Viral Video : ఊర మాస్ స్టెప్పుల‌తో దుమ్ములేపుతున్న పెళ్లి కూత‌రు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఊర మాస్ స్టెప్పుల‌తో దుమ్ములేపుతున్న పెళ్లి కూత‌రు.. వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :5 June 2022,2:00 pm

Viral Video : అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే ఎంత ఇష్ట‌మో నెట్టింట్లో వైర‌ల్ అయ్యే వీడియోల‌ను చూస్తే తెలుస్తుంది. సంద‌ర్భం వ‌స్తే చాలు త‌మ టాలెంట్ చూపిస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొడుతున్నారు. ఇక పెళ్లిలో ఐతే ఆ సంద‌డే వేరు. సిగ్గుతో త‌ల‌దించుకునే అమ్మాయిలు ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేద్దామా అన్న‌ట్లు చూస్తున్నారు. మండ‌పంలోనే స్టెప్ప‌లు వేసి పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. ఫంక్ష‌న్స్ ల‌లో, పార్టీల్లో అమ్మాయిలు త‌మ టాలెంట్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు.

ప్ర‌స్తుతం నెట్టింట్లో పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఇది మ‌రింత పెరిగింది. ఈ వీడియోలు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుండ‌టంతో.. డ్యాన్స్ చేసేట‌ప్పుడు వీడియోలు తీస్తూ అందంగా ఫోజులిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇకపెళ్లి త‌ర్వాత జ‌రిగే బ‌రాత్ ల‌లో ఊర‌మాస్ స్టెప్పులు వేస్తూ దుమ్ము లేపుతున్నారు. ఎంత‌మంది ఉన్నా సిగ్గుప‌డ‌కుండా డ్యాన్స్ పై ఇష్టాన్ని తెలియ‌జేస్తున్నారు.

bride marriage mass dance video viral

bride marriage mass dance video viral

ప్ర‌స్తుతం ఓ కొత్త‌జంట డ్యాన్స్ ఇర‌గ‌దీస్తున్నారు. చూట్టూ బ్యాండ్ మేళం ద‌రువుల‌తో ఇక పెళ్లి కూతురు అయితే ఊర‌మాస్ స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ లో మునిగిపోయింది. చివ‌ర‌కు పెళ్లి కొడుకు వెళ్దామ‌ని పిల‌వ‌డ‌తో అక్క‌డినుంచి క‌దిలింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 28 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ తో, నెటిజ‌న్ల కామెంట్స్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది