Viral Video : మాస్ డాన్స్ తో రచ్చ రంబొల చేసిన పెళ్లి కూతురు.. చుస్తే చూపుతిప్పుకోలేరు.. వీడియో.. !

Authored By mallesh | The Telugu News | Published on: August 27, 2022, 2:40 pm

Viral Video : కొత్త పెళ్లైన జంట స్టేజి ముందు డ్యాన్స్ కుమ్మేసింది. అమ్మాయి అబ్బాయి పోటాపోటీగా డ్యాన్స్ చేస్తుండటంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు. బంజారా సాంగ్ సాసు అనే పాటకు నవ వధూవరులు వేస్తున్న స్టెప్పులు అందరినీ అలరించాయి. ఈ తతంతాన్ని బంధువుల్లో ఒకరు వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. నవ దంపతులకు నూతనోత్సాహం.. సాధారణంగా ఏదైనా వేడుకకు సరదాగా ఆటపాటల్లో మునిగితేలడం కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీగా ఉంటుంది.

శుభకార్యాలకు బంధువులు అంతా ఒకే చోట కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు ఉండవు. దీంతో వారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతుంటారు. ఇలాంటి రోజు మళ్లీ రాదని దానిని ఒక మొమోరెబుల్‌గా మార్చాలని అనుకుంటారు. దీంతో వారి ఎంజాయ్ హద్దులు దాటుతుంది. ఇలాంటి వేడుకలు దేశంంలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా వేడకలు, శుభకార్యాలను నిర్వహించుకుంటారు.ఇక పెళ్లిల్లో అయితే డ్యాన్సులు ఈరోజుల్లో కామన్ అయిపోయాయి. కొందరు పెళ్లికి ముందు సంగీత్ నిర్వహిస్తారు.

Bride mass dance video viral on Social media

Bride mass dance video viral on Social media

పెళ్లిల్లో ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు. పెళ్లి అనంతరం బారాత్ ఉండనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంగీత్, ఆర్కెస్ట్రా వంటివి ఎక్కువగా ఆంధ్రాలో కనిపిస్తుంటే.. తెలంగాణలో మాత్రం బారాత్ చాలా విశేషం. మాస్ డ్యాన్సులతో స్టెప్పులు ఇరగదీస్తుంటారు.ఈ మధ్యకాలంలో నూతన వధూవరులు కూడా బారాత్‌లో రెచ్చిపోతున్నారు. తాజా వీడియోలో అమ్మాయిఅబ్బాయి బంజారా సాంగ్‌కు దుమ్ములేపారు. అబ్బాయి మాస్ స్టెప్పులతో ఇరగదీస్తే అమ్మాయి మాత్రం కొంచెం నెమ్మదిగా క్లాసిక్ ఇచ్చేందుకు ట్రై చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp