Viral Video : దొంగతనం నెపంతో దళితుడిని తలకిందులుగా వేలాడదీసి చావబాదుడు.. వీడియో !!

Advertisement

Viral Video : దేశంలో రోజురోజుకీ దళితులపై దాడులు పెరిగిపోవడం తెలిసిందే. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న గాని దళితులపై దాడులు జరుగుతూనే మరోపక్క అంటరానితనం పెరిగిపోతోంది. ఆడవాళ్ళపై అత్యాచారాలు.. ఎలా జరుగుతున్నాయి అదే రీతిలో దేశంలో దళితుల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని దశాబ్దాల కాలం నుండి దేశాన్ని వెంటాడుతున్న ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రం మందమర్రిలో మేకను దొంగతనం చేశాడనే నెపంతో..

Advertisement

దళిత యువకుడిని తలకిందులుగా వేలాడదీసి.. కింద పొగ పెట్టి మేక కాపరి.. చావబాదాడు. పూర్తి వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన కొమ్మురాజుల రాములకి మేకల మంద ఉన్నాయి. ఈ క్రమంలో ఒక మేక కనిపించకపోవడంతో… దళితుడైన చిలుముల కిరణ్, తేజ పై అనుమానంతో… మేకల దొడ్డికి పిలిపించాడు. వెంటనే వాళ్ళిద్దరిని వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు.

Advertisement
dalit hanged upside down Beat Viral Video
Viral Video : దొంగతనం నెపంతో దళితుడిని తలకిందులుగా వేలాడదీసి చావబాదుడు.. వీడియో !!

విషయం వెలుగులోకి రావడంతో పాటు వీడియో కూడా బయటపడటంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఎన్నికలు జరిగే వాతావరణం సమయంలో ఈ ఘటన సంచలనంగా మారింది. చేతులను కట్టేసి కాళ్ళను వేలాడదీసి క్రింద పొగ పెట్టి… అత్యంత దారుణంగా చావబాదుడు వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి.

 

Advertisement
Advertisement