Viral Video : బరాత్ లో డ్యాన్స్ తో దమ్ములేపుతున్న జంట.. పెళ్లి కూతురు ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా
Viral Video : నెట్టింట్లో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి. నిత్యం బోలెడన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో పెళ్లి కూతురు చేసే సందడే ఎక్కువ. ఫుల్ ఎనర్జిట్ గా డ్యాన్స్ చేస్తూ మాస్ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. డీజే సాంగ్స్ కి అదిరిపోయే ఊరమాస్ స్టెప్పులతో రచ్చ చేస్తున్నారు. ఇక పెళ్లిలో మండపంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. ఒకప్పుడు సిగ్గుతో తలదించుకునే అమ్మాయిలు సోషల్ మీడియా ప్రభావంతో డ్యాన్స్ ఇరగదీస్తున్నారు.
పెళ్లిలో ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తూ పెళ్లంటే డ్యాన్స్ గుర్తుకువచ్చేలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఎంగేజ్ మెంట్ మొదలు సంగీత్, పెళ్లి, రిసెప్షన్, బరాత్ ఇలా అన్ని కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ట్రెండింగ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్నారు. ఇక తెలంగాణలో ఎక్కువగా కనిపించే బరాత్ కల్చర్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఇక బరాత్ లలో వధూవరులు ఇద్దరూ కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం అలాంటి వీడియోనే నెట్టింట్లో వైరల్ అవుతోంది. బరాత్ లో పెళ్లి కూతురు, పెళ్లికొడుకు ఎనర్జీ చూస్తూ షాక్ అవ్వాల్సిందే. మస్ స్టెప్పులతో అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. ఫుల్ ఎనర్జిట్ గా పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు వీడియోలు తీస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు ఎక్స్ ప్రెషన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.