Hari Teja : హరితేజ ఎన్నాళ్లకి కనిపించింది.. ఆమె అదే అందంతో..!
Hari Teja : నటి హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెరపై మొదట్లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన హరితేజ ఆ తర్వాత నటిగా పలు సీరియల్స్, సినిమాలలో నటించి అలరించింది. నితిన్, సమంత నటించిన అఆ సినిమాలో హరితేజ పోషించిన మంగమ్మ పాత్ర అందరి మనసులలో మెదులుతూనే ఉంటుంది. ఇక కెరీర్ ఆరంభంలో మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, కన్యాదానం, తాళికట్టు శుభవేళ, శివరంజని వంటి ధారావాహికల్లో నటించింది. అలాగే సిక్త్స్ సెన్స్, పటాస్, పండగ చేస్కో, సూపర్ సింగర్ వంటి టీవీ షోల్లోనూ సందడి చేసింది. ఇ క బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుది.
అత్తారింటికి దారేది, నేనొక్కడినే, దువ్వాడ జగన్నాథం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, కృష్ణార్జున యుద్ధం, సమ్మోహనం, ఎఫ్ 2, రాజుగారి గది 3, హిట్, జాంబిరెడ్డి, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే తదితర సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. చిరంజీవి భోళాశంకర్‌లోనూ తళుక్కున మెరిసింది. తన మాటల గారడీతో మెప్పించే హరితేజ టాలీవుడ్ తెరపై మరో సూర్యకాంతంగా పేరుతెచ్చుకున్నారు హరితేజ. ఇక ఈ అమ్మడు 2015లో బెంగళూరుకు చెందిన దీపక్ అనే వ్యక్తిని పెళ్లాడిందీ అందాల తార. వీరికి 2021లో భూమి అనే కుమార్తె జన్మించింది. అమ్మయిన తర్వాత కొద్దిగా బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత చాలా స్లిమ్‌గా మారిపోయింది.
Hari Teja : హరితేజ ఎన్నాళ్లకి కనిపించింది.. ఆమె అదే అందంతో..!
నటి, యాంకర్ హరితేజ చాలా రోజుల తర్వాత ఆ ఒక్కటి అడక్కు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా అందాలు ఆరబోస్తూ కనిపించింది.ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన యాంకర్ హరితేజ ఈ మధ్య కాలంలో మోడ్రన్ లుక్‌తో ఇచ్చిపడేస్తుంది. తాజాగా ఆ ఒక్కటీ అడక్కు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయిన హరితేజని చూసిన నెటిజన్లు అప్పటికీ ఇప్పటికీ ఎంత ఛేంజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం హరితేజ లుక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ భామ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలపై సినిమాలు వస్తే చాలా హ్యాపీ అని ఆ ఒక్కటి అడక్కు సినిమా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని చెప్పుకొచ్చంది.
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
This website uses cookies.