Viral Video : చిన్న పిల్లాడికి బాడీగార్డ్ గా పిల్లి పిల్ల.. ఇంత క్యూట్ వీడియో ఎప్పుడూ చూసి ఉండరు మీరు

 Authored By jagadesh | The Telugu News | Updated on :4 October 2022,2:00 pm

Viral Video : చిన్నపిల్లలను పెంచడం అంత ఈజీ కాదు. వాళ్లు ఒక చోట కూర్చోరు. ఒక చోట నిలబడరు. అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటారు. వాళ్లను చూసుకోవడం అంటే చాలా కష్టం. ఒక్కరి వల్ల కాని పని. వాళ్లు ఎక్కడి నుంచి ఎటువైపు పరిగెత్తుతారో.. ఏం చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే చిన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అంటుంటారు పెద్దలు. తల్లిదండ్రులు 24 గంటలు పిల్లలను చూడలేరు. వాళ్ల కళ్లు గప్పి అటో ఇటో పరిగెత్తడం చేస్తుంటారు పిల్లలు. ఒక్కోసారి తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా..

వాళ్లకు తెలియకుండా కిందపడటమో, బయటికి వెళ్లడేమో, బాల్కనీలోకి వెళ్లడమో చేస్తుంటారు. కింద ఉండేవాళ్లకు ఎలాంటి సమస్య ఉండదు కానీ.. అపార్ట్ మెంట్స్ లో ఉండేవాళ్లు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్లకే ఈ తిప్పలు అంతా. అపార్ట్ మెంట్ లో అయితే చుట్టూ రెయిలింగ్ లేకపోతే పిల్లలకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే.. పెద్ద పెద్ద రెయిలింగ్స్ ను చుట్టూ ఏర్పాటు చేయిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. ఆ వీడియోలో ఓ చిన్నారికి బాడీగార్డ్ గా పిల్లి పిల్ల ఉండటం మనం చూడొచ్చు.

cat bodygaurd to the child video viral

cat bodygaurd to the child video viral

Viral Video : పిల్లాడిని కంటికి రెప్పలా చూసుకుంటున్న పిల్లి

అసలు బాడీగార్డ్ గా పిల్లి ఏంటి అని అనుకుంటున్నారా? అదే ఇక్కడ ట్విస్ట్. ఎందుకంటే.. ఆ పిల్లాడు బాల్కనీ దగ్గరికి వచ్చి బయటికి తొంగి చూసేందుకు ప్రయత్నిస్తుండగా అతడు ఎక్కడ కింద పడతాడో అని అతడి చేతులను తీసేసి కింద పడకుండా చూసుకుంటోంది ఆ పిల్లి. అసలు.. ఆ పిల్లాడి తల్లిదండ్రులు కూడా అంత కేర్ గా ఆ పిల్లాడిని చూసుకోరు కావచ్చు. అంత కేర్ గా ఆ పిల్లి చూసుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ పిల్లి ఎంత క్యూట్ గా అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://twitter.com/Gabriele_Corno/status/1576474359316860930

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి