Viral Video : వామ్మో.. ఈ కుక్కకు ఎంత కోపం.. తన అందమైన ఆడ ఓనర్ కు చిలుక ముద్దు పెడితే ఏం చేసిందో చూడండి

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 December 2021,7:15 am

Viral Video : కుక్కలు విశ్వాసానికి మారు పేరు అంటారు. మనుషులకన్నా.. కుక్కలు వందపాళ్లు నయం అంటారు. అది నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. అవును.. కుక్కకు ఇంద ముద్ద పడేస్తే.. రాత్రంతా మనకోసం కాపలా కాస్తాయి. దొంగలను పరిగెత్తిస్తాయి. అది కుక్కలకున్న విశ్వాసం. ఆ విశ్వాసం ఇంకా వేటికీ ఉండదు అంటారు.

అందుకే కుక్కల కోసం మనం ఎంతో చేస్తాం. కొందరు కుక్కలను పెంచుకుంటారు. వాటిని తమ సొంత కుటుంబ సభ్యులలా చూసుకుంటారు.ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతికి పెట్ డాగ్ ఉంది. అలాగే.. చిలుకను కూడా ఆ యువతి పెంచుకుంటోంది. ఆ చిలుకను తన చేతి వేళ్ల మీద కూర్చోబెట్టుకుంది ఆ యువతి.

jealous dog fight with parrot video viral

jealous dog fight with parrot video viral

Viral Video : చిలుకపై తన కోపం చూపించిన కుక్క

తర్వాత ఆ చిలుక.. తన బుగ్గ మీద ముద్దు పెట్టింది.అలా రెండు మూడు సార్లు చిలుక ముద్దు పెట్టబోయింది. దీంతో.. పక్కనే ఉన్న తన పెట్ డాగ్ కు చిలుక ముద్దు పెట్టడం నచ్చలేదు. దీంతో వెంటనే ఆ చిలుకను తన కాళ్లతో నెట్టేసింది. ఈ ఘటనను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అమ్మో.. ఓనర్ మీద ఇంత విశ్వాసమా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

https://twitter.com/guldurbakalim/status/1470846509168345090

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి