Home » Exclusive » Cats Walking Exer Size In Video Viral
Exclusive

Viral Video : మేం కూడా జిమ్ కి పోతం.. జిమ్ లో వాక్ చేస్తున్న పిల్లులు నెటిజ‌న్ల ఫ‌న్నీ కామెంట్స్

Authored By
mallesh
The Telugu News | Published on: April 1, 2022, 8:00 pm
Advertisement

Viral video : సాధార‌ణంగా మ‌నం ఫిట్ ఉండ‌టానికి అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి జిమ్ కి వెళ్తుంటాం. జిమ్ లో తెగ క‌స‌ర‌త్తులు చేస్తుంటాం. గంటలకొద్దీ ఎక్సర్ సైజ్‌లు చేస్తూ అందంగా క‌నిపించ‌డానికి తెగ ఆరాట‌ప‌డ‌తాం. కొందరు సిక్స్ ఫ్యాక్స్ కోసం, మరికొందరు ఆరోగ్యం కోసం, ఇంకొందరు పొట్ట తగ్గించుకోవడానికి జిమ్ లో చెమటోడుస్తుంటారు. అయితే మనుషులకు తాము కూడా ఏమాత్రం తీసిపోమంటూ జంతువులు కూడా ఫిట్ గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాయి.

Advertisement

తాజాగా అలాంటి ఓ వీడియో సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో తెగ వైర‌ల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు షేర్ చేసినా ఎక్కువగా నెటిజన్లను ఆకర్షించేవి ఫన్నీ వీడియోలు. ఎక్కువగా పెంపుడు కుక్క, పిల్లి చేసే అల్లరిపనులను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ సంతోషన్ని నెటిజన్లతో పంచుకుంటారు. ఎందుకంటే కొన్ని పిల్లులు, కుక్కలు తమ యజమానులు ఏ పనులు చేస్తే.. ఆ ప‌నుల‌ను అనుసరిస్తాయి.

Cats walking Exer size in Video viral

Advertisement

తాజాగా కొన్ని పిల్లులు ఫిట్ నెస్ కోసం జిమ్ లో వాక‌ర్ పై ఓ పిల్లి వాక్ చేస్తోంది. మ‌రో పిల్లి వ‌చ్చే అదే ఫాలో అయింది. ఇలా మ‌రో పిల్లి అదే ప‌నిచేసింది. మ‌నుషుల‌కంటే మేం కూడా త‌క్కువేం కాదు అన్న‌ట్లు తెగ వాక్ చేస్తున్నాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు వావ్.. సో క్యూట్.. క్యాట్ వాక్.. నేను న‌వ్వ‌కుండా ఉండ‌లేక‌పోతున్నాను.. అంటు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి సంబ‌ర‌ప‌డిపోతున్నారు. మీరు కూడా ఈ వీడియోను చూసి ఓ కామెంట్ ప‌డేయండి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి