Viral Video : పవిత్ర ప్రదేశంలో ఇవేం పనులు.. నదిలో స్నానం చేస్తూ రొమాన్స్ చితకబాదిన జనం
Viral Video : కొంతమంది పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోతుంటారు. అయితే ఇలాంటివి ఏ పార్కులోనో నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగితే పెద్దగా పట్టించుకోరు. కానీ.. టెంపుల్స్ లాంటి పవిత్రమైప ప్రాంతాల్లో చేస్తే మాత్రం సహించరు. పవిత్రమైన ప్లేసెస్ లో ఇలాంటి పనులు చేస్తే చితకబాదుతుంటారు. ఎక్కువగా ప్రేమజంటలు, కొత్తగా పెళ్లైన జంటలు కొందరు ఇలా విచ్చలవిడిగా పబ్లిక్ లో ప్రవర్తిస్తుంటారు. కొందరు సరదగా గడిపే సమయంలో అత్యుత్సాహాన్ని చూపిస్తుంటారు.
పక్కన జనం ఉన్నరన్న సంగతే మరచి తమ పనిలో బిజీగా ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరిగింది. శ్రీరాముడిని దర్శించుకునేందుకు ఓ జంట ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ప్రవహించే పవిత్ర సరయూ నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. వీరితో పాటు చాలా మంది భక్తులు కూడా అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే చుట్టూ జనం చూస్తుండగానే భర్త భార్యకు ముద్దు పెట్టాడు. ఈ కమంలో ఇద్దరి ప్రవర్తన శృతిమించింది.

husband and wife enjoying in sarayu river in ayodhya city in uttar pradesh
దీంతో అక్కడే స్నానాలు చేస్తున్న భక్తులు పవిత్ర ప్రదేశంలో ఇలాంటి పనులు చేస్తారా అని అతడిని చితకబాదారు. నది నుంచి బయటకు లాక్కుంటూ తీసుకొచ్చి కొట్టారు. భార్య అడ్డం పడుతున్నా వినకుండా తిడుతూ కొట్టారు. ఇక ఓ వ్యక్తి వారిని అడ్డుకుని ఆ జంటను బయటకు పంపాడు. ఈ ఘటన కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పోలీసులకు చేరడంతో దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022