Viral Video : నన్ను కాదని ఇంకొకడిని చేసుకుంటావా? అని పెళ్లిమండపం ఎక్కి.. పెళ్లికూతురు లవర్ ఏం చేశాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 December 2021,7:15 am

Viral Video : ఇటువంటి సీన్లను మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ.. నిజంగానూ ఇటువంటి ఘటనలు జరుగుతాయి అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఈ పెళ్లి ఆపండి.. అంటూ పెళ్లి కూతురు లవర్ పెళ్లి మండపానికి వచ్చి రచ్చ చేయడం చాలా సినిమాల్లో చూశాం. అయితే.. అదంతా సినిమా కదా. నిజంగా అటువంటి ఘటనలు ఎక్కడ జరుగుతాయిలే అని మనం లైట్ తీసుకుంటాం.కానీ.. మీకో విషయం తెలుసా? ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అటువంటిదే. అచ్చం సినిమాలో జరిగినట్టుగా పెళ్లిమండపంలో జరగడంతో అందరూ షాక్ అయ్యారు.

ఓవైపు పెళ్లి జరుగుతుండగా.. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు మెడలో పూల దండ వేసే సమయంలో ఎక్కడికి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. పెళ్లికూతురు లవర్ అక్కడికి వచ్చాడు.తన లవర్ కు పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న పెళ్లికూతురు లవర్ వెంటనే అక్కడికి చేరుకొని పెళ్లి జరుగుతుండగానే పెళ్లి మండపం ఎక్కాడు. పెళ్లి మండపం ఎక్కి తన వెంట తెచ్చుకున్న కుంకుమను పెళ్లి కూతురు నుదిటిపైన పెట్టబోయాడు. పెళ్లిలో అంతమంది ఉండగా.. డేర్ గా వచ్చి పెళ్లికూతురు నుదిటిపై బొట్టు పెడుతుంటే పెళ్లికొడుకు మాత్రం అలాగే చూస్తూ ఉండిపోయాడు.

bride lover tries to put sindhoor on bride forehead video viral


bride lover tries to put sindhoor on bride forehead video viral

Viral Video : పెళ్లికొడుకు ముందే పెళ్లిమండపం ఎక్కి.. పెళ్లికూతురు నుదిటిపై..

పెళ్లికూతురు మాత్రం అతడిని నిలువరించింది. ఇంతలో అక్కడే ఉన్న పెళ్లికి వచ్చిన వాళ్లు.. వెంటనే పెళ్లికూతురు లవర్ ను పక్కకు నెట్టేశారు. దీంతో పెళ్లికొడుకు కూడా కింద పడ్డాడు. కాసేపు అక్కడ పెద్ద గొడవే జరిగింది. తర్వాత పెద్దలు.. పెళ్లికూతురు లవర్ కు సముదాయించి అక్కడి నుంచి పంపించాక.. తర్వాత అదే పెళ్లికొడుకుతో.. ఆ పెళ్లికూతురు పెళ్లి జరిగింది. ఈ ఘటన యూపీలోని గోరఖ్ పూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/rupin1992/status/1467110991729029121?s=20

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి