Viral Video : పెళ్లికూతురు డ్యాన్స్ చేసి అవాక్కైన పెళ్లికొడుకు.. ఎందుకంటే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెళ్లికూతురు డ్యాన్స్ చేసి అవాక్కైన పెళ్లికొడుకు.. ఎందుకంటే..

 Authored By mallesh | The Telugu News | Updated on :2 July 2022,2:00 pm

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో ఎంత‌లా ఆక‌ట్టుకుంటాయో అంద‌రికీ తెలిసిందే. నిత్యం వేల‌ల్లో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. పెళ్లికొడుకు పెళ్లి కూతురు మండపంలో, రిసెప్ష‌న్ స్టేజిపై అదిరిపోయే స్టెప్పులు వేస్తూ పెళ్లికే హైలైట్ గా నిలుస్తారు. ఇక పెళ్లంటే ఇంటిల్లిపాది.. బంధువులు, ఫ్రెండ్స్ అంతా ఒక్క చోట చేరి సంద‌డి చేస్తున్నారు. డ్యాన్స్ చేయ‌డానికి ముందుగానే ప్లాన్ చేసుకుని అందంగా ముస్తాబై ట్రెండింగ్ సాంగ్స్ కి కొత్త‌జంట ఆడిపాడుతున్నారు. ఎంగేజ్ మెంట్, సంగీత్, మ్యారేజ్, రిసెప్ష‌న్ ఇలా అన్ని వేడుక‌ల్లో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

వీడియోలు తీయించుకుంటూ జ్ఞాప‌కాలుగా దాచుకుంటున్నారు. ఇక ప్ర‌తి పెళ్లిలో వినిపించే ట్రెండింగ్ సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి.. ఈ సాంగ్ పై అమ్మాయిలు ఎంతో ఇష్టంతో త‌మ పార్ట్ న‌ర్ పై ఫీలింగ్స్ ని బ‌య‌ట‌పెడుతూ చెప్ప‌క‌నే చెప్తుంటారు. పెళ్లి కొడుకుని ఇంప్రెస్ చేస్తూ అత‌ని చేయి ప‌ట్టుకుని ఆడిపాడ‌తారు. అందుకే అమ్మాయిలు ఈ సాంగ్ ని ఎక్కువ లైక్ చేస్తుంటారు. అప్ప‌ట్లో జ‌గిత్యాల‌లో ఓ పెళ్లికూతురు ఈ సాంగ్ పై డ్యాన్స్ చేసి తెలుగు రాష్ట్రాల్లో వైర‌ల్ అయింది.

Bride wedding dance video

Bride wedding dance video

ఇక అప్ప‌టినుంచి మొద‌లైన ఈ ట్రెండ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం కూడా ఓ పెళ్లికూతురు త‌న రిసెప్ష‌న్ లో పెళ్లికొడుకుతో త‌న ఫీలింగ్స్ చెప్తూ ఆక‌ట్టుకుంది. పెళ్లికొడుకుతో నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేస్తా.. అంటూ త‌న గురించి చెప్పుకుంటూ ఇంప్రెస్ చేస్తోంది. పార్ట్ న‌ర్ తో క‌లిసి డ్యాన్స్ చేస్తే ఎంత బాగుంటుందో చూపించింది. ఇక నెటిజ‌న్లు కూడా ల‌వ్ లీ క‌పుల్స్.. సూప‌ర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి