‌లు త‌గ్గ‌లేదు. పెళ్లికొడుకు సిగ్గుతో ప‌క్క‌కు వెళ్లిపోగా చిన్న‌పిల్ల‌ల‌తో క‌లిసి అందంగా స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంది.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది