Viral Video : షాకింగ్ వీడియో.. రోడ్డు మీద వెళ్తున్న బాలుడిపై కాకి దాడి.. తర్వాత ఏం జరిగిందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : షాకింగ్ వీడియో.. రోడ్డు మీద వెళ్తున్న బాలుడిపై కాకి దాడి.. తర్వాత ఏం జరిగిందో తెలుసా?

Viral Video : సాధారణంగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏవైనా జంతువులు అటాక్ చేస్తుంటాయి. జంతువులు అంటే అడవిలో ఉండే జంతువులు కాదు.. కుక్క, పిల్లి లాంటివి. కానీ.. పక్షులు అటాక్ చేయడం ఎక్కడైనా చూశారా? ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ.. అదే నిజం. నిజానికి.. అడవుల్లో అయితే.. జంతువులతో పాటు.. గద్ద లాంటి కొన్ని పక్షులు మనుషుల మీద అటాక్ చేస్తుంటాయి. కానీ.. చాలామటుకు ఏ పక్షి కూడా మనిషికి హాని చేయదు. కానీ.. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 December 2021,7:40 pm

Viral Video : సాధారణంగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏవైనా జంతువులు అటాక్ చేస్తుంటాయి. జంతువులు అంటే అడవిలో ఉండే జంతువులు కాదు.. కుక్క, పిల్లి లాంటివి. కానీ.. పక్షులు అటాక్ చేయడం ఎక్కడైనా చూశారా? ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ.. అదే నిజం. నిజానికి.. అడవుల్లో అయితే.. జంతువులతో పాటు.. గద్ద లాంటి కొన్ని పక్షులు మనుషుల మీద అటాక్ చేస్తుంటాయి.

కానీ.. చాలామటుకు ఏ పక్షి కూడా మనిషికి హాని చేయదు. కానీ.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు.ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ పక్షి.. చూడటానికి అచ్చం కాకిలా ఉంది. ఓ బాలుడు.. స్కేటింగ్ లాంటి వస్తువు మీద జారుకుంటూ రోడ్డు మీద వెళ్తుండగా.. సడెన్ గా వచ్చి బాలుడి మీద దాడి చేయబోయింది.

crow attacks boy video goes viral

crow attacks boy video goes viral

Viral Video : బాలుడు వెళ్తుండగా అటాక్ చేసిన కాకి

దీంతో ఆ బాలుడు చాలా భయపడ్డాడు. వామ్మో.. అంటూ అరుస్తూ.. ఇంకా వేగంగా ఆ వస్తువుతో పరిగెత్తడం చేశాడు.ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. వాళ్లు వీడియో తీస్తూ నవ్వడం వీడియోలో గమనించవచ్చు. ఆ బాలుడు మాత్రం చాలా భయపడ్డాడు. వీడియో తీస్తూ నవ్వే బదులు ఆ పిల్లాడిని పక్షి బారి నుంచి కాపాడొచ్చు కదా.. అంటూ నెటిజన్లు.. ఆ వీడియో తీసిన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/CatchingPlus/status/1466102611212439555?s=20

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది