Viral video : చత్తీస్‌ఘఢ్ లో దారుణం.. 150 అడుగుల హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన ప్రేమికులు.. వీడియో వైరల్..!!

Advertisement

Viral video : ప్రేమికుల మధ్య గొడవలు సర్వసాధారణం. ఈ క్రమంలో కొంతమంది అలిగి.. కొన్ని రోజులు మాట్లాడరు. మరి కొంతమంది గొడవపడితే గంటలోనే కలిసిపోతారు. ఇంకా గొడవ పెరిగితే చేతిలో సెల్.. లేదా ఎదురుగా ఉన్న వ్యక్తి చంప పగలగొడతారు. ఎన్ని గొడవలు జరిగిన గాని చివర ఆఖరికి ప్రేమికులు కలిసి పోతారు. ఇది కామన్ గా ప్రేమికుల మధ్య జరిగే పరిస్థితి.

Advertisement

కానీ చత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో ప్రేమికుల మధ్య జరిగిన గొడవ చివరకి 150 అడుగుల హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కేలా చేసింది. ప్రియుడితో గొడవపడి అలిగిన ప్రియురాలు మొదటగా టవర్ ఎక్కగా నీ వెంటే నేను అంటూ ప్రియుడు కూడా ఆమె వెంట టవర్ ఎక్కాడు. అరగంట తరువాత ఇద్దరూ కలిసి కిందకి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏకంగా హై టెన్షన్ విద్యుత్ వైర్ టవర్ చిట్టచివరికి ఇద్దరు చేరుకోవటం.. కిందనున్న అందరికీ ఒక్కసారిగా టెన్షన్ పుట్టించింది.

Advertisement
chhattisgarh lovers climbed 150 feet high tension electricity pole Viral video
chhattisgarh lovers climbed 150 feet high tension electricity pole Viral video

ఈ క్రమంలో ప్రేమికులకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా కిందకు చేరుకోవటంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఐటెన్షన్ విద్యుత్ స్తంభం ఎత్తున ప్రియురాలు చనిపోతా..అంటూ భయపెట్టిచ్చే ప్రయత్నం చేయటంతో వెంటనే రక్షించటానికి బుజ్జగించడానికి.. రెండు సైతం ప్రాణాలు లెక్క చేయకుండా పైకి వెళ్ళటం విశేషం.

Advertisement
Advertisement